యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జాతీయ యువజన విధానం ముసాయిదాపై సూచనలను ఆహ్వానించిన యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

Posted On: 05 MAY 2022 11:41AM by PIB Hyderabad

కేంద్ర  ప్రభుత్వం ప్ర‌స్తుతం ఉన్న జాతీయ యువజన విధానం- 2014 ముసాయిదాను సమీక్షించింది, కొత్త జాతీయ యువజన విధానం (ఎన్‌వైపీ) ముసాయిదాను సిద్ధం చేసింది. ఎన్‌వైపీ ముసాయిదా 2030 నాటికి భారతదేశం సాధించాలనుకునే యువత అభివృద్ధికి సంబంధించిన  పదేళ్ల దృష్టి కోణాన్ని ఇది కలిగి ఉంది. ఇది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలతో (ఎస్‌డీజీలు) పాటుగా సమలేఖనం చేయబడింది. 'భారతదేశాన్ని పురోగమింపజేయడానికి యువత సామర్థ్యాన్ని మ‌రింత విస్తృతం చేయ‌డానికి ఇది ఎంత‌గానో  ఉపయోగపడుతుంది. ముసాయిదా ఎన్‌వైపీ చదువు; ఉపాధి & వ్యవస్థాపకత; యువ నాయకత్వం & అభివృద్ధి; ఆరోగ్యం, ఫిట్‌నెస్ & క్రీడలు; మరియు సామాజిక న్యాయం అనే ఐదు ప్రాధాన్యత రంగాలలో యువత అభివృద్ధిపై విస్తృతమైన చర్యల‌ను ఉత్ప్రేరకపరచడానికి ప్రయత్నిస్తుంది. అట్టడుగు వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సామాజిక చేరిక సూత్రం ద్వారా ప్రతి ప్రాధాన్యతా ప్రాంతం ఆధారప‌డి రూపొందించ‌డ‌మైంది. యువజన వ్యవహారాల విభాగం అన్ని భాగ‌స్వామ్య పాక్షాల వారి  నుండి  ముసాయిదా ఎన్‌వైపీ పై వ్యాఖ్యలు, వీక్షణలు/సూచనలను కోరుతోంది. ముసాయిదా విధానంపై వ్యాఖ్యలు/వీక్షణలు/సూచనలను 45 రోజులలోపు (జూన్ 13, 2022 నాటికి) ఈ-మెయిల్ ద్వారా dev.bhardwaj[at]gov[dot]in లేదా policy-myas[at]gov[dot]inకు పంపవచ్చు.
ముసాయిదా జాతీయ యువజన విధానం  కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

***


(Release ID: 1822918) Visitor Counter : 211