కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కొన్ని సర్వేలు, క్విజ్‌ల రూపంలో సబ్సిడీలు/బహుమతులు అందజేస్తామంటూ మోసపూరిత యుఆర్ఎల్/ వెబ్‌సైట్ ప్రకటనల విషయమై ప్రజలను హెచ్చిరించిన భారత తపాలా శాఖ
Posted On:
23 APR 2022 10:15AM by PIB Hyderabad
కొన్ని సర్వేలు, క్విజ్‌ల ద్వారా ప్రభుత్వ రాయితీల్ని అందజేస్తున్నట్లు పేర్కొంటూ.. చిన్నచిన్న యుఆర్ఎల్‌లు, వివిధ వెబ్‌పైట్ల చిరునామాలను వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలు, ఈ మెయిల్స్ / ఎస్ఎంఎస్ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తున్న అంశాన్ని భారత తపాలా శాఖ కొన్ని రోజులుగా గమనిస్తోంది. సర్వేల ఆధారంగా సబ్సిడీలు, బోనస్ లేదా బహుమతులు ప్రకటించడం వంటి కార్యకలాపాలలో భారతీయ తపాలా శాఖకు ఎలాంటి ప్రమేయం లేదని మేము దేశ పౌరులకు తెలియజేయాలనుకుంటున్నము. అటువంటి నోటిఫికేషన్‌లు/ మెసేజ్‌లు/ ఈమెయిల్‌లను స్వీకరించి ప్రజలకు అటువంటి నకిలీ, బూటకపు సందేశాలను ఏమాత్రం విశ్వసించవద్దని, ప్రతిస్పందించవద్దని.. వారితో వ్యక్తిగత వివరాలను పంచుకోవద్దని భారత తపాలా శాఖ అభ్యర్థించింది. పుట్టిన తేదీ, ఖాతా నంబర్‌లు, మొబైల్ నంబరు, పుట్టిన ప్రదేశం & ఓటీపీ వంటి వ్యక్తిగత గుర్తింపు సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని కూడా అభ్యర్థించబడింది. ఇలాంటి యుఆర్ఎల్‌లు / లింక్‌లు / వెబ్‌సైట్‌లను తీసివేయడానికి నిరోధించడానికి భారత తపాలా శాఖ తన యంత్రాంగాల ద్వారాఅవసరమైన చర్యలను తీసుకుంటోంది. పైన తెలిపన విధంగా ఏదైనా నకిలీ మెసేజ్‌లు / నకిలీ సందేశాలు / కమ్యూనికేషన్‌లు / లింక్‌లను విశ్వసించవద్దని, ఇలాంటి వాటికి ప్రతిస్పందించవద్దని ప్రజలను మరోసారి పెద్ద ఎత్తున భారత తపాలా శాఖ అభ్యర్థించింది.
***
(Release ID: 1819411)
Visitor Counter : 451