ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక హాల్‌ లో విప్లవ భారత్ గ్యాలరీ ని ప్రారంభించిన ప్రధాన మంత్రి


“బీర్భూమ్ హింసాకాండ వంటి దురంతాలకు పాల్పడిన వారిని… అలాంటి నేరగాళ్లను ప్రోత్సహించే వారిని ఎప్పటికీ క్షమించవద్దని బెంగాల్ ప్రజలకు నా వినతి”

నేడు దేశం తన చరిత్ర ను.. గతాన్ని.. శక్తి కి తోడ్పడే సజీవ వనరు గా చూస్తోంది”

“శిక్ష పడుతుందన్న భయం లేకుండా ప్రాచీన విగ్రహాలను అక్రమ రవాణా చేసిన నేపథ్యంలో దేశ వారసత్వాన్ని నవ భారతం విదేశాల నుంచి తిరిగి తీసుకు వస్తోంది”

“పశ్చిమ బెంగాల్ వారసత్వ పరిరక్షణ.. మెరుగుపై ప్రభుత్వ
నిబద్ధతకు ‘విప్లవ భారత్‌ చిత్ర ప్రదర్శనశాల’ ఒక నిదర్శనం”

“చారిత్రక పర్యాటకాన్ని పెంచే దేశవ్యాప్త కార్యక్రమం భారత్‌లో కొనసాగుతోంది”

“భారత్-భక్తి అనే నిత్యసత్య భావన.. భారతదేశ
ఐక్యత-సమగ్రత నేటికీ మన అగ్ర ప్రాథమ్యాలుగా ఉండాలి”

“భారత్‌ కొత్త దృక్కోణం- ఆత్మవిశ్వాసం.. స్వావలంబన.. ప్రాచీన గుర్తింపు.. భవిష్యత్‌ ఉన్నతి; ఇందులో అత్యంత ప్రధానమైనది కర్తవ్య భావన”

“జాతీయ జెండా లోని కాషాయ.. తెలుపు.. ఆకుపచ్చ రంగు లు విప్లవ స్రవంతి కి, సత్యాగ్రహానికి, స్వాతంత్ర్య పోరాట సృజనాత్మక ప్రేరణల కు ప్రతీక”

“నవ భారతం లో కాషాయ రంగు కర్తవ్యం/జాతీయ భద్రతలకు సూచిక; తెలుపు రంగు ‘సబ్ కా సా

Posted On: 23 MAR 2022 7:51PM by PIB Hyderabad

“విప్లవ భారత్‌ చిత్ర ప్రదర్శనశాల”ను ఈ రోజు న అమరవీరుల సంస్మరణ దినం సందర్భం లో కోల్‌కాతా లోని విక్టోరియా స్మారక మందిరం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ప్రారంభించారు.  ఈ కార్యక్రమం లో పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ శ్రీ జగ్ దీప్‌ ధన్ ఖడ్, కేంద్ర మంత్రి శ్రీ జి.కిశన్‌ రెడ్డి పాల్గొన్నారు.

 

   ముందుగా బీర్భూమ్‌ హింసాత్మక ఘటన మృతులకు సంతాపం తెలుపుతూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఇంతటి దారుణ నేరానికి పాల్పడిన వారిని రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ దిశగా కేంద్రం నుంచి అన్నివిధాలా సహాయ సహకరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. “ఇటువంటి దురంతాలకు పాల్పడిన వారిని… అలాంటి నేరగాళ్లను ప్రోత్సహించే వారిని ఎప్పటికీ క్షమించవద్దు అని బెంగాల్ ప్రజల కు విజ్ఞప్తి చేస్తున్నాను” అన్నారు.

 

   అమరవీరుల సంస్మరణ దినం నేపథ్యం లో ప్రధాన మంత్రి వారి త్యాగాల ను గుర్తు కు తెచ్చుకున్నారు.  శ్రీ భగత్ సింహ్, శ్రీ  రాజ్‌ గురు, శ్రీ సుఖ్‌దేవ్‌ ల త్యాగనిరతి సంబంధి గాథ లు దేశం కోసం అవిశ్రాంతంగా కృషి చేసేటట్టు మనందరికీ స్ఫూర్తిని ఇచ్చాయి అని ఆయన పేర్కొన్నారు. “మన గతానికి సంబంధించిన వారసత్వం మన వర్తమానానికి మార్గనిర్దేశం చేస్తుంది. అలాగే చక్కని భవిష్యత్తు ను నిర్మించుకొనే విధం గా మనకు ప్రేరణను ఇస్తుంది. అందుకే ఇవాళ దేశం తన చరిత్ర ను, గతాన్ని ఒక సజీవ శక్తి గా చూస్తోంది” అన్నారు.  శిక్ష పడుతుందన్న కనీస భయం అయినా లేకుండా దేశం నుంచి ప్రాచీన విగ్రహాల ను అక్రమ రవాణా చేసిన నేపథ్యం లో దేశ వారసత్వాన్ని విదేశాల నుంచి నేటి న్యూ ఇండియా తిరిగి తీసుకు వస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.  ఇందులో భాగం గా 2014 కు ముందు దశాబ్దాల కాలం లో డజను విగ్రహాలు మాత్రమే భారతదేశాని కి తీసుకు రాగా, గడచిన ఏడేళ్ల లో ఈ సంఖ్య 225కు పైగా పెరిగింది అని ఆయన వెల్లడించారు.

 

   ‘నిర్భీక్‌ సుభాష్’ తరువాత కోల్‌కాతా సుసంపన్న వారసత్వ కీర్తి కిరీటం లో ‘విప్లవ భారత్‌  చిత్ర ప్రదర్శనశాల’ పేరిట మరొక ఆణిముత్యం చేరింది అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్ వారసత్వ పరిరక్షణ.. మెరుగుదల విషయాల లో ప్రభుత్వం యొక్క నిబద్ధత కు ‘విప్లవ భారత్‌ చిత్ర ప్రదర్శనశాల’ ఒక నిదర్శనం అని ఆయన అన్నారు. రాష్ట్రం లోని విక్టోరియా స్మారక మందిరం, చారిత్రిక ప్రదర్శనశాలలు, మెట్‌కాఫ్‌ హౌస్‌ వంటి విశిష్ట స్మారకాల నవీకరణ దాదాపు పూర్తి కావచ్చిందని ప్రధాన మంత్రి తెలిపారు. “మన సంస్కృతి కి, నాగరకత కు ప్రతిబింబాలు అయిన ఈ చిహ్నాలు భారతదేశం యొక్క వర్తమాన తరానికి, భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిని ఇవ్వాలి. ఈ దిశ లో ఇది ఒక అద్భుత కృషి” అని చెప్పారు.

 

   చారిత్రిక పర్యాటకాన్ని పెంచే దేశవ్యాప్త కార్యక్రమం భారతదేశం లో కొనసాగుతోంది అని శ్రీ నరేంద్ర మోదీ ఈ సందర్భంలో వెల్లడించారు. ఈ మేరకు ‘స్వదేశ్‌ దర్శన్‌’ వంటి అనేక పథకాల ద్వారా చారిత్రిక పర్యాటకానికి ఉత్తేజాన్ని ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.  ఇందులో భాగంగా ‘దాండీ యాత్ర, జలియాంవాలా బాగ్‌ స్మారకం నవీకరణ,  ఏకతా విగ్రహం ఆవిష్కరణ, దీన్‌ దయాళ్‌ స్మారకం, బాబాసాహెబ్‌ స్మారకం, భగవాన్‌ బిర్ సా ముండా స్మారకం నవీకరణ సహా అయోధ్య, కాశీ నగరాల లో ఘాట్ ల సుందరీకరణ, దేశవ్యాప్తంగా ఆలయాల పునరుద్ధరణ వంటి అనేక వినూత్న చర్యల ను చేపట్టినట్లు ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఈ నేపథ్యం లో చరిత్రాత్మకక పర్యాటకం కొత్త అవకాశాల కు బాటలు పరుస్తున్నదని చెప్పారు.

 

   దేశం శతాబ్దాల పాటు బానిసత్వం లో మగ్గిన నేపథ్యంలో మూడు ప్రవాహాలు ఉమ్మడి గా స్వాతంత్య్ర సిద్ధి కి బాటలు వేశాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ప్రవాహాలు విప్లవం, సత్యాగ్రహం, ప్రజా చైతన్యానికి ప్రతీకలు అని ఆయన అన్నారు. ఈ సందర్భం లోమూడు వన్నెల పతాకం.. జాతీయ జెండా విషయమై ప్రధాన మంత్రి సుదీర్ఘం గా సంభాషించారు.  సదరు మూడు ప్రవాహాలు త్రివర్ణ పతాకం లోని రంగుల కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని చెప్పారు.  కాషాయ వర్ణం విప్లవాత్మక స్రవంతి కాగా, తెలుపు రంగు సత్యాగ్రహానికి, ఆకుపచ్చ దేశ సృజనాత్మక దృష్టి కి చిహ్నాలని ఆయన అన్నారు.  అలాగే జాతీయ జెండా లోని నీలి రంగు దేశ సాంస్కృతిక చైతన్యాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఇవాళ జాతీయ జెండా లోని మూడు రంగుల్లో నవ భారతం భవిష్యత్తు తనకు కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. కాషాయ రంగు కర్తవ్యం/జాతీయ భద్రతలకు సూచిక కాగా; తెలుపు రంగు ‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. సబ్కా విశ్వాస్.. సబ్కా ప్రయాస్’లకు… ఆకుపచ్చ రంగు పర్యావరణ పరిరక్షణ కు… నీలి రంగు  చక్రం నీలి ఆర్థిక వ్యవస్థ కు ప్రతీకలని ఆయన అభివర్ణించారు.

 

   శ్రీ భగత్ సింహ్ , శ్రీ సుఖ్‌ దేవ్, శ్రీ రాజ్‌ గురు, శ్రీ ఆజాద్, శ్రీ ఖుదీరామ్ బోస్ వంటి నవ యువ విప్లవకారుల శకాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ- దేశ యువత తమను తాము ఎన్నడూ తక్కువ గా భావించకూడదన్నారు. “భారతదేశం యువత కు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు… వారు సాధించ జాలని  లక్ష్యం అంటూ ఏదీ లేదు” అని ఆయన అన్నారు.

 

   దేశభక్తి తో, దేశసేవ తపన తో వివిధ ప్రాంతాలు, భాషలు, వనరులు ఏకమై స్వాతంత్య్ర పోరాట కాలమంతటా సమైక్యతా స్రవంతి వెల్లువెత్తిందని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. “భారత్-భక్తి అనే నిత్యసత్య భావన.. భారతదేశ ఐక్యత-సమగ్రత నేటికీ మన అగ్ర ప్రాథమ్యాలుగా ఉండాలి. మీ రాజకీయ దృక్పథం ఏదైనా కావచ్చు.. మీరు ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనా కావచ్చు.. కానీ, భారతదేశ ఐక్యత-సమగ్రతలతో ఏమాత్రం రాజీపడినా అది మన స్వాతంత్ర్య సమర యోధులకు అతిపెద్ద ద్రోహమే అవుతుంది” అని ప్రధానమంత్రి దేశ ప్రజలకు హితవు పలికారు. “నవ భారతంలో మనం ఈ నవ్య దార్శనికతతో ముందడుగు వేయాల. ఈ కొత్త దృక్కోణం భారతదేశ ఆత్మవిశ్వాసం, స్వావలంబన, ప్రాచీన గుర్తింపు, భవిష్యత్తు ఉన్నతికి సంబంధించినది. ఇందులో అత్యంత ప్రధానమైనది కర్తవ్య భావన” అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

 

   దేశం నుంచి ఎగుమతులు ప్రస్తుతం 400 బిలియన్ డాలర్లు లేదా 30 లక్షల కోట్ల రూపాయల మైలురాయి ని చేరుకోవడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ- “భారతదేశం నుంచి పెరుగుతున్న ఎగుమతులు మన పరిశ్రమలు.. మన సూక్ష్మ, లఘు, మధ్య తరహా వాణిజ్య సంస్థ లు (ఎమ్ఎస్‌ఎమ్ ఇ)లు, మన తయారీ సామర్థ్యం/మన వ్యవసాయ రంగ శక్తి కి చిహ్నాలు” అని వ్యాఖ్యానించారు.

 

   స్వాతంత్ర్య పోరాటం లో విప్లవకారుల పాత్ర, బ్రిటిష్ వలస పాలన పై వారి సాయుధ ప్రతిఘటన లను ఈ చిత్ర ప్రదర్శనశాల మన కళ్లకు కడుతుంది. అయితే, స్వాతంత్ర్య ఉద్యమ ప్రధాన స్రవంతి కథనాల లో ఈ అంశానికి తరచు గా తగిన స్థానం లభించడం లేదు. దేశం లో 1947వ సంవత్సరం వరకూ సంభవించిన సంఘటనల సమగ్ర దృష్టికోణాన్ని ఆవిష్కరించడం, క్రాంతికారుల కీలక పాత్ర ను ప్రముఖంగా చూపడం ఈ చిత్ర ప్రదర్శనశాల లక్ష్యం గా ఉంది.

 

   విప్లవోద్యమానికి ప్రేరణను ఇచ్చిన రాజకీయ, మేధోపరమైన నేపథ్యాన్ని ‘విప్లవ భారత్ చిత్ర ప్రదర్శనశాల కళ్లెదుట నిలుపుతుంది. విప్లవాత్మక ఉద్యమం ఆవిర్భావం, విప్లవ నేతల ద్వారా కీలక సంఘాల ఏర్పాటు, ఉద్యమ వ్యాప్తి, భారతీయ జాతీయ సైన్యం ఏర్పాటు, నావికా తిరుగుబాటు పాత్ర తదితరాలను సచిత్రం గా వివరిస్తుంది.

DS

 


(Release ID: 1810963) Visitor Counter : 162