ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కిమరియు వియత్ నామ్ కు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్గుయెన్ ఫు త్రోంగ్ కు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ

Posted On: 15 APR 2022 3:36PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియత్ నామ్ కు చెందిన కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్ గుయెన్ ఫు త్రోంగ్ తో ఫోన్ లో ఈ రోజు న మాట్లాడారు.

భారతదేశం మరియు వియత్ నామ్ ల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడిన తరువాత 50వ వార్షికోత్సవం సందర్భం లో నేత లు ఇద్దరు ఒకరి కి మరొకరు శుభాకాంక్షల ను తెలియజేసుకొన్నారు. ప్రధాన మంత్రి 2016వ సంవత్సరం లో వియత్ నామ్ ను సందర్శించిన కాలం లో ఆరంభం అయిన భారతదేశం - వియత్ నామ్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం లో భాగం గా విస్తృత స్థాయి లో సహకారం త్వరిత గతి న జోరందుకోవడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

భారతదేశం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలిసి లో మరియు ఇండో పసిఫిక్ విజన్ లో ఒక ముఖ్య స్తంభం గా వియత్ నామ్ కు ఉన్న ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఇప్పటికే అమలవుతున్న కార్యక్రమాల లో శీఘ్ర ప్రగతి కై కృషి చేయడానికి తోడు గా, ద్వైపాక్షిక సంబంధాల పరిధి ని విస్తరించవలసింది గా ప్రధాన మంత్రి అభిలషించారు.

భారతదేశానికి చెందిన ఔషధ సంబంధి ఉత్పత్తుల కు మరియు వ్యవసాయ సంబంధి ఉత్పత్తుల కు వియత్ నామ్ లో మార్కెట్ లభ్యత కు మార్గాన్ని మరింత గా సుగమం చేయవలసింది గా కూడా ప్రధాన మంత్రి అభ్యర్థించారు.

ఇరు దేశాల మధ్య గల చరిత్రాత్మకమైనటువంటి మరియు నాగరకత సంబంధాల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొని, వియత్ నామ్ లో చామ్ స్మారకాల జీర్ణోద్ధరణ లో భారతదేశం పాలుపంచుకోవడం పట్ల తన ప్రసన్నత ను వ్యక్తం చేశారు.

ఉభయ దేశాల మధ్య రక్షణ సంబంధి భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడానికి నేత లు వారి సమ్మతి ని తెలియజేశారు.

యూక్రెన్ లో కొనసాగుతున్న సంక్షోభం మరియు దక్షిణ చైనా సముద్రం లో వర్తమాన స్థితి సహా ఉమ్మడి హితం ముడిపడ్డ ప్రాంతీయ అంశాల పైన, ఇంకా ప్రపంచ అంశాల పైన వారు వారి యొక్క అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడించుకొన్నారు.

 

***

 


(Release ID: 1817164) Visitor Counter : 165