కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

టెలికాం, ఐసీటీలోని విభిన్నరంగాల్లో పరస్పర సహకారం కోసం సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్‌) మరియు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.


భారత ప్రభుత్వం యొక్క ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద తీసుకున్న ఈ నిర్ణయం టెలికాం, ఐసీటీ రంగాల్లో సమస్యల సులభ పరిష్కారానికి దోహదపడుతుంది.

Posted On: 02 MAY 2022 4:08PM by PIB Hyderabad

టెలికాం మరియు ఐసీటీ యొక్క విభిన్న రంగాలలో దేశీయ సాంకేతిక రూపకల్పన మరియు అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఏప్రిల్ 30, 2022 బెంగుళూరులో జరిగిన సెమికాన్ ఇండియా 2022 కార్యక్రమంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (C-DOT), టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖభారత ప్రభుత్వం మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ యొక్క స్వయంప్రతిపత్తి కలిగిన సైంటిఫిక్ సొసైటీ యొక్క ప్రధాన పరిశోధన అభివృద్ధి కేంద్రంమైన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC), మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి.  

కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి మరియు కేంద్ర  నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ ప్రెన్యూర్‌షిప్‌ శాఖల మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో జరిగిన ఈ అవగాహన ఒప్పందం సంతకం కార్యక్రమానికి సి-డాట్‌ డైరెక్టర్ డేనియల్ జెబరాజ్ మరియు సి-డాక్‌ డైరెక్టర్ జనరల్ శ్రీ మగేశ్‌ తోపాటు  ఇరు సంస్థలకు చెందిన సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.

ఈ అవగాహన ఒప్పందంతో ఇరు సంస్థలు తమ తమ డొమైన్‌లలో ఒకరి బలాన్ని పెంచుకోవడానికి మరొకరు పరస్పరం సహాయపడతాయి.

సి-డాట్‌ అనేది భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక ప్రధాన టెలికాం పరిశోధన అభివృద్ధి సంస్థఇది నారోబ్యాండ్ మరియు బ్రాడ్బ్యాండ్ స్విచింగ్ మరియు ట్రాన్స్మిషన్ నెట్వర్క్లుటెరెస్ట్రియల్ రేడియో సిస్టమ్లుఉపగ్రహ వ్యవస్థలుఆప్టికల్ కమ్యూనికేషన్ పరికరాలునెట్వర్క్ ప్రోటోకాల్స్అధునాతన పరిశోధన మరియు అభివృద్ధి కార్యకలాపాలతోపాటు భద్రతా పరిష్కారాలు మరియు నెట్వర్క్ నిర్వహణ వ్యవస్థలను నిర్వహిస్తోంది.  సి-డాట్‌ దేశంలో దేశీయ టెలికాం విప్లవానికి మూలకర్తగా గుర్తింపు పొందిందిమూడు దశాబ్దాలకు పైగా అనితరసాధ్యమైన పరిశోధన అభివృద్ధి ప్రయత్నాలతో భారతీయ భూవాతావరణానికి సరిపోయే స్వదేశీ డిజైన్డెవలప్మెంట్ మరియు టెలికాం టెక్నాలజీల ఉత్పత్తి, సాంకేతికతలో ముందంజలో ఉంది. అంతేకాకుండా ఇండియన్ టెలికాం నెట్వర్క్ యొక్క డిజిటలైజేషన్కు గణనీయంగా దోహదపడింది.

సి-డాక్‌ అనేది ఎలక్ట్రానిక్ మరియు ఐసీటీ టెక్నాలజీల రూపకల్పనఅభివృద్ధి మరియు విస్తరణ కోసం పనిచేస్తున్న ప్రధాన పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ.

సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీల సరిహద్దులను విస్తరించడంసాంకేతిక పరిష్కారాలునిర్మాణాలుసామాజిక ఆర్థిక పురోగతికి సంబంధించిన అప్లికేషన్లు అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉద్భవించిన సంస్థ. జాతీయంగా ముఖ్యమైన సమస్యలకు వ్యవస్థలు మరియు ప్రమాణాలుసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా భాషా అవరోధాలను అధిగమించడం ద్వారా త్వరిత మరియు ప్రభావవంతమైన జ్ఞాన వ్యాప్తిని సాధించడంఅనుభవాన్ని పంచుకోవడం మరియు సమాచార సాంకేతిక రంగంలో అధునాతన సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయం చేయడంసమాచార సాంకేతికత యొక్క ప్రయోజనాలను సమాజానికి అందుబాటులోకి తీసుకురావడంమరియు మేధో సంపత్తిని వ్యాపార అవకాశాలుగా మార్చుకోవడం ద్వారా దానిని ఉపయోగించుకోవడం వంటి అంశాలలో సేవలందిస్తోంది.

సి-డాట్‌ మరియు సి-డాక్‌ రెండూ 4జి/5జిబ్రాడ్బ్యాండ్, IOT/M2M, ప్యాకెట్ కోర్కంప్యూటింగ్ మొదలైన రంగాలలో కార్యకలాపాలను గుర్తించడం మరియు అభివృద్ధి చేయడంలో సహకరించడానికి మరియు ఉమ్మడిగా పని చేయడానికి అంగీకరించాయినిర్దిష్ట ప్రాజెక్టులకు సంబంధించి , నిర్దిష్ట అవసరాల్లో పోషించాల్సిన పాత్రలు, బాధ్యతలకు సంబంధించి ఒప్పందంపై సంతకాలు చేయబడ్డాయి.

  సందర్భంగాసి-డాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రాజ్కుమార్ ఉపాధ్యాయ మాట్లాడుతూ… సి-డాట్ తన స్వదేశీ ఆర్ అండ్ డి ప్రయత్నాలను సి-డాక్తో కలిసి దేశాభివృద్ధికి సంబంధించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి ఆసక్తిగా ఉందని అన్నారుసి-డాట్‌ మరియు సి-డాక్‌ రెండూ వారి సంబంధిత రంగాలలో అగ్రగామిగా ఉన్నాయని, ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఈ అవగాహన ఒప్పందం ఇరు సంస్థల పురోభివృద్ధికి దోహదపడడమే కాకుండా  ప్రపంచ స్థాయి సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ఉపకరిస్తుందన్నారు.

 

సి-డాక్‌ డైరెక్టర్ జనరల్ మగేష్ మాట్లాడుతూ.. అధునాతన సాంకేతిక రంగాలలో ఆర్‌ అండ్‌ డీలను నిర్వహించడానికి సి-డాట్‌ మరియు సి-డాక్‌మధ్య భాగస్వామ్యం దేశంలోని టెలికాం మరియు ఐసీటీ అవసరాలను తీర్చడంలో సహాయపడుతుందన్నారు.  ఇవన్నీ జాతీయ నెట్వర్క్లను బలోపేతం చేస్తాయని,  వాటిని సురక్షితంగా ఉంచడంతోపాటు అంతరాయాలు లేని కనెక్టివిటీని పెంచుతాయన్నారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ కలను సాకారం చేసే అధునాతన అప్లికేషన్‌లను అందిస్తాయన్నారు. సి-డాట్‌ దేశీయంగా 4జీ, ఎల్‌టీఈ సొల్యూషన్లను అభివృద్ధి చేసిందని, ప్రస్తుతం 5జీ టెక్నాలజీకి సంబంధించి కూడా సేవలందిస్తోందని.. ఈ రెండు సంస్థలు పరస్పరం గుర్తించిన ప్రాంతాలతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ అధునాతన పరిశోధనలు నిర్వహించడానికి సి-డాట్‌తో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నామన్నారు.  

 

"ఆజాదీ కా అమృత్ మహోత్సవ్వేడుకలో భాగంగా దేశం యొక్క డిజిటల్ పరివర్తన కోసం స్వదేశీ సామర్థ్యాలను పెంపొందించడానికి సి-డాట్‌ మరియు సి-డాక్‌ తమ దృఢ నిబద్ధతను పునరుద్ఘాటించాయి.

 

***(Release ID: 1822254) Visitor Counter : 245