ప్రధాన మంత్రి కార్యాలయం
దేశం లోని పేదల లో ప్రతి ఒక్కరి కి పక్కా ఇంటి ని సమకూర్చడం కోసం ప్రభుత్వం ముఖ్యమైన చర్యల ను తీసుకొంటోంది: ప్రధాన మంత్రి
పిఎంఆవాస్ యోజన లో భాగం గా మూడు కోట్ల కు పైగా గృహాల ను నిర్మించడం జరిగింది
प्रविष्टि तिथि:
08 APR 2022 9:08AM by PIB Hyderabad
దేశం లోని పేద ప్రజల లో ప్రతి ఒక్కరి కి పక్కా ఇంటి ని సమకూర్చడం కోసం ప్రభుత్వం మహత్త్వపూర్ణమైన చర్యల ను తీసుకొంటోంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. పిఎం ఆవాస్ యోజన లో భాగం గా మూడు కోట్ల కు పైగా గృహాల ను నిర్మించడం జరిగింది అని కూడా ఆయన తెలిపారు. ఆ ఇళ్ల కు ప్రాథమిక సౌకర్యాలన్నిటి ని కలగజేయడమైంది; అవి మహిళ ల సశక్తీకరణ కు ప్రతీక గా ఉన్నాయి.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
దేశం లో ప్రతి పేద వ్యక్తి కి పక్కా ఇంటి ని ఇవ్వాలనే సంకల్పాన్ని నెరవేర్చడం లో మేం ఒక ముఖ్యమైనటువంటి మైలురాయి ని చేరాం. ప్రజల భాగస్వామ్యం తోనే మూడు కోట్ల కు పైగా ఇళ్ల నిర్మాణం సాధ్యపడింది. ప్రాథమిక సౌకర్యాల తో కూడినటువంటి ఈ ఇళ్లు మహిళ ల సశక్తీకరణ కు ప్రతీక గా మారాయి.’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(रिलीज़ आईडी: 1814706)
आगंतुक पटल : 202
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam