విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మూడు రాష్ట్రాల్లో ఆర్ఈసీ ఆధ్వర్యంలో 'బిజిలీ ఉత్సవా'ల నిర్వహణ

Posted On: 29 APR 2022 1:15PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్  ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా - భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భాన్ని పురస్కరించుకుని, మణిపూర్, ఒడిశా,  ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ‘బిజిలీ ఉత్సవ్’లను నిర్వహించింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన (డీడీయూజీజేవై) కింద అన్ని గ్రామాలకు విద్యుత్ మౌలిక సదుపాయాలను విజయవంతంగా అందించిన నాలుగు సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 28న ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.  మొదటిసారిగా 28 ఏప్రిల్ 2018న డీడీయూజీజేవై పథకం కింద గ్రిడ్‌కు అనుసంధానమైన చివరి గ్రామం కాబట్టి, వేడుకలు జరిగిన గ్రామాలలో మణిపూర్‌లోని లీసాంగ్ గ్రామం ఒకటిగా నిలిచింది. దేశవ్యాప్తంగా గ్రామీణ విద్యుదీకరణ కార్యక్రమాన్ని గొప్ప విజయగాథగా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ గుర్తించింది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001SPGB.jpg

అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. అంతేగాక సమీప గ్రామాలు  జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. విద్యుత్‌ వల్ల కలిగే ప్రయోజనాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుద్దీకరణ సమయంలో ఎదురయ్యే సవాళ్లు, విద్యుత్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత జీవన నాణ్యత ఎలా మెరుగుపడిందనే అంశాలను ప్రముఖులు వివరించారు.  డీడీయూజీజేవై పథకం  వల్ల కలిగిన లాభాలను, వారి అనుభవాలను లబ్ధిదారులు ఈ సందర్భంగా వేదిక ద్వారా పంచుకున్నారు.  గ్రామస్తులతో మమేకమయ్యేందుకు, విద్యుత్ వినియోగం, బిల్లింగ్, ఇంధన సామర్థ్యం మొదలైన వాటిపై అవగాహన కల్పించేందుకు ‘నృత్యం  లోక్ గయాన్’ వంటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజలను చైతన్యవంతులను చేయడానికి వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై క్విజ్ కూడా నిర్వహించడం జరిగింది. పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎల్ ఈడీ బల్బులను బహుమతులుగా పంపిణీ చేయడంతో కార్యక్రమం ముగిసింది. పెద్ద సంఖ్యలో రద్దీ ఉన్నందున, సామాజిక దూరం పాటించడం, ముసుగులు ధరించడం వంటి అన్ని కోవిడ్ భద్రతా విధానాలను పాటించడం జరిగింది. హాజరైన వారందరికీ మాస్కులు పంపిణీ చేశారు.

***



(Release ID: 1821486) Visitor Counter : 188