మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
2022 ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు పరీక్షా పర్వ్ 4.0 జరుపుకుంటున్న - ఎన్.సి.పి.సి.ఆర్.
प्रविष्टि तिथि:
10 APR 2022 5:37PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నిర్వహించిన “పరీక్ష-పే-చార్చా” స్ఫూర్తితో, పరీక్షలను ఒక సంతోషకరమైన కార్యకలాపంగా మార్చేందుకు తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్.సి.పి.సి.ఆర్), 2022 ఏప్రిల్, 11వ తేదీ నుంచి 2022 మే, 31వ తేదీ వరకు, "పరీక్షా-పర్వ్-4.0" నిర్వహిస్తోంది. పరీక్ష ఒత్తిడి పట్ల పిల్లల దృక్పథాన్ని మార్చడానికి, అదేవిధంగా పరీక్షా ఫలితాలకు ముందు వారి ఆందోళనను అధిగమించడానికి ఉపయోగపడే ఒక వేదిక గా 'పరీక్షా-పర్వ్' కార్యక్రమంలో భాగంగా 2019 నుంచి ఎన్.సి.పి.సి.ఆర్. పరీక్షలు నిర్వహిస్తోంది.
"పరీక్షా-పర్వ్-4.0" అనేది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారి ఆలోచనలను పంచుకోవడానికి, నిపుణుల నుంచి మార్గదర్శకత్వం మరియు ముఖ్యమైన చిట్కాలను పొందడానికి ఒక వేదికను అందించడానికి ఒక ప్రయత్నం. ఒత్తిడితో కూడిన సమయాల్లో, అసౌకర్యమైన, గందరగోళం తో కూడిన ఆలోచనల గురించి మాట్లాడటం, పంచుకోవడం విద్యార్థుల ఒత్తిడి, ఆందోళనల ను చాలా వరకు తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ సంవత్సరం, పిల్లలతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు చేరువయ్యే లక్ష్యంతో బహుముఖ విధానాన్ని అనుసరించే క్రమంలో, "పరీక్షా-పర్వ్-4.0" కింది కార్యకలాపాలను చేపట్టింది:
i) పరీక్షా ఫలితాలకు ముందు విద్యార్థులు తమ పరీక్ష ఒత్తిడి, ఆందోళనల ను తగ్గించుకోవడానికి నిపుణులతో సంభాషించేందుకు అవకాశం కల్పిస్తూ, 2022 ఏప్రిల్, 11వ తేదీ నుంచి 2022 మే 31వ తేదీ వరకు ఎన్.సి.పి.సి.ఆర్. ఫేస్ బుక్, ట్విట్టర్, యు ట్యూబ్ తో పాటు దూరదర్శన్ నేషనల్, న్యూ ఇండియా జంక్షన్ కు చెందిన యు ట్యూబ్ ద్వారా ప్రత్యక్ష కార్యక్రమాల ప్రసారం.
ii) కోవిడ్ కు సంబంధించిన ఒత్తిడి నివారణ కోసం శిక్షణ పొందిన కౌన్సెలర్ల తో సంవేదన - (1800-121-2830) పేరుతో ఎన్.సి.పి.సి.ఆర్. నిర్వహించిన ఉచిత టెలీ-కౌన్సిలింగ్ సేవ ను, ఇప్పుడు విద్యార్థుల పరీక్షలు, ఫలితాలకు సంబంధించిన ప్రశ్నలు, ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కోవడానికి విస్తరించడం జరిగింది.
*****
(रिलीज़ आईडी: 1815601)
आगंतुक पटल : 239