రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రూ.8,181 కోట్ల విలువైన 292 కిలోమీటర్ల మేర 10 జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు.

Posted On: 25 APR 2022 1:05PM by PIB Hyderabad

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రూ.8,181 కోట్ల విలువైన 292 కిలోమీటర్ల మేర 10 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రారంభించారు.

 
https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RTW8.jpg


షోలాపూర్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను దేశంలోని ప్రధాన రహదారులతో అనుసంధానించడానికి అవకాశం ఉన్న ఈ రోడ్డు ప్రాజెక్టులు షోలాపూర్ ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధికి దోహదపడతాయని మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతోపాటు ప్రమాదాలను నివారించడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు కూడా ఈ ప్రాజెక్టులు దోహదపడతాయన్నారు. షోలాపూర్‌ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలను నగరంతో అనుసంధానించడం మరింత సులభతరం అవుతుందన్నారు.
సిద్ధేశ్వరాలయం, అక్కల్‌కోట్‌, పంఢర్‌పూర్‌ వంటి ముఖ్యమైన ఆలయాలు ఉన్న షోలాపూర్‌ జిల్లాకు రోడ్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ఎంతో అవసరమని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడిన ఈ హైవే ప్రాజెక్టులు నగరంతోపాటు జిల్లాలోని ఆధ్యాత్మిక ప్రదేశాలకు చేరుకోవడాన్ని మరింత సులభతరం చేస్తాయన్నారు. అంతేకాకుండా వ్యవసాయ వస్తువుల రవాణా సాఫీగా సాగడానికి కూడా సహాయపడతాయని మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొన్నారు.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002X4QI.jpg


షోలాపూర్ జిల్లాలో తరచుగా ఏర్పడే నీటి కొరతను తగ్గించడానికి 2016-17 నుండి భారత జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ద్వారా బుల్దానా నమూనాలో షోలాపూర్ జిల్లాలో అనేక సరస్సులను నిర్మించినట్లు మంత్రి తెలిపారు. అందుబాటులో ఉన్న పలు రిజర్వాయర్లను లోతుగా చేసి వాటి నుంచి లభించిన మట్టి, రాళ్లను రోడ్డు నిర్మాణానికి వినియోగించినట్లు తెలిపారు. దీని ద్వారా షోలాపూర్‌ జిల్లాలో దాదాపు 73 గ్రామాలు నీటమునిగాయని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో 6.478 టీఎంసీల నీటిమట్టం పెరిగి 561 హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందిందని,  ఈ ప్రాజెక్టుల ద్వారా 2 నీటి సరఫరా పథకాలు లబ్ది పొందాయని, అంతేకాకుండా ఈ ప్రాంతంలోని 747 బావులు రీఛార్జ్ అయ్యాయని మంత్రి నితిన్‌ గడ్కరీ  తెలిపారు.

 

***



(Release ID: 1819842) Visitor Counter : 144