పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
డ్రోన్లు, డ్రోన్ భాగాల కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ - ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక) పథకం కోసం దరఖాస్తులను ఆహ్వానించిన పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ
ఆర్తిక సంవత్సరం 2021-2022కి పిఎల్ఐ అర్హత ప్రభావసీమను దాటిన కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు
దరఖాస్తులను సమర్పించడానికి ఆఖరు తేదీ 20 మే 2022
Posted On:
05 MAY 2022 10:44AM by PIB Hyderabad
మొత్తం ఆర్ధిక సంవత్సరానికి (1 ఏప్రిల్ 2021 నుంచి 31 మార్చి 2022 ) పిఎల్ ఐ అర్హతను సాధించిన ముందుకువెళ్ళిన డ్రోన్లు, డ్రోన్ విడిభాగాలను ఉత్పత్తి చేసే తయారీదారుల కోసం దరఖాస్తు గవాక్షాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (ఎంఒసిఎ) ప్రారంభించింది. అటువంటి ఉత్పత్తిదారులు తమ దరఖాస్తును https://www.civilaviation.gov.in/application-pli-scheme అన్న లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా సమర్పించవచ్చు.
ఎంఒసిఎ మంత్రిత్వ శాఖ 4మే 2022న జారీ చేసిన ఉత్తర్వును దిగువన ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చుః https://www.civilaviation.gov.in/sites/default/files/Application%20for%20PLI%20scheme%20for%20drones%20and%20drone%20components.pdf
తమ దరఖాస్తులను సమర్పించేందుకు గడువు 20మే 2022న 23.59 గంటల వరకు.వారి ఆర్ధిక ఫలితాలు, ఇతర నిర్దేశిత పత్రాల విస్త్రతమైన పరిశీలన అనంతరం పిఎల్ఐ లబ్ధిదారుల అంతిమ జాబితాను 30 జూన్ 2022 నాటికి విడుదల చేస్తారని అంచనా.
పదినెలల కాలానికి (1 ఏప్రిల్ 2021 నుంచి 31 జనవరి 2022)వరకు తమ దరఖాస్తులను సమర్పించిన పిఎల్ఐ దరఖాస్తుదారుల ఆర్ధిక ఫలితాల ఆధారంగా 14మంది పిఎల్ఐ లబ్ధిదారుల తాత్కాలిక జాబితాను 20 ఏప్రిల్ 2022న ఎంఒసిఎ ప్రచురించింది. వీరిలో ఐదుగురు డ్రోన్ ఉత్పత్తిదారు, తొమ్మిదిమంది డ్రోన్ భాగాల ఉత్పత్తిదారులు ఉన్నారు. ఏప్రిల్ 20 ఎంఒసిఎ జారీ చేసిన ఉత్తర్వులను ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చుఃhttps://www.civilaviation. gov.in/sites/ default/ files/Public%20Notic.pdf
డ్రోన్లు, డ్రోన్ భాగాల కోసం ఉద్దేశించిన పిఎల్ఐ పథకానికి అర్హత ప్రమాణాలలో డ్రోన్ల కంపెనీ అయితే వార్షిక అమ్మకాలు రూ. 2 కోట్లు ఉండాల్సి ఉండగా, డ్రోన్ భాగాల ఉత్పత్తిదారులకు రూ. 50 లక్షల టర్నోవర్ ఉండాలి. దీనితో పాటుగా, అమ్మకాల టర్నోవర్‌లో దాదాపు 40% అదనపు విలువను సాధించి ఉండాలి.
డ్రోన్లు, డ్రోన్ విడిభాగాల కోసం పిఎల్ఐ పథకాన్ని 30 సెప్టెంబర్ 2021న నోటిఫై చేశారు. ఈ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరంలో అన్ని దేశీయ డ్రోన్ ఉత్పత్తిదారుల ఉమ్మడి టర్నోవర్‌కన్నా దాదాపు రెండింతలుగా రూ. 120 కోట్ల ప్రోత్సహకాన్ని మూడేళ్ళపాటు ఇస్తున్నారు. ఇతర పిఎల్ఐ పథకాలతో పోలిసే్త 20% విలువ జోడించిన పిఎల్ఐ రేటు అన్నది అత్యధికం. డ్రోన్లు, డ్రోన్ భాగాలకు పిఎల్ఐ పథకం వివరాలను ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా చూడవచ్చుః https://egazette.nic.in/ WriteReadData/2021/230076.pdf
పిఎల్ఐ పథకమే కాకుండా, 2030నాటికి భారతదేశాన్ని అంతర్జాతీయ డ్రోన్ కేంద్రంగా తయారుచేయడానికి భారతప్రభుత్వం సంస్కరణల పరంపరను చేపట్టింది. ఇందులో సరళీకృత డ్రోన్ నిబంధనలు, 2021; డ్రోన్ ఎయిర్ స్పేస్ మ్యాప్ 2021 ప్రచురణ ఉన్నాయి. ఇది దాదాపు 90% భారతీయ గగనతలాన్ని గ్రీన్ జోన్‌గా స్థాపిస్తుంది, యుఎఎస్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ (యుటిఎం) విధాన చట్రం 2021; డ్రోన్ తయారీదారులు టైప్ డ్రోన్ సర్టిఫికెట్ పొందడాన్ని సర్టిఫికేషన్ పథకం 2022 సులభరం చేస్తుంది; విదేశాలలో తయారు చేసిన డ్రోన్లను దిగుమతి చేసుకోవడాన్ని నిషేధించే డ్రోన్ దిగుమతి విధానం, 2022, డ్రోన్ ఆపరేషన్ల కోసం డ్రోన్ పైలెట్ల అవసరాన్ని రద్దు చేసే డ్రోన్ (సవరణ) నిబంధనలు 2022 ఇందులో ఉన్నాయి.
***
(Release ID: 1822957)
Visitor Counter : 141