శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ప్రజలకు సరైన ఆహారం, అందుబాటులో వైద్య సంరక్షణ, ఇంధన సరఫరా లాంటి సాధారణ సమస్యల పరిష్కారానికి వినూత్న సాంకేతిక మార్గాల అన్వేషణకు కలిసి పనిచేయాలని షాంఘై సహకార సంస్థ ( షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్)( ఎస్సీఓ) సభ్య దేశాలకు భారత్ పిలుపుఎస్సీఓ సమావేశంలో వర్చువల్ విధానంలో ప్రసంగించిన భారత శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వాతావరణంలో మార్పులు, జీవవైవిద్య నష్టం లాంటి పర్యావరణ అంశాలపై ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సభ్య దేశాలు దృష్టి సారించి పని చేయాలి: డాక్టర్ జితేంద్ర సింగ్ గత ఏడు సంవత్సరాల కాలంలో పరిశోధన అభివృద్ధి రంగాల్లో భారతదేశ వ్యయం రెట్టింపు అయ్యింది : డాక్టర్ జితేంద్ర సింగ్
ఎస్సీఓ సమావేశంలో వర్చువల్ విధానంలో ప్రసంగించిన భారత శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
వాతావరణంలో మార్పులు, జీవవైవిద్య నష్టం లాంటి పర్యావరణ అంశాలపై ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సభ్య దేశాలు దృష్టి సారించి పని చేయాలి: డాక్టర్ జితేంద్ర సింగ్
గత ఏడు సంవత్సరాల కాలంలో పరిశోధన అభివృద్ధి రంగాల్లో భారతదేశ వ్యయం రెట్టింపు అయ్యింది : డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
08 APR 2022 1:04PM by PIB Hyderabad
ప్రజలకు సరైన ఆహారం, అందుబాటులో వైద్య సంరక్షణ, ఇంధన సరఫరా లాంటి సాధారణ సమస్యల పరిష్కారానికి వినూత్న సాంకేతిక మార్గాల అన్వేషణకు కలిసి పనిచేయాలని షాంఘై సహకార సంస్థ ( షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్)( ఎస్సీఓ) సభ్య దేశాలకు కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూ శాస్త్రం, సిబ్బంది వ్యవహారాలు, పెన్షన్లు, అణుశక్తి, అంతరిక్ష వ్యవహారాల శాఖ సహాయ ( స్వతంత్ర) మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపు ఇచ్చారు.
ఎస్సీఓ సమావేశంలో డాక్టర్ జితేంద్ర సింగ్ వర్చువల్ విధానంలో పాల్గొని ప్రసంగించారు.
వాతావరణంలో మార్పులు, జీవవైవిద్య నష్టం లాంటి పర్యావరణ అంశాలపై ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సభ్య దేశాలు దృష్టి సారించి పని చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ కోరారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షతన సెప్టెంబర్ 2022లో చారిత్రాత్మక సమర్‌కండ్‌లో జరగనున్న సంస్థ శిఖరాగ్ర సమావేశం విజయవంతంగా జరగాలని మంత్రి అభిలషించారు. సమర్‌కంద్శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. శిఖరాగ్ర సమావేశంలో సంయుక్తంగా అంగీకరించిన అన్ని కార్యకలాపాలలో భారతదేశం పూర్తి సహకారం అందించి క్రియాశీల పాత్ర పోషిస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా దుషాన్‌బేలో 2021లో జరిగిన ఎస్సీఓ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తు చేశారు. ఎస్సీఓ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో కీలకంగా మారాలని శ్రీ నరేంద్ర మోదీ సూచించారని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. దీని కోసం, శాస్త్ర సాంకేతిక అంశాలపై హేతుబద్ధంగా ఆలోచించేలా ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించాలని అన్నారు. అన్ని దేశాల యువత, అంకుర సంస్థల మధ్య సమన్వయం సాధించడం ద్వారా ఇది సాధ్యమవుతుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో వినూత్న లకు భారతదేశం ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఎన్ ఎస్ ఓ గణాంకాల ప్రకారం శాస్త్రీయ ప్రచురణల అంశంలో ప్రపంచంలో భారతదేశం మూడవ స్థానంలో ఉందని వెల్లడయిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో భారతదేశంలో అనేక మంత్రిత్వ శాఖలు అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ రంగాల్లో నాయకత్వాన్ని అభివృద్ధి చేసేందుకు క్వాంటం కంప్యూటింగ్, సూపర్‌కంప్యూటింగ్‌పై నేషనల్ మిషన్, డీప్ ఓషన్ మిషన్ లాంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఈ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని ఆయన వివరించారు. వినూత్న ఆవిష్కరణల రంగంలో మొత్తం విలువ గొలుసును సూచించే నిధి (నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ డెవలపింగ్ అండ్ హర్నెస్సింగ్ ఇన్నోవేషన్స్) పేరుతో జాతీయ కార్యక్రమం ప్రారంభం అయ్యిందని ఆయన తెలిపారు. అంతేకాకుండా, స్టెమ్ లో లో యువతులను ఆకర్షించడానికి మరియు ప్రోత్సహించడానికి మరియు సైన్స్‌లో లింగ అసమతుల్యతను పరిష్కరించడానికి, ప్రభుత్వం అనేక మహిళా కేంద్రీకృత పథకాలను ప్రారంభించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
గత ఏడేళ్ల కాలంలో భారతదేశంలో పరిశోధన అభివృద్ధి రంగాలపై ప్రభుత్వం చేస్తున్న వ్యయం దాదాపు రెండింతలు పెరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. ప్రస్తుత బడ్జెట్‌లో శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖకు సుమారు 14,800 కోట్ల రూపాయలను కేటాయించామని తెలిపారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (NRF) ఏర్పాటు కోసం ఐదు సంవత్సరాల కాలానికి 50,000 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించామని చెప్పారు.
పర్యావరణ మరియు వాతావరణ పరిరక్షణ అంశాలకు కట్టుబడి ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. COP 26 లో అంగీకరించిన విధంగా 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడం, 2030 నాటికి మరియు 50 శాతం ఇంధన అవసరాలను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చడం లాంటి లక్ష్యాల సాధన దిశగా చర్యలు అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దీనికోసం నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ లాంటి అనేక కార్యక్రమాలను ప్రారంభించామని అన్నారు. ప్రపంచ శాస్త్రీయ ఉత్పత్తిలో ఎస్సీఓ ప్రాంత దేశాల పాత్ర క్రమంగా పెరుగుతున్నదని మంత్రి అన్నారు. పరిశోధన మరియు ఆవిష్కరణల రంగంలో తరచూ మార్పులు చోటు చేసుకుంటాయని మంత్రి అన్నారు. ఆవిష్కరణల రంగంలో ఎస్సీఓ దేశాల ర్యాంకింగ్ మెరుగుపడడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
రాబోయే కాలంలో అత్యధిక జ్ఞాన ఆర్థిక వ్యవస్థను కలిగిన ప్రాంతంగా ఎస్సీఓ ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందుతుందన్న ధీమాను డాక్టర్ జితేంద్ర సింగ్ వ్యక్తం చేశారు. స్థానిక ఆర్థిక వ్యవస్థలకు సరిపోయే ఉమ్మడి శాస్త్ర సాంకేతిక పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఎస్సీఓ సభ్య దేశాలు కలిసి కృషి చేయాలని అన్నారు.
గత రెండు దశాబ్దాలలో యురేషియా ప్రాంతంలో షాంఘై సహకార సంస్థ కీలకమైన ప్రాంతీయ సంస్థగా అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో బహుపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించడంలో భారతదేశం షాంఘై సహకార సంస్థ కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రపంచ జనాభాలో దాదాపు 42%, భూభాగంలో 22% మరియు ప్రపంచ జీడీపీలో 20% వాటాను షాంఘై సహకార సంస్థ కలిగి ఉంది.
***
(Release ID: 1814909)
Visitor Counter : 208