భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
సెమి కండక్టర్ చిప్స్ సరఫరాను పెంచేందుకు పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం
Posted On:
29 MAR 2022 12:45PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచించినట్టుగా సెమికండక్టర్ల చిప్స్ సరఫరాలను పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. దిగువ పేర్కొన్న ప్రాజెక్టులకు ఆమోదాన్ని తెలిపిందిః
ఎ) ఘనదృక్చక్తి పౌనఃపుణ్యాన్ని(హైపవర్ ఫ్రీక్వెన్సీ) కలిగిన ఎలక్ట్రానిక్స్ కోసం ఇన్‌క్యుబేటర్ (స్థిరోష్ణ పేటిక) , గాలియం నైట్రైడ్ అనుకూల వాతావరణ వ్యవస్థకు తోడ్పడే కేంద్రం ఏర్పాటు.
బి) పిఎల్ఐ పథకం కింద ఎన్ఎఎన్‌డి ఫ్లాష్ మెమొరీను కూర్చి, పరీక్షించి, ముద్రించి, ప్యాకేజింగ్ (ఎటిఎంపి) కోసం ప్రాజెక్టు ఏర్పాటు. సి) ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్ఐ - ఉత్పత్తితో అనుసంధానమైన ప్రోత్సాహకం) పథకం కింద ట్రాన్సిస్టర్లు, డయోడలు తదితర విలక్షణ సెమికండక్టర్ పరికరాల కోసం ప్రాజెక్టు.
డి) ఎలక్ట్రానిక్ భాగాలు, సెమికండక్టర్లు (ఎస్‌పిఇసిఎస్) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు పథకం కింద ఆర్థిక ప్రోత్సాహకాలు)
ఈ సమాచారాన్ని భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్ మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో వెల్లడించారు.
***
(Release ID: 1810980)
Visitor Counter : 177