మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

భారత స్వాతంత్య్ర పోరాటంలో గుర్తించబడని వీరుల కథలు జాతీయ స్మృతిలో ముద్రించబడాలి - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


1757 నుండి 1947 వరకు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంపై విద్యా మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రదర్శనను ఏర్పాటు చేసింది

లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు

Posted On: 04 APR 2022 3:02PM by PIB Hyderabad

ఈరోజు పార్లమెంట్ లైబ్రరీలో విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఏర్పాటు చేసిన భారత స్వాతంత్య్ర పోరాట ప్రదర్శనను లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రారంభించారు. కేంద్ర విద్య మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కూడా ప్రదర్శనను సందర్శించారు. విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి, పార్లమెంటరీ వ్యవహారాలు మరియు సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, లోక్‌సభ మరియు రాజ్యసభ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

image.png

ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ 1757 నుండి 1947 వరకు సుమారు 200 సంవత్సరాల భారతదేశ చరిత్రకు సంబంధించిన కథలను ఈ ఎగ్జిబిషన్ ప్రదర్శిస్తుందన్నారు. జాతీయ స్మృతిలో నిలిచిపోయేలా పోరాడిన  వీరుల కథలను వెలుగులోకి తీసుకురావడమే ఈ ఎగ్జిబిషన్ ఉద్దేశమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపీలు ఈ ఎగ్జిబిషన్‌ను వీక్షిస్తారు మరియు వారి నియోజకవర్గాల నుండి మరింత మంది గుర్తించబడని హీరోలను సూచిస్తారు.

రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 100 ప్రదేశాలలో మరియు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ ప్రదర్శన కొనసాగుతుందని ఆయన అన్నారు.


 

******



(Release ID: 1813504) Visitor Counter : 135