యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2021 కార్యక్రమం విశ్రాంతి తీసుకోవడానికి ఒక అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమం:కేఐయూజీ అథ్లెట్లు


జైన్ యూనివర్శిటీకి చెందిన విద్యార్థులు 25 ఏప్రిల్ 2022 నుండి 02 మే 2022 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు హస్తకళల స్టాల్స్‌ను ప్రత్యేకంగా నిర్వహించేందుకు కలిసి వచ్చారు.

Posted On: 28 APR 2022 3:07PM by PIB Hyderabad

అథ్లెట్లు పగటిపూట పలు ఈవెంట్లలో కష్టపడుతున్న నేపథ్యంలో బెంగళూరులో ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2021కి ఆతిథ్యం ఇస్తున్న జైన్ యూనివర్శిటీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమం ద్వారా  25 ఏప్రిల్ 2022 నుండి 02 మే 2022 వరకు వారిని అలరించి, వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచే బాధ్యతను తీసుకున్నారు.

జైన్ యూనివర్శిటీ క్యాంపస్‌లోని పెద్ద మైదానంలో సాంస్కృతిక కార్యక్రమ నిర్వాహకులు ఎనిమిది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో నృత్యం, సంగీతం మరియు ఫ్యాషన్ ఇతర అంశాలతో కూడిన భారీ వేదికను నిర్మించారు. ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2021లో పాల్గొనే వారందరికీ (అథ్లెట్లు, కుటుంబం, వాలంటీర్లు మొదలైనవి) అందుబాటులో ఉండే కల్చరల్ ప్రోగ్రామ్, కావేరీ హస్తకళలు, జూట్ బ్యాగ్‌లు మరియు సహజ సబ్బులు వంటి ఆసక్తికరమైన వస్తువులతో కూడిన అనేక స్టాల్స్‌ను కూడా ఉన్నాయి. ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2021 నిర్వాహకులు క్యాంపస్‌లో ప్రజలందరూ సురక్షితంగా ఉండేలా పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసారు. అదే క్రమంలో రోజంతా క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

జైన్ యూనివర్సిటీకి చెందిన ఓవరాల్ కల్చరల్ కోఆర్డినేటర్ మరియు విద్యార్థిని నికితా సిల్ ఈ కార్యక్రమానికి ప్రదర్శనకారులను ఎలా ఎంపిక చేశారనే దాని గురించి మాట్లాడుతూ "జైన్ యూనివర్సిటీలోని అన్ని కళాశాలలు నృత్యం, సంగీతం మరియు ఫ్యాషన్ కోసం వారి స్వంత ప్రొఫెషనల్ టీమ్‌లను కలిగి ఉన్నాయి. కాబట్టి, ప్రతి ఒక్క సాంస్కృతిక కార్యక్రమంలో ప్రదర్శించబడే ప్రతి కళారూపాల కోసం కళాశాలలు తమ బృందాలను పంపాయి. విశ్వవిద్యాలయంలో ఆరు క్యాంపస్‌లు ఉన్నాయి మరియు ప్రతి క్యాంపస్ మొత్తం నాలుగు-ఐదు ప్రదర్శనలను ప్రదర్శిస్తోంది." అని తెలిపారు.

పంజాబీ యూనివర్శిటీకి చెందిన వాలీబాల్ క్రీడాకారిణి  వంశిక వర్మ తీవ్ర అలసట తర్వాత ఈ సాంస్కృతిక కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించారు, "సాంస్కృతిక కార్యక్రమంతో మేము చాలా ఆనందించాము. ఈవెంట్ ముగిసే సమయానికి ఒత్తిడి అంతా పోయింది. మేము క్వార్టర్-ఫైనల్స్‌లో ఓడిన తర్వాత మేము అక్కడికి వెళ్లాము, కాబట్టి ఓడిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి ఇది మంచి మార్గం. మేము బాలీవుడ్ మరియు పంజాబీ పాటలకు డ్యాన్స్ చేసాము." అని తెలిపారు.

వాలీబాల్ పోటీల్లో స్వర్ణం సాధించిన ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీలో భాగమైన ఎజిల్మతి డిపి మాట్లాడుతూ, "మేము మా సెమీ-ఫైనల్ మ్యాచ్ తర్వాత సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్ళాము, మేము వేదిక వద్ద నృత్యం చేసాము మరియు ప్రదర్శనలు మరియు అక్కడి సంగీతాన్ని కూడా ఆస్వాదించాము. మేము సెమీ-ఫైనల్‌లో గెలిచినప్పటికీ, మా ఫైనల్ గురించి మేము కొంచెం ఆందోళన చేదాము. కాబట్టి జట్టు సాంస్కృతిక కార్యక్రమానికి చేరుకోవడం మరియు సరదాగా గడపడం మంచిది." అని అభిప్రాయపడ్డారు.

ఖేలో ఇండియా యూనివర్శిటీ గేమ్స్ 2021లో పాల్గొన్న సిబ్బంది అందరూ రాబోయే కొద్ది రోజుల్లో ట్రీట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వారు ఏక్యామ్ డ్యాన్స్, స్టాండ్ అప్ కామెడీ, కాంటెంపరరీ డ్యాన్స్, కథక్ మరియు ఫ్రీ స్టైల్ డ్యాన్స్ వంటి అనేక ప్రదర్శనలను చూసే అవకాశాన్ని పొందుతారు.


 

*******



(Release ID: 1821189) Visitor Counter : 103