రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

దేశీయ కొనుగోళ్ళ కోసం 2021-22 ఆర్థిక సంవ‌త్స‌రంలో కేపిట‌ల్ అక్విజిష‌న్ బ‌డ్జెట్‌లో 65.50శాతాన్ని వినియోగించిన ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌


డిఫెన్స్ స‌ర్వీసెస్ బ‌డ్జెట్‌లో 99.50శాతాన్ని వినియోగించిన శాఖ

Posted On: 20 APR 2022 9:32AM by PIB Hyderabad

ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22 సంవ‌త్స‌రంలో దేశీయ ప‌రిశ్ర‌మ‌ల కోసం కేపిట‌ల్ అక్విజిష‌న్ బ‌డ్జెట్‌లో 64శాతాన్ని కేటాయించారు. ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22 అంతానికి ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ఈ ల‌క్ష్యాన్ని సాధించి, ప్ర‌ధాన‌మంత్రి దార్శ‌నిక‌త అయిన ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ను సాకారం చేసేందుకు భార‌తీయ ప‌రిశ్ర‌మ‌ల నుంచి దేశీయ కొనుగోళ్ళు చేసింది. అంతేకాక‌, మార్చి 2022న విడుద‌ల చేసిన ప్రాథ‌మిక వ్య‌య నివేదిక ప్ర‌కారం ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22లో డిఫెన్స్ స‌ర్వీసెస్ (ర‌క్ష‌ణ సేవ‌ల‌) బ‌డ్జెట్‌లో  ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ 99.50 శాతాన్ని వినియోగించుకోగ‌లిగింది. 


.***



(Release ID: 1818330) Visitor Counter : 164