యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2047నాటికి ఒలింపిక్ క్రీడల్లో 5 అగ్రదేశాల సరసన భారత్!


ప్రధాని మోదీ రోడ్ మ్యాప్ లక్ష్యం ఇదే..
ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్
ముగింపు ఉత్సవంలో అమిత్ షా ప్రకటన,
క్రీడాకారులకు, ఆతిథ్య జైన్ వర్సిటీకి ప్రశంసలు

ఒలింపిక్స్ లో చారిత్రాత్మక ప్రతిభ కనబరిచిన
భారతీయ పురుషుల, మహిళల జట్లకు సత్కారం..


ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, ఫిట్ ఇండియా
యూత్ గేమ్స్.. ప్రధాని దార్శనికత ఫలితమే:
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్

Posted On: 03 MAY 2022 9:03PM by PIB Hyderabad

   ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడోత్సవం వైభవంగా ముగిసింది. కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్-2021 ముగింపు ఉత్సవం నిర్వహించారు. దేశంలోని యువ, ఔత్సాహిక క్రీడాకారులు, అథ్లెట్లు తమ విశ్వవిద్యాలయాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేందుకు ఈ క్రీడలను ఒక వేదికగా వినియోగించుకున్నారు.

   క్రీడల ముగింపు ఉత్సవానికి కేంద్ర హోమ్ సహకార శాఖ మంత్రి అమిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రీడల్లో అద్భుతంగా రాణించి 20 స్వర్ణపతకాలు, 7 రజత పతకాలు, 5 కాంస్య పతకాలు గెలిచిన ఆతిథ్య విశ్వవిద్యాలయం జైన్ డీమ్డ్ యూనివర్సిటీకి ఓవరాల్ చాంపియన్ షిప్ టైటిల్ ను అమిత్ షా  ప్రదానం చేశారు. పంజాబ్ కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ 17 స్వర్ణ పతకాలు, 15 రజత పతకాలు, 19 కాంస్య పతకాలు గెలుచుకుని రెండవ స్థానం కైవసం చేసుకుంది. ఇదివరకటి విజేత పంబాజ్ విశ్వవిద్యాలయం 15 స్వర్ణ పతకాలు, 9 రజతపతకాలు, 24 కాంస్య పతకాలు గెలుచుకుని పతకాల పట్టికలో 3వ స్థానంలో నిలిచింది.

https://ci5.googleusercontent.com/proxy/D6Y9egpFK-9wl47xpPtPg77WGkaCN03kzOcVyPTGG5cF-aLIjFhbASfS7yiHacsRcrkFyp45zKRB09866wBGNOO0YkyUm6LLZcVuqNNOs5dyS6S3qjaC7FJuyw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0019SBU.jpg

  ముగింపు ఉత్సవంలో కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి నిశీత్ ప్రమాణిక్ కూడా పాల్గొన్నారు.

  టోక్యో ఒలింపిక్ క్రీడల్లో అద్భుతమై ప్రతిభను చూపిన  భారతీయ పురుషుల, మహిళ హాకీ జట్లు ఈ ముగింపు ఉత్సవంలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉభయ జట్లను కేంద్ర మంత్రి అమిత్ షా సముచిత రీతిలో సత్కరించారు. కర్ణాటక సినీ ఐకాన్ కిచా సుదీప్ కూడా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ముగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. 

 

https://ci5.googleusercontent.com/proxy/aksj9hVjed_RNp2DFrTKjkAmnY_4uL93YwsmApj59JordfqF2QequK2p5x4mbQtYhyYWEvwpGU-mMVuHIS0R8xVN2fLqGqJe12wfhNzf3WG5dJPksK4gzxLnjA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002B2YE.jpg

  ఎ.ఎల్.యు. రూపొందించిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ కాఫీ టేబుల్ బుక్.ను కేంద్రమంత్రి అమిత్ షా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడోత్సవంలో పాలుపంచుకున్న అన్ని విశ్వవిద్యాలయాల క్రీడాకారులను తాను అభినందిస్తున్నట్టు చెప్పారు. "ఈ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులందరూ ప్రశంసలకు అర్హులే. గెలవడం, ఓడటం అన్నది క్రీడల్లో భాగం. అయితే క్రీడల్లో పాల్గొనడం మాత్రమే ముఖ్యం. క్రీడలతో సహా, ప్రతి రంగంలోనూ భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2014నుంచి కృషి చేస్తున్నారు. ఆయన ఏనాడు సమస్యల గురించి ఆందోళన చెందలేదు. అయితే, చక్కని ప్రణాళికతో, శ్రమతో ముందుకు వెళ్లారు. ఫలితాలను సాధించే మార్గాన్ని కనుగొన్నారు. క్రీడలకు సంబంధించి ప్రధానమంత్రి మోదీ అనేక చర్యలు తీసుకున్నారు. ఈ రోజున వాటి ఫలితాలను మనం చూస్తున్నాం." అని అమిత్ షా అన్నారు.

https://ci5.googleusercontent.com/proxy/b9hs3L9beUI9qWYdsa-wv_nEhgd3LNztsMAWXkC9gLxKl3V2zQKfwnfsg67LgPKDF14PXwiVoPHKuV8NGytPfsNZyofAf9XN6CkLtb9TL9ahUxMVf73la-aOEA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003N5YA.jpg

  "క్రీడలు మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశమని క్రీడాకారులందరికీ చెప్పదలుచుకున్నాను. క్రీడల్లో పాల్గొనే వారు జీవితంలో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. జీవితంలో పరాజయాన్ని ఎదుర్కొనగలిగే ధైర్యాన్ని క్రీడలే మనకు అందిస్తాయి.  విజయాన్ని సాధించాలనే ఆకాంక్షను అప్పుడే మీరు అభివృద్ధి చేసుకుంటారు. ఒలింపిక్ క్రీడల్లో మన క్రీడాకారులు మనకు గర్వకారణంగా నిలిచారు. 2020లో టోక్యో ఒలింపిక్ క్రీడల్లో, ప్యారా ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం ఇదివరకు ఎన్నడూ లేని రీతిలో పతకాలు సాధించడం ఎంతో అభినందనీయం. 2047వ సంవత్సరానికి అంటే,.. వందేళ్ల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునేనాటికి ఒలింపిక్స్ క్రీడల్లో మొదటి ఐదు అగ్రదేశాల సరసకు భారత్ చేరేలా ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రధానమంత్రి మోదీ రూపొందించారు." అని అమిత్ షా అన్నారు.

https://ci6.googleusercontent.com/proxy/wPcjWeJai9nwjCJZA7iWj4fQdcG1lAh4XDabsfyHZLOer_YkoeeEM545Iivcbsk_wcnPzfnHHizl96_sHOSU4otF__OXetuGf_f0TN6usKdiTNW4lsS8fR04jA=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004G4PQ.jpg

  కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారుల కృషిని, ఆతిథ్య విశ్వవిద్యాలయం జైన్ యూనివర్సిటీని అభీనందించారు. "ప్రధానమంత్రి దార్శనిక భావనతోనే ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా  క్రీడలు రూపుదాల్చాయి. ఈ ఏడాది బెంగుళూరులో ద్వితీయ ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడోత్సవం జరుపుకోవడం ఎంతో సంతోషదాయకం. కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తితో ఎన్ని సమస్యలు ఎదురైనా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అద్భుతంగా జరగడం ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను. ఈ సంవత్సరం ఖేలో ఇండియా గేమ్స్.లో క్రీడాకారులు 2 జాతీయ రికార్డులను బద్దలు కొట్టారు.. ఇదివరకటి 76 రికార్డులను కూడజా అధిగమించారు." అని ఠాకూర్ అన్నారు.

  ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్-2021 పిస్టల్ కవర్.ను కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, క్రీడల నిర్వహణలో రాష్ట్రప్రభుత్వం, జైన్ విశ్వవిద్యాలయం చేసిన కృషిని అభినందించారు. "క్రీడల్లో పాల్గొనడం మానవులకు అతి సహజమైన అంశం. మనుషులందరి వ్యక్తిత్వ నిర్మాణం క్రీడలతోనే సాధ్యం.  జీవితంలో క్రీడాసామర్థ్యం ప్రాముఖ్యాన్ని క్రీడలే తెలియజేస్తాయి. గెలవడమో లేదా ఓటమి చెందడమో ఏదైనా సరే మీరు క్రీడల్లో పాల్గొనాల్సిందే. పరాజయ అంటే మనం భయపడరాదు. కానీ, గెలిచేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఖేలో ఇండియా అన్న దార్శనిక భావనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకు వచ్చారు. దేశం దిశను మార్చే అపారమైన శక్తి క్రీడలకు ఉంది. క్రీడల్లో దేశానికి కీర్తిప్రతిష్టలు తేవాలని నేను భారతదేశంలోని యువజనులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను." అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అన్నారు.

 

****


(Release ID: 1822480) Visitor Counter : 186