గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

"లక్ష్య జీరో డంప్‌ సైట్"


గుజరాత్ ప్రభుత్వ 403.77 కోట్ల రూపాయల వారసత్వ వ్యర్ధాల నివారణ ప్రతిపాదనను ఆమోదించిన - భారత ప్రభుత్వం

Posted On: 09 APR 2022 10:52AM by PIB Hyderabad

"...స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0 లక్ష్యం చెత్త రహిత నగరంగా, పూర్తిగా చెత్త లేని నగరంగా మార్చడమే" 

- ప్రధానమంత్రి నరేంద్రమోదీ. 

భారతదేశానికి పశ్చిమంగా నెలకొన్న గుజరాత్ రాష్ట్రం, దేశంలో అత్యంత ప్రసిద్ధ రాష్ట్రాలలో ఒకటి.  భౌగోళికంగా దేశంలో ఐదవ అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న గుజరాత్,  దాని సంస్కృతీ, వారసత్వాలకు ప్రసిద్ధి చెందింది.

దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటిగా ఉన్న గుజరాత్‌ కు వారసత్వ వ్యర్థాల నిర్వహణలో సవాళ్లు ఉన్నాయి.  రాష్ట్రంలో  79,000 పట్టణ పుర పాలక మండళ్ల నుంచి ప్రతిరోజూ 1.48 లక్షల టన్నుల మేర వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. 

మహమ్మారి నేపథ్యంలో వ్యర్థాల నిర్వహణ దేశానికి పెద్ద సవాలుగా పరిణమించింది.   భారతదేశంలోని పట్టణ ప్రాంతాల నుంచి రోజుకు దాదాపు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల మేర మున్సిపల్ ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి.   ప్రారంభంలోనే వద్ద వ్యర్థాలను సరిగ్గా విభజించడం, నగరాల్లో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోకుండా నివారించడం అనేది, "స్వచ్ఛ భారత్ మిషన్ - అర్బన్ 2.0"  లక్ష్యాలలో కీలకమైన అంశం.  గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2021 అక్టోబర్, 1వ తేదీ ప్రారంభించిన ఈ జాతీయ పథకం, నూతన భారతదేశం యొక్క దృష్టిని మరింతగా పెంచుతూ పట్టణ ప్రకృతి దృశ్యాలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది.

14,000 ఎకరాలకు పైగా నగర భూమిని ఆక్రమించిన సుమారు 16 కోట్ల మెట్రిక్ టన్నుల (ఎమ్.టి) వారసత్వ వ్యర్థ డంప్‌ సైట్‌ లను సరిచేయడానికి ఈ పథకం లోని కీలకమైన భాగాలలో ఒకటి ‘లక్ష్య జీరో’ డంప్‌ సైట్.  వారసత్వ వ్యర్థాలు దాని పరిసరాల పర్యావరణ సమతుల్యత కు భంగం కలిగించడంతో పాటు, పట్టణ ప్రకృతి దృశ్యాల మొత్తం సౌందర్యాన్ని క్షీణింపజేస్తాయి,  గందరగోళానికి గురి చేస్తాయి. 

"స్వచ్ఛ భారత్ మిషన్ - అర్బన్ 2.0 కింద", గుజరాత్‌ లోని ల్యాండ్‌ ఫిల్‌ ల నుండి వారసత్వ వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి 403.77 కోట్ల రూపాయలతో ఒక  ప్రాజెక్టు ను రూపొందించడం జరిగింది. 

ప్రమాదకరంగా చెత్త పేరుకుపోతున్న ప్రాంతాల నుండి గుజరాత్ లోని ప్రధాన ప్రాంతాలను పునరుద్ధరించడానికి వీలుగా, వారసత్వ వ్యర్థాల నివారణ కోసం 144.85 కోట్ల రూపాయల మేర కేంద్ర వాటా సమకూర్చడానికి, ఎం.ఓ.హెచ్.యు.ఏ. ఆమోదం తెలియజేసింది.   19 లక్షల మెట్రిక్ టన్నుల మేర వ్యర్థాలను డంప్ చేస్తున్న 806 ఎకరాల ప్రధాన భూమిని తిరిగి పొందేందుకు ఆమోదం కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 148 యు.ఎల్‌.బి.లు తమ ప్రతిపాదనలు అందజేశాయి.   యు.ఎల్.బి.-రాజ్‌కోట్ సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల వారసత్వ వ్యర్థాలను నివారించడానికి చూస్తుండగా,  సురేంద్రనగర్-వాధ్వాన్ మరియు పోర్ బందర్-ఛాయా వంటి యు.ఎల్.బి. లు కలిసి 9 లక్షల మెట్రిక్ టన్నుల కు పైగా వారసత్వ వ్యర్థాలను నివారించడం ద్వారా అపారమైన భూమిని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయి.  భావనగర్ మరియు రాజ్‌కోట్‌ లోని రెండు యు.ఎల్‌.బి.లు సి & డి వ్యర్ధ నిర్వహణ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్థిక సహాయాన్ని పొందనున్నాయి, ఇది నగరాల సౌందర్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.  

వారసత్వ వ్యర్థాల నిర్వహణ సమస్యలు తప్పించుకోలేనివి.  దీనిని పరిగణనలోకి తీసుకుని,  ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, ఢిల్లీ మొదలైన రాష్ట్రాల్లో వారసత్వ వ్యర్థాల నివారణ కోసం దాదాపు 600 నగరాల ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.

వ్యర్థ పదార్థాల నిర్వహణ విభాగం కింద చేస్తున్న కృషి ప్రస్ఫుటంగా ఉంది.   పౌరుల అభివృద్ధి కోసం భద్రత, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తూ, "స్వచ్ఛ భారత్ మిషన్ - అర్బన్ 2.0"  కింద విశేషమైన మైలురాళ్లు సాధించడం జరిగింది. 

తాజా సమాచారం కోసం, దయచేసి "స్వచ్ఛ్ భారత్ మిషన్" కు చెందిన అధికారిక వెబ్‌సైట్ మరియు సామాజిక మాధ్యమ వేదికలను చూడండి. 

 

ఫేస్ బుక్: Swachh Bharat Mission - Urban | 

ట్విట్టర్: @SwachhBharatGov|

యూ ట్యూబ్: Swachh Bharat Mission-Urban   |  

ఇన్ స్టాగ్రామ్: sbm_urban

 

 

 

*****



(Release ID: 1815314) Visitor Counter : 191