అంతరిక్ష విభాగం

ఈఓఎస్-02 ఉపగ్రహాన్ని 2022 రెండవ త్రైమాసికంలో ప్రయోగించనున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడి


ఈఓఎస్-02 అనేది వ్యవసాయం, అటవీ, భూగర్భ శాస్త్రం, హైడ్రాలజీ, సూక్ష్మీకరించిన పవర్ ఎలక్ట్రానిక్స్, రియాక్షన్ వీల్స్‌తో కూడిన వివిధ కొత్త సాంకేతికతలకు సంబంధించిన సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహం: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 07 APR 2022 1:06PM by PIB Hyderabad

2022 రెండవ త్రైమాసికంలో ఈఓఎస్-02 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామని    కేంద్ర ఎర్త్ సైన్సెస్  (స్వతంత్ర బాధ్యత), సైన్స్ & టెక్నాలజీ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్, పీఎంఓ, ప్రజాసమస్యలు, పెన్షన్లు, అణు శక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. 

ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ విషయాన్ని తెలిపారు.  వ్యవసాయం, అటవీ, భూగర్భ శాస్త్రం, హైడ్రాలజీ, సూక్ష్మీకరించిన పవర్ ఎలక్ట్రానిక్స్, రియాక్షన్ వీల్స్ మొదలైన అప్లికేషన్‌లతో కూడిన వివిధ కొత్త సాంకేతికతలకు ఈఓఎస్-02 సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహం. ఎస్ఎస్ఎల్వి-1 కోసం పేలోడ్‌ను ఏర్పరుస్తుంది..

రాజ్యసభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో, డాక్టర్ జితేంద్ర సింగ్ , ఈఓఎస్ -02 వ్యవసాయం, అటవీ, భూగర్భ శాస్త్రం, హైడ్రాలజీ, మినియేటరైజ్డ్ పవర్ ఎలక్ట్రానిక్స్, రియాక్షన్ వీల్స్ మొదలైన అప్లికేషన్‌లతో కూడిన వివిధ కొత్త సాంకేతికతలకు సంబంధించిన సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహం. ఎస్ఎస్ఎల్వి-1 కోసం పేలోడ్‌ను రూపొందిస్తోందన్నారు . 2021 త్రైమాసికం-4లో ప్రయోగ తేదీని నిర్ణయించినట్లు ఆయన తెలియజేశారు, అయితే మహమ్మారి ప్రారంభం మరియు తత్ఫలితంగా లాక్ డౌన్ మరియు ప్రపంచ మరియు దేశీయ సరఫరా గొలుసులో అంతరాయం ఏర్పడటం ఆలస్యం కావడానికి కారకాలుగా ఉన్నాయి.

 

                                                           

<><><><><>



(Release ID: 1814726) Visitor Counter : 191