పర్యటక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వాటర్ స్పోర్ట్స్ మరియు సంబంధిత కార్యకలాపాలలో 27 కోర్సులను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్, గోవా అభివృద్ధి చేసింది: శ్రీ జి. కిషన్ రెడ్డి

प्रविष्टि तिथि: 28 MAR 2022 3:56PM by PIB Hyderabad

గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ (ఎన్ఐడబ్ల్యూఎస్) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం & ట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఐఐటీటీఎం), వాటర్ స్పోర్ట్స్ మరియు సంబంధిత కార్యకలాపాలలో శిక్షణ మరియు ధృవీకరణ కోసం పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన కేంద్ర స్వయంప్రతిపత్త సంస్థ కింద పనిచేస్తున్న కేంద్రం. గోవాలోని ఎన్ఐడబ్ల్యూఎస్ అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో నీటి సంబంధిత క్రీడా కార్యకలాపాలలో శిక్షణను అందించడం తప్పనిసరి. ఈ కేంద్ర స్వయంప్రతిపత్త సంస్థకు సంబంధించిన ఏదైనా కేంద్రాన్ని తెరవడానికి, పర్యాటక అభివృద్ధికి సంభావ్యత, వనరుల లభ్యత, సాధ్యత, డిమాండ్ మరియు ఇతర అంశాలు మరియు రాష్ట్రాలు మరియు యూటీలలోని వివిధ ప్రాంతాలలో తులనాత్మక ప్రయోజనం వంటి అంశాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్‌ఐడబ్ల్యూఎస్‌ ఏర్పాటుకు సంబంధించి మంత్రిత్వ శాఖకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు.

దేశంలో వాటర్ స్పోర్ట్స్ సంబంధిత టూరిజం ప్రమోషన్ కోసం రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రభుత్వాలకు మద్దతు ఇవ్వడానికి మంత్రిత్వ శాఖ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.  పర్యాటక మంత్రిత్వ శాఖ రాష్ట్ర మరియు యూటీ ప్రభుత్వాలకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ మద్దతును అందిస్తుంది. స్వదేశ్ దర్శన్ పథకంలో  ద్వీప, బీచ్ మరియు వాటర్-ఫ్రంట్ అభివృద్ధి కోసం, వాటర్ స్పోర్ట్స్, బీచ్ సేఫ్టీ మొదలైనవి ముఖ్యమైన ఆంశాలు. వీటితో పాటు భారతదేశంలో అడ్వెంచర్ టూర్ ఆపరేటర్ల ఆమోదం కోసం మంత్రిత్వ శాఖ ఒక యంత్రాంగాన్ని కలిగి ఉంది.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ (ఎన్ఐడబ్ల్యూఎస్) గోవా ద్వారా విధానాలు, మార్గదర్శకాలు, ఎస్ఓపీలు, మానవశక్తి శిక్షణ మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకు మద్దతు అందించబడుతుంది.  కార్యకలాపాలను బలోపేతం చేయడానికి మరియు ఇండియన్ నేవీ ఫిజికల్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటు కోసం ఎన్ఐడబ్ల్యూఎస్ ఇప్పటికే రాష్ట్రాలు మరియు కేంద్రపాలితప్రాంత ప్రభుత్వాలతో ఎంఓయూకు ఏర్పాట్లు చేసింది.

ఎన్ఐడబ్ల్యూఎస్ ద్వారా వాటర్ స్పోర్ట్స్ మరియు సంబంధిత కార్యకలాపాలలో 27కి పైగా కోర్సులు అభివృద్ధి చేయబడ్డాయి. ఇన్స్టిట్యూట్ యొక్క శిక్షకులు వివిధ రాష్ట్రాలు మరియు యూటీలకు శిక్షణ ఇస్తారు మరియు ఆఫ్-క్యాంపస్ శిక్షణా కోర్సులను చేపట్టారు. ఎన్ఐడబ్ల్యూఎస్ ఆన్‌లైన్ మరియు ఫిజికల్ మోడ్‌లలో వాటర్ స్పోర్ట్స్ అవగాహన ప్రచారాలను కూడా చేపట్టింది.

ఈరోజు లోక్‌సభలో పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్‌రెడ్డి లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.


 

*******


(रिलीज़ आईडी: 1810864) आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Kannada