హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తుఫాను/వరద ప్రభావిత రాష్ట్రాల‌లోని ప్రాంతాలకు ఆర్థిక సహాయం

Posted On: 05 APR 2022 3:08PM by PIB Hyderabad

విపత్తు నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక బాధ్యత క్షేత్ర‌ స్థాయిలో బాధిత ప్రజలకు సహాయాన్ని అందజేయడం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది. తుఫాను, వరదలతో సహా ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద ఇప్పటికే ఉంచబడిన రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి (ఎస్‌డీఆర్ఎఫ్‌) నుండి, భారత ప్రభుత్వం ఆమోదించిన అంశాలు, నిబంధనలకు అనుగుణంగా సహాయక చర్యలను చేపడతాయి..దీనికి తోడు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (ఎన్‌డీఆర్ఎఫ్‌) నుండీ అదనపు ఆర్థిక సహాయం అందించబడుతుంది, 'తీవ్ర స్వభావం' విపత్తు సంభవించినప్పుడు నిర్దేశించిన విధానం ప్రకారం అంతర్-మంత్రిత్వ కేంద్ర బృందం (ఐఎంసీటీ) సందర్శించి అందించిన అంచ‌నా న‌ష్ట నివేదిక‌ల ఆధారంగా ఈ స‌హాయం ఉంటుంది.  2021-22 ఆర్థిక సంవత్సరంలో (31.03.2022 నాటికి) వరదలు మరియు తుఫానుల కోసం ఎన్‌డీఆర్ఎఫ్  నుండి విడుదల చేయబడిన నిధుల వివరాలు, సంబంధిత రాష్ట్ర ఎస్‌డీఆర్ఎప్‌ ప్రారంభ బ్యాలెన్స్‌లో 50 శాతం సర్దుబాటు చేసిన తర్వాత, 1 ఏప్రిల్, 2021, ఈ క్రింది విధంగా ఇవ్వబడింది:

(రూ. కోట్ల‌లో. )

 

క్ర‌మ సంఖ్య‌

రాష్ట్రం పేరు

విపత్తు పేరు

ఎన్‌డీఆర్ఎఫ్‌ నుండి విడుదల చేసిన సాయం

1.

ఆంధ్రప్రదేశ్

వరదలు

351.43

2.

బిహార్

వరదలు

1,038.96

3.

గుజరాత్

తుఫాను 'తౌక్తే'

1,000.00*

4.

Jజార్ఖండ్

'యాస్' తుఫాను

200.00*

5.

కర్ణాటక

వరదలు

1,623.30

6.

మధ్యప్రదేశ్

వరదలు

600.50

7.

మ‌హారాష్ట్ర‌

వరదలు

1,056.39

8.

ఒడిషా

'యాస్' తుఫాను

500.00*

9.

సిక్కిం

వరదలు/కొండచరియలు విరిగిప‌డ‌డం

55.23

10.

తమిళనాడు

వరదలు

566.36

11.

పశ్చిమ బెంగాల్l

'యాస్' తుఫాను

300.00*

వరదలు

50.13

 

* NDRF నుండి ముందస్తుగా విడుదలైన మొత్తం.

ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో హోం శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ ఈ విషయాన్ని తెలిపారు.

 

*****


(Release ID: 1814003) Visitor Counter : 238