పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కిషన్‌గఢ్ విమానాశ్రయంలో గగన్ ఆధారిత ఎల్‌పివి విధానాన్ని ఉపయోగించి విమాన ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఎఎఐ
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇటువంటి మైలురాయిని సాధించిన తొలిదేశంగా నిలిచిన భారత్
Posted On:
28 APR 2022 4:28PM by PIB Hyderabad
ఎల్‌పివి పద్ధతి విధానాల ఆధారంగా గగన్ (జిపిఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్)ను వినియోగించి రాజస్థాన్ లైట్ ప్రయోగాన్ని కిషన్ గఢ్ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ) గురువారం విజయవంతంగా నిర్వహించింది. విమాన యాన సేవల (ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ - ఎఎన్ఎస్) క్షేత్రంలో ఈ ప్రయోగం భారతీయ పౌర విమానయాన క్షేత్ర చరిత్రలో ఒక ప్రధాన మైలు రాయిగా, విజయంగా నిలుస్తుంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇటువంటి గొప్ప మైలురాయిని సాధించిన తొలి దేశం భారత్.
భూమి ఆధారిత చోదనమౌలిక సదుపాయాల అవసరం లేకుండా ఎల్‌పివి (లోకలైజర్ పెర్ఫార్మెన్స్ విత్ వెర్టికల్ గైడెన్స్) అన్నది సిఎటి- ఐఐఎల్ఎస్ కు దాదాపు సమానంగా కార్యకలాపాలు నిర్వహించగల విమాన మార్గరద్శక విధానాలకు అనుమతిస్తుంది. ఈ సేవలు ప్రధానంగా, ఇస్రో ప్రయోగించిన జిపిఎస్, గగన్ జియో స్టేషనరీ ఉపగ్రహాలు (జిశాట్-8, జిశాట్ -10, జిశాట్ -15) అందుబాటుపై ఆధారపడి ఉంటాయి.
గగన్ అన్నది ఇండియన్ శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టం ( పలు ఉపగ్రహాలను ఉపయోగించుకుంటూ విస్త్రత ప్రాంతాన్ని సమాచారాన్ని అందించడం - ఎస్‌బిఎస్)ను ఎఎఐ, ఇస్రో సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. భూమధ్యరేఖ ప్రాంతంలోని భారత్, పొరుగుదేశాలు కోసం అభివృద్ధి చేసిన తొలి వ్యవస్థ ఇది. గగన్ వ్యవస్థను 2015లో డిజిసిఎ క్షితిజలంబ మార్గదర్శ నం తో (ఎపివి 1), మార్గమధ్య (ఆర్ ఎన్‌పి 01) ఆపరేషన్ల కోసం సర్టిఫై చేసింది. ప్రపంచంలో కేవలం నాలుగు అంతరిక్ష ఆధారిత విస్త్రత వ్యవస్థలు భారత్ (గగన్), యుఎస్ (డబ్ల్యుఎఎఎస్), యూరప్ (ఇజిఎన్ఒఎస్), జపాన్ (ఎంఎస్ఎఎస్) మాత్రమే అందుబాటులో ఉన్నాయి. భూమధ్యరేఖ ప్రాంతంలో భారత్, దాని పొరుగుదేశాల కోసం అభివృద్ధి చేసిన అటువంటి తొలి వ్యవస్థ గగన్.
గగన్ సేవలను ఉపయోగించి ఇండిగో ఎయిర్ లైన్స్ 250 అడుగుల ఎల్‌పివితో ఇన్స్టుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్ (సాధాన పద్ధతి విధానాలు =ఐఎపి) ఎటిఆర్ విమానాన్ని ఎగురవేసింది. తొలి గగన్ ఎల్‌పివి విమాన పరీక్షలలో భాగంగా డిజిసిఎ బృందాన్ని ఎక్కించుకుని పరీక్షను కిషన్‌గడ్ విమానాశ్రయంలో ప్రయోగించారు. డిజిసిఎ అంతిమంగా ఆమోద ముద్రవేసిన తర్వాత ఈ విధానం వాణిజ్య విమానాలకు ఉపయోగించేందుకు అందుబాటులో ఉంటుంది.
ఉపగ్రహ ఆధారిత విధానమైన ఎల్పివిని గురువారం విమాన ల్యాండింగ్ కోసం కిషన్ గఢ్ విమానాశ్రయంలో (రాజస్థాన్) ఉపయోగించారు. ఎల్‌పివి పద్ధతులు చిన్న, ప్రాంతీయ, స్థానిక విమానాశ్రయాలు సహా ఖరీదైన ల్యాండింగ్ పరికర వ్యవస్థలు లేని విమానాశ్రయాలలో విమానం ల్యాండ్ అయ్యేందుకు అవకాశాన్ని కల్పిస్తాయి. విమానం ఎగిరే ఎత్తును 250 అడుగులకు తగ్గించాలన్న నిర్ణయం, ఉచిత వాతావరణ పరిస్థితులు, సరైన దృశ్యమానత లేని పరస్థితుల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో ఆపరేషన్లు నిర్వహించే లబ్ధిని కల్పిస్తాయి. ప్రెసిషన్ అప్రోచ్ కేపబిలిటీ ఎక్విప్‌మెంట్ (ఖచ్చితమైన విధాన సామర్ధ్యం కలిగిన పరికరాలు) లేని మారుమూల విమానాశ్రయాలకు కూడా లబ్ధి కలిగిస్తూ అధిక దృశ్యమానత అవసరమైన ఏ విమానాశ్రయమైనా విమానాన్ని ఆమోదిస్తాయి.
ప్రాంతీయ అనుసంధాన పధకం (ఆర్‌సిఎస్) కింద ఉన్న విమానాశ్రయాలు సహా వివిధ విమానాశ్రయాలను గగన్ ఆధారిత ఎల్‌పిసి ఇన్స్ట్రుమెంట్ అప్రోచ్ ప్రొసీజర్ల అభివృద్ధి కోసం సర్వే నిర్వహిస్తున్నారు. తద్వారా, తగిన సన్నద్ధతతో ఉన్న విమానం ల్యాండింగ్ సమయంలో మెరుగైన భద్రత, ఇంధన వినియోగంలో తగ్గింపు, జాప్యాలు, మళ్ళిపులు రద్దు తదితర అంశాలలో గరిష్ట ప్రయోజనాన్ని పొందగలదు. .
వరదలు, భూకంపాలు తదితర ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు, వంటి సందర్భంలో బెస్తవారికి, రైతులుకు, వైపరీత్యాలతో ప్రభావితమయ్యే ప్రజలకు గగన్ మెసేజ్ సర్వీస్ (జిఎంఎస్) ద్వారా సందేశాలు పంపడాన్ని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఐఎన్‌సిఒఐఎస్) సమన్వయంతో ఎఎఐ అమలు చేసింది. దీనితో పాటుగా, రైల్వేలు, సర్వే చేయడం, వ్యవసాయం, విద్యుత్ రంగం, మైనింగ్ తదితర విమానయాన సేవలు కాని క్షేత్రాలలో గగన్ ను ఉపయోగించేందుకు దాని అదనపు సామర్ధ్యాలను పరిశోధిస్తున్నారు.
గగన్ విధానాల రూపకల్పనకు విమానాశ్రయ పరిసరాలు, వాతావరణం, ఉపరితలాలపై ఆటంకాలు వంటి వాటి ఖచ్చితమైన సర్వే అవసరం. ఈ డాటా సంక్లిష్టమైన విమాన విధాన వ్యూహాలతో సంబంధాన్ని కలిగి ఉండటమే కాక రూపకల్పన చేసిన విధాన భద్రతను నిర్ధారించడానికి సాఫ్టవేర్‌లో సిమ్యులేట్ చేసి ఉంటుంది. ల్యాండింగ్ పరికరాల వ్యవస్థ సాయం లేకుండా దిగేందుకు భారత్‌లోని ఏ విమానాశ్రయానికై నా ఈ పద్ధతులను అభివృద్ధి చేయవచ్చు. ఈ ఎల్‌పివి పద్ధతులు దృశ్యమానత సరిగా లేని అంటే కేటగిరీ -1 ఇన్స్య్టమెంట్ ల్యాండింగ్ వ్యవస్థ (ఐఎల్ఎస్)లో ల్యాండ్ అయ్యే అవకాశాన్ని ఇస్తాయి. ప్రస్తుతం, ఎల్‌పివిపద్ధతులను తమ విమానదళంలో ఉపయోగించే సామర్ధ్యం ఉన్న ఇండిగో (35), స్పైస్‌జెంట్ (21), ఎయిర్ ఇండియా (15), గో ఫస్ట్ (04), ఎయిర్ ఏషియా (01), ఇతర సంస్థలును ఉపయోగిస్తున్నాయి. వాణిజ్య విమాన ఆపరేషన్ల కోసం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అటువంటి 22 పద్ధతులను అభివృద్ధి చేసింది, అందులో కొన్ని డిజిసిఎ నుంచి ఆమోదం పొందేప్రక్రియలో ఉన్నాయి. భారత ప్రభుత్వ చొరవ అయిన ఆత్మనిర్భర్ భారత్కు అనుగుణంగా, పౌర విమానాయాన రంగాన్ని మరింత స్వావలంబం చేసేందుకు పౌర విమానాశ్రయాలన్నింటికీ ఎల్‌పివి పద్ధతుల అభివృద్ధి కొనసాగుతోంది.
భారత్‌లో అటువంటి సాంకేతిక అభివృద్ధి పెంచడం ద్వారా ఎయిర్ నావిగేషన్ సేవల సమగ్రతను, కొనసాగింపును, అందుబాటుకు భరోసా ఇచ్చేందుకు ఎఎఐ అన్నిరకాలుగా కృషి చేస్తోంది. దీనితో, శాటిలైట్ ఆధారిత ల్యాండింగ్ ప్రక్రియ కలిగిన తొలి ఆసియా దేశంగా భారత్ అవతరిస్తోంది.
గగన్ ప్రోగ్రామ్‌ను రూపకల్పన చేసి, 2002 నుంచి అమలు చేస్తున్న ఇస్రోకు అధికారికంగా తమ అభినందనలు, ప్రశంసలు తెలియచేయాలని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భావిస్తోంది.గగన్ కార్యాచరణను ఖరారు చేయడంలో డిజిసిఎ అత్యంత క్రియాశీలకంగా ఉంది. కిషన్‌గఢ్‌లో సురక్షితమైన విమాన పరీక్షలు జరపడానికి సహకరించినందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ఎఎఐ అభినందిస్తోంది.
(Release ID: 1821489)
Visitor Counter : 179