ఆర్థిక మంత్రిత్వ శాఖ

వాషింగ్టన్ డి.సిలో జరిగిన డెవలప్‌మెంట్ కమిటీ ప్లీనరీ 105వ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 23 APR 2022 8:08AM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతినిర్మలా సీతారామన్ ఈరోజు వాషింగ్టన్ డీసీలో జరిగిన డెవలప్‌మెంట్ కమిటీ ప్లీనరీ 105వ సమావేశంలో  పాల్గొన్నారు. డిజిటలైజేషన్, డెవలప్‌మెంట్, స్థూల ఆర్థిక స్థిరత్వం, ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రపంచంపై దాని ప్రభావం, ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ప్రతిస్పందన: ప్రతిపాదిత రోడ్‌మ్యాప్... వంటి అంశాల ఎజెండాతో సమావేశాలు జరుగుతాయి. 

 

ప్రస్తుత సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలలో పటిష్టంగా, అత్యధికంగా ఉందని, భారతదేశం స్థితిస్థాపకత,  బలమైన పునరుద్ధరణను ప్రతిబింబిస్తుందని  ఆర్థిక మంత్రి  పేర్కొన్నారు.
 

భారతదేశం కోవిడ్-19 మహమ్మారి సంక్షోభాన్ని గొప్ప స్థితిస్థాపకతతో ఎదుర్కొందని, వ్యాక్సినేషన్‌లో అద్భుతమైన పురోగతిని సాధించిందని ఆమె తెలిపారు. 1.85 బిలియన్లకు పైగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులను అందించిందని శ్రీమతి సీతారామన్ పేర్కొన్నారు.

భారతదేశం స్వచ్ఛందంగా అన్ని దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (కోవిన్) ప్లాట్‌ఫారమ్‌ను అందించిందని, ఇంకా వివిధ రకాల ప్రజా-వస్తు సహాయం అందించడానికి సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి చెప్పారు.

ఆర్థిక మంత్రి శ్రీలంకలో అసాధారణ పరిస్థితులను సమావేశంలో ప్రస్తావిస్తూ సంక్షోభం నుండి బయటపడేందుకు శ్రీలంకకు నిర్ణయాత్మక ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. .

****



(Release ID: 1819309) Visitor Counter : 139