మంత్రిమండలి
azadi ka amrit mahotsav

లిథువేనియా లో భారతీయ మిశన్ నుతెరవడాని కి ఆమోదం తెలిపిన మంత్రిమండలి 

Posted On: 27 APR 2022 4:49PM by PIB Hyderabad

లిథువేనియా లో 2022వ సంవత్సరం లో ఒక కొత్త భారతీయ మిశన్ ను తెరవడాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది

లిథువేనియా లో ఇండియన్ మిశన్ ను తెరిస్తే భారతదేశాని కి దౌత్యపరమైన ఉనికి ని విస్తరించుకోవడం లోను, రాజకీయ సంబంధాల ను మరియు వ్యూహాత్మక సహకారాన్ని బలపరచుకోవడం లోను, ద్వైపాక్షిక వ్యాపారం, పెట్టుబడి, ఇంకా ఆర్థిక కార్యకలాపాల తాలూకు వృద్ధి కి మార్గాన్ని సుగమం చేయడం లోను, ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలపరచడం కోసం రంగాన్ని సిద్ధం చేయడం లోను, బహుపక్షీయ వేదికల లో మరింత నిలకడతనం తో కూడిన రాజకీయ సంబంధాల ను కొనసాగించడం కోసం అనుమతి ని ఇవ్వడంలోను మరియు భారతదేశ విదేశీ వ్యవహారాల విధానం యొక్క ఉద్దేశ్యాల కు సమర్ధన ను కూడగట్టడం లోను అండదండలు లభిస్తాయి. లిథువేనియా లో ఏర్పాటు చేసే ఇండియన్ మిశన్ భారతీయ సముదాయాని కి మెరుగైన విధం గా సహాయాన్ని అందించడం తో పాటు వారి ప్రయోజనాల ను పరిరక్షించడాని కి కూడా తోడ్పడగలదు.

లిథువేనియా లో ఒక కొత్త ఇండియన్ మిశన్ ను తెరవాలి అనేటటువంటి నిర్ణయం అభివృద్ధి తాలూకు మన జాతీయ ప్రాధాన్యం మరియు సబ్ కా సాథ్, సబ్ కా వికాస్దిశ లో ఒక అగ్రగామి చర్య అని చెప్పవచ్చును. భారతదేశాని కి దౌత్యపరమైన ఉనికి ని విస్తరించుకోవడం అంటే అది ఇతర అంశాల తో పాటు గా, భారతీయ కంపెనీల కు విపణి లభ్యత ను సమకూర్చుతుంది; భారతీయ వస్తువులు, సేవల ఎగుమతుల కు దన్ను గా నిలుస్తుంది. ఇది ఆత్మనిర్భర్ భారత్ను ఆవిష్కరించాలి అనేటటువంటి మన లక్ష్యాని కి అనుగుణం గా దేశీయ ఉత్పత్తి ని మరియు ఉపాధికల్పన ను పెంచడం లో దీని ప్రత్యక్ష ప్రభావం ప్రసరిస్తుంది అన్నమాట.

***


(Release ID: 1820792) Visitor Counter : 209