ఆర్థిక మంత్రిత్వ శాఖ

విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసిన పది రాష్ట్రాలకు అదనంగా 28,204 కోట్ల రూపాయలను సమీకరించుకునేందుకు అనుమతి


విద్యుత్ సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు 2022-23 లో 1,22,661 కోట్ల రూపాయల మేరకు ప్రోత్సాహకాలు పొందే అవకాశం

Posted On: 07 APR 2022 3:38PM by PIB Hyderabad

విద్యుత్ రంగంలో నిర్దేశించిన సంస్కరణలు అమలు చేసిన 10 రాష్ట్రాలు 28,204 కోట్ల రూపాయల వరకు అదనంగా రుణాలను సేకరించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ  వ్యయ   విభాగం అనుమతులు మంజూరు చేసింది. సంస్కరణల లక్ష్యాలు చేరుకున్న రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా  అదనపు రుణాలను సేకరించేందుకు మంజూరైన అనుమతులు రాష్ట్రాలవారీగా కింది విధంగా ఉన్నాయి. 

కింది విధంగా ఉన్నాయి. 

 

క్ర.స .

రాష్ట్రం

మొత్తం (రూ. కోట్లలో)

1.

ఆంధ్రప్రదేశ్

3,716

2.

అస్సాం

1,886

3.

హిమాచల్ ప్రదేశ్

251

4.

మణిపూర్

180

5.

మేఘాలయ

192

6.

ఒడిశా

2,725

7.

రాజస్థాన్

5,186

8.

సిక్కిం

191

9.

తమిళనాడు

7,054

10.

ఉత్తర ప్రదేశ్

6,823

 పదిహేనవ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు  2021-22 నుంచి 2024-25 వరకు నాలుగు సంవత్సరాల కాలానికి  విద్యుత్ రంగంలో రాష్ట్రాలు చేపట్టిన సంస్కరణల ఆధారంగా ప్రతి సంవత్సరం రాష్ట్రాల స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్ డీపీ )లో 0.5 శాతం వరకు అదనపు రుణ సేకరణకు అనుమతి  మంజూరు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని తన  2021-22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు.

విద్యుత్ రంగ కార్యాచరణ మరియు ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరచి, చెల్లింపు విద్యుత్ వినియోగంలో స్థిరమైన పెరుగుదలను ప్రోత్సహించడం లక్ష్యంగా  సంస్కరణలను అమలు చేసిన రాష్ట్రాలకు  అదనపు రుణ అనుమతులను  ఆర్థిక ప్రోత్సాహకాలను అందించాలని  నిర్ణయించింది. దీనికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు, చేరుకోవాల్సిన  ప్రమాణాలను 09 జూన్ 2021  వ్యయ శాఖ విడుదల  చేసింది. 

విద్యుత్ రంగ సంస్కరణలతో ముడిపడిన   అదనపు రుణ అనుమతులను  ఆర్థిక ప్రోత్సాహకాలను  పొందే అర్హతను సాధించేందుకు రాష్ట్రాలు నిర్ణీత ప్రమాణాలను చేరుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాలు అమలు చేసిన సంస్కరణల వివరాలు :-

·  ద్వారా ప్రభుత్వ రంగ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కామ్‌లు) నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించడం 

· విద్యుత్ రంగం ఆర్థిక వ్యవహారాల అంశంలో పారదర్శకత పాటించడం.  రాయితీల చెల్లింపు మరియు డిస్కమ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన నిధులు,  ఇతరులకు   డిస్కమ్‌లు చేయవలసి ఉన్న చెల్లింపులను పారదర్శకంగా చూపడం 

· ఆర్థిక మరియు ఇంధన ఖాతాలను సకాలంలో అందించడం మరియు సకాలంలో ఆడిట్ చేయడం. 

· చట్టపరమైన మరియు నియంత్రణ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం 

 పైన పేర్కొన్న సంస్కరణలను ఒకసారి ఒక రాష్ట్రం అమలు చేసిన తర్వాత  2021-22కి అదనపు రుణం తీసుకోవడానికి దాని అర్హతను నిర్ణయించడానికి క్రింది ప్రమాణాల ఆధారంగా రాష్ట్ర పనితీరును విశ్లేషించడం జరుగుతుంది. 

· వ్యవసాయ కనెక్షన్ల తో సహా మొత్తం ఇంధన  వినియోగాన్ని  మీటర్ ద్వారా  విద్యుత్ వినియోగం నమోదు చేసిన శాతం

· వినియోగదారులకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ ద్వారా సబ్సిడీ చెల్లించడం 

· ప్రభుత్వ శాఖలు మరియు స్థానిక సంస్థలు చేస్తున్న  విద్యుత్ బిల్లుల చెల్లింపు

· ప్రభుత్వ కార్యాలయంలో ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు 

· వినూత్న సాంకేతికత  వినియోగం 

వీటితో పాటు  విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ చేసే  రాష్ట్రాలు బోనస్  అదనంగా మార్కులకు కూడా అర్హత సాధిస్తాయి. 

 రాష్ట్రాల పనితీరును అంచనా వేయడానికి మరియు అదనపు రుణ అనుమతిని మంజూరు చేయడానికి వారి అర్హతను నిర్ణయించడానికి నోడల్ మంత్రిత్వ శాఖగా విద్యుత్ మంత్రిత్వ శాఖ పనిచేస్తుంది. 

 విద్యుత్ రంగంలో సంస్కరణలతో అనుసంధానించబడిన అదనపు రుణాల సౌకర్యాన్ని 2022-23 ఆర్థిక సంవత్సరంలో కూడా రాష్ట్రాలు పొందవచ్చు.  2022-23లో ఈ సంస్కరణలను చేపట్టేందుకు రాష్ట్రాలకు ప్రోత్సాహకంగా 1,22,551 కోట్ల రూపాయలు  అందుబాటులో ఉంటాయి. 2021-22లో సంస్కరణ ప్రక్రియను పూర్తి చేయని రాష్ట్రాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంస్కరణలు అమలు చేసి  2022-23కి కేటాయించిన అదనపు రుణాల ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. 

 

 (Release ID: 1814631) Visitor Counter : 333