పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దశలవారీగా ముఖ గుర్తింపు వ్య‌వ‌స్థ (ఎఫ్‌ఆర్‌ఎస్) అమలు


- కోల్‌కతా, వారణాసి, పుణే, విజయవాడ, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్‌లలో మార్చి 2023 నాటికి ఎఫ్ఆర్ఎస్‌

Posted On: 04 APR 2022 2:18PM by PIB Hyderabad

ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ముఖ గుర్తింపు వ్య‌వ‌స్థ - ఎఫ్‌ఆర్‌ఎస్) అనేది ఆయా విమానాశ్రయాలలో ప్రయాణీకులకు అవాంతరాలు లేని మేటి  అనుభవాన్ని అందించడానికి వీలుగా ప్రభుత్వం చేపట్టింది.  డిజీ యాత్ర చొరవలో భాగం. దీన్ని దశలవారీగా దేశంలో అమలు చేయాలన్నారు. ఆయా‌ విమానాశ్రయాలలో 'డే ఆఫ్ ట్రావెల్' రిజిస్ట్రేషన్‌తో కూడిన డిజి యాత్ర బయోమెట్రిక్ బోర్డింగ్ సిస్టమ్ ప్రాథమిక పరీక్ష పూర్తయింది. భద్రత యొక్క కీల‌క అంశం. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్‌)  దేశంలోని పౌర విమానయాన భద్రత కోసం రెగ్యులేటరీ అథారిటీ, ఇతర సంబంధిత ఏజెన్సీలు, వాటాదారులతో సంప్రదించి, ఎప్పటికప్పుడు విమానాశ్రయాలలో భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తుంది మరియు అవసరానికి అనుగుణంగా భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ‌ను  ఆధునికీక‌రిస్తుంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వి.కె. సింగ్ (రిటైర్డ్) ఈ రోజు రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

                                                                       

*****



(Release ID: 1813494) Visitor Counter : 177