విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ప్రొవిజనల్   మెగా పవర్ ప్రాజెక్టుల కోసం మెగా పవర్ పాలిసి 2009 లో సవరణ కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 30 MAR 2022 2:21PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న గల ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) పన్నుల సంబంధిత అధికారుల కు అంతిమ మెగా సర్టిఫికెట్ లను సమర్పించాలనే ఉద్దేశ్యం తో 10 ప్రొవిజనల్ మెగా సర్టిఫైడ్ ప్రాజెక్టుల గుర్తింపు కోసం కాలావధి ని పొడిగించడానికి (36 నెలలు) ఈ రోజు న ఆమోదం తెలిపింది.

 

అంతిమ మెగా సర్టిఫికెట్ సమర్పణ కు గడువు ను పొడిగించడం వల్ల భవిష్యత్తు లో పిపిఎ లకై ప్రతిస్పర్ధాత్మక పద్ధతి న బిడ్ ను వేయడానికి మరియు పాలిసి షరతుల కు అనుగుణం గా పన్ను ల పరమైన మినహాయింపు లను దక్కించుకోవడానికి డెవలపర్స్ కు అవకాశం చిక్కుతుంది. అధికమయ్యే లిక్విడిటీ దేశ సమగ్ర అభివృద్ధి కి ప్రోత్సాహాన్ని అందించడం తో పాటు విభిన్న మహత్వపూర్ణ విద్యుత్తు పథకాల ను తిరిగి ఆరంభించడానికి కూడా పూచీ పడుతుంది.

పన్నుల సంబంధి అధికారుల కు అంతిమ మెగా సర్టిఫికెట్ సమర్పించడానికి గాను ఆమోదం / పాక్షిక ఆమోదం లభించినటువంటి 10 ప్రొవిజనల్ మెగా ప్రాజెక్టుల కు గడువు ను దిగుమతి తేదీ నుంచి 120 నెలల కు బదులు 156 నెలల వరకు పెంచివేయడం జరిగింది. పొడిగించినటువంటి ఈ కాలం లో, నవీన మరియు నవీనీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ (ఎమ్ఎన్ఆర్ఇ) మరియు సోలర్ ఎనర్జీ కార్ పొరేశన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్ఇసిఐ) ల సహకారం తో స్థిర శక్తి (అనియమిత నవీనీకరణ యోగ్య శక్తి, నిలవ మరియు సాంప్రదాయిక శక్తి ల మిశ్రణం) ని ఆకర్షించడం జరుగుతుంది. అంతేకాదు, పిపిఎ ను సురక్షితం గా ఉంచడం కోసం ఈ మెగా ప్రాజెక్టు లు ఈ తరహా బిడ్ లలో పాలుపంచుకొంటాయన్న అంచనా ఉంది. విద్యుత్త్తు మంత్రిత్వ శాఖ ఈ అవధి లో ప్రస్తుత విద్యుత్తు బజారు ల ఆధారం గా ఒక ప్రత్యామ్నాయాన్ని అభి వృద్ధిపరుస్తుంది. అలాగే, వినియోగదారుల కు ప్రతిస్పర్ధాత్మక పద్ధతి లో ప్రయోజనాల ను అందించడానికి కూడాను పూచీ పడుతుంది.

 

***



(Release ID: 1811578) Visitor Counter : 142