ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాషింగ్టన్ డీసీలో ఎఫ్ఏటీఎఫ్ మంత్రుల సమావేశానికి హాజర‌యిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్

Posted On: 22 APR 2022 9:46AM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక,  కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్,  2022 ఏప్రిల్ 21న వాషింగ్టన్ డీసీ న‌గ‌రంలో జరిగిన ఎఫ్ఏటీఎఫ్ సమావేశానికి హాజరయ్యారు, ప్రపంచ బ్యాంక్ గ్రూపు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్‌) 2022- వసంత సమావేశాలతో పాటు దీనిని నిర్వహించారు. ఈ సమావేశం ప్ర‌ధానంగా  2022-24 సంవత్సరాలకు సంబంధించి ఎఫ్ఏటీఎఫ్ యొక్క వ్యూహాత్మక ప్రాధాన్యతలను ఆమోదించడం ద్వారా మంత్రుల వ్యూహాత్మక దిశను అందించడంపై దృష్టి సారించింది. ఈ స‌మావేశః ఎఫ్ఏటీఎఫ్‌ గ్లోబల్ నెట్‌వర్క్ వ్య‌వ‌స్థ‌ల‌ను మ‌రింత‌గా బలోపేతం చేసే వ్యూహాత్మక ప్రాధాన్యతల పంపిణీకి త‌గు నిధులను నిర్ధారించడానికి వీలుగా మంత్రుల‌లో నిబద్ధతను బలోపేతం చేస్తుంది. అంతర్జాతీయ ప్రయోజనకరమైన యాజమాన్య పారదర్శకతను పెంపొందించడం, నేర ఆస్తులను మరింత సమర్థవంతంగా రికవరీ చేసేలా సామర్థ్యాలను పెంచడం, డిజిటల్ పరివర్తనను పెంచడం, ఎఫ్ఏటీఎఫ్‌ వ్యూహాత్మక ప్రాధాన్యతల కోసం స్థిరమైన నిధులను నిర్ధారించడం వంటివి చేప‌ట్ట‌డానికి ఇది ఎంత‌గానో  దోహ‌దం చేస్తుంది. ఈ సమావేశంలో, ఆర్థిక మంత్రి మనీలాండరింగ్, ఉగ్ర‌వాదుల‌కు నిధులు, మరియు ప్రొలిఫరేషన్ ఫైనాన్సింగ్‌పై పోరాడటానికి భారతదేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించారు.ప్రయోజనకరమైన యాజమాన్య పారదర్శకత, ఆస్తుల పునరుద్ధరణ మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడంలో ఎఫ్ఏటీఎఫ్ చేసిన కృషిని గుర్తింపుగా  అభినందించారు. కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మ‌లా సీతారామన్ వ్యూహాత్మక ప్రాధాన్యతలకు మద్దతునిచ్చారు.మనీలాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ మరియు సామూహిక విధ్వంసక ఆయుధాల విస్తరణకు ఫైనాన్సింగ్‌కు వ్యతిరేకంగా ప్రపంచ కూటమిగా ఎఫ్‌ఎటీఎఫ్ చేస్తున్న ప్రయత్నాల‌కు అవసరమైన వనరులు, త‌గిన మద్దతును అందించడానికి భారతదేశం కట్టుబడి ఉందని తెలిపారు.
                                                                               

****


(Release ID: 1819139) Visitor Counter : 206