ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ క్షయ నివారణ దినం-2022


కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమక్షంలో "స్టెప్ అప్ టు ఎండ్ టిబి 2022" సమ్మిట్ ను ప్రారంభించిన ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్

'టిబి ముక్త్ భారత్' అభియాన్ కోసం ఆదర్శవంతమైన సహకారం అందించడానికి టిబి ఉన్న పిల్లలను దత్తత తీసుకోవాలని పిలుపు

జన్ భాగీదారి , జన్ ఆందోళన్ ద్వారా టిబిని అరికట్టి , ఎస్ డి జి లక్ష్యానికి ఐదు సంవత్సరాల ముందే :2025 నాటికి దేశాన్ని టిబి రహిత భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చు: డాక్టర్ మన్సుఖ్ మాండవియా

Posted On: 24 MAR 2022 2:07PM by PIB Hyderabad

ప్రపంచ క్షయ (టి బి) నివారణ దినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి. ఆనందిబెన్ పటేల్ ఈ రోజు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా సమక్షంలో "స్టెప్ అప్ టు ఎండ్ టిబి" సదస్సును వర్చువల్‌గా ప్రారంభించారు, ఎస్ డిజి 2030 ప్రపంచ లక్ష్యానికి ఐదు సంవత్సరాల ముందు, అంటే 2025 నాటికి అధిక భారంతో కూడిన క్షయ వంటి అంటువ్యాధులను నిర్మూలించడానికి భారతదేశం నిబద్ధతను పునరుద్ఘాటించడం. ఈ సదస్సు ఉద్దేశం. కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్,  సైన్స్- టెక్నాలజీ , ఎర్త్ సైన్సెస్ శాఖ సహాయ (స్వతంత్ర హోదా) మంత్రి డాక్ట ర్ జితేంద్ర సింగ్ , అస్సాం రాష్ట్ర ఆరోగ్య మంత్రి శ్రీ. కేశవ్ మహంత, అరుణాచల్ ప్రదేశ్ ఆరోగ్య మంత్రి శ్రీ అలోలిబాంగ్, నీతి ఆయోగ్

సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్, ఇతర

ప్రముఖులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

శ్రీమతి ఆనందీబెన్ పటేల్  మాట్లాడుతూ, 2025 నాటికి క్షయవ్యాధిని నిర్మూలించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించడానికి అన్ని నేపథ్యాల నుండి ప్రజలను జన ఆందోళన్ లోకి తీసుకువచ్చే ఒక సామాజిక విధానం అవసరమని పేర్కొన్నారు.అందరికీ తగినంత పోషకాహారాన్ని అందించడం, అవగాహన కల్పించడం ఇంకా వ్యాధితో సంబంధం ఉన్న ఏదైనా సామాజిక లోపాన్ని పరిష్కరించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కోరారు.వ్యాధితో బాధపడుతున్న పిల్లలు ,వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ఆమె ప్రత్యేక ప్రస్తావన చేశారు. బాల్య క్షయవ్యాధిని అంతం చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. క్షయవ్యాధితో బాధపడుతున్న పిల్లలను దత్తత తీసుకునేలా వ్యక్తులు, ప్రభుత్వ ,ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించే తన అనుభవాన్ని పంచుకుంటూ, ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన వారు కూడా అలాంటి పిల్లలను దత్తత తీసుకోవాలని,  క్షయవ్యాధి పై దేశం జరుపుతున్న నిబద్ధతతో కూడిన పోరాటంలో ఆదర్శవంతమైన సహకారాన్ని అందించాలని ఆమె కోరారు.‘‘ సకాలంలో చికిత్సను ప్రారంభించడానికి వీలుగా పిల్లలకు  టి బి స్క్రీనింగ్ చేయడానికి తల్లిదండ్రులు, కమ్యూనిటీలు, పాఠశాలలు ,అంగన్

వాడీలను ప్రోత్సహించడం కూడా అంతే ముఖ్యం" అని ఆమె పేర్కొన్నారు.రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో తీసుకున్న అనేక చర్యల గురించి ఆమె మాట్లాడుతూ, "గత సంవత్సరం వరకు మనం టిబి ,కోవిడ్ -19 ద్వంద్వ సవాళ్లను ఎదుర్కొన్న నేపథ్యంలో మన ప్రయత్నాలు ఎంతో ముఖ్యమైనవి. వాస్తవానికి, కోవిడ్ , టిబి కోసం ద్వి-దిశాత్మక స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లడం నోటిఫికేషన్‌లలో గణనీయమైన పెరుగుదలలో కీలక పాత్ర పోషించింది‘‘ అని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఆరోగ్య ప్రతినిధులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, విద్యార్థి సంఘాలు ఇంకా మన పౌరులకు సంక్షేమాన్ని అందించడానికి ,అందరికీ ఆరోగ్యాన్ని నిర్ధారించడానికి సమర్థవంతంగా సమీకరించగల ఇతర భాగస్వాముల బలమైన నెట్ వర్క్ పరంగా దేశం సామర్థ్యాలను ఆమె ప్రముఖంగా తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో 'ప్రత్యేక ప్రసంగం' చేసిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, 360-డిగ్రీల సంపూర్ణ విధానం భారతదేశంలో టిబి నిర్మూలనకు మూలస్తంభం అని తెలిపారు.  ఎస్ డిజి 2030 ద్వారా నిర్దేశించిన టిబి నిర్మూలన లక్ష్యానికి ఐదు సంవత్సరాల ముందే , 2025 నాటికి టిబిని నిర్మూలించాలనే ప్రధాన మంత్రి దార్శనికతను సాధించడానికి కృతనిశ్చయంతోకట్టుబడి ఉన్నాము. అన్ని రాష్ట్రాల చురుకైన ప్రయత్నాలు, మన దేశ నాయకత్వం నిరంతర మార్గదర్శకత్వం ద్వారా, ఈ కార్యక్రమం సవాలుతో కూడిన సమయాల్లో పురోగమించింది" అని ఆయన అన్నారు. .టిబికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో విజయం సాధించడానికి

సమాజం, ప్రభుత్వ ప్రయత్నాలకు

తోడ్పడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టిబి ముక్త్ భారత్ కోసం పనిచేయడం తమ స్వంత కర్తవ్యం అనే ఆలోచనతో ఎన్ జిఒలు, సిఎస్ ఒలు ,ఇతర భాగస్వాములు ఈ ఆలోచనపై పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు  వారి కృషికి గాను అవార్డులు ఇస్తూ, " అర్హత కలిగిన  రాష్ట్రాలు,  కేంద్రపాలిత ప్రాంతాలకు అందించే ప్రశంసలు వారిని మరింత మెరుగ్గా పనిచేయడానికి ప్రేరేపిస్తాయనీ  , ఇది క్షయవ్యాధిని నిర్మూలించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది" అని ఆయన పేర్కొన్నారు.

 

కోవిడ్ వల్ల ఎదురైన సవాళ్లను కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రస్తావిస్తూ, "రెండు సంవత్సరాలకు పైగా, మనం టిబి ప్రాబల్యంతో పాటు ప్రపంచ మహమ్మారిని ఎదుర్కొంటున్నాము. రెండు వ్యాధులు కూడా అత్యంత అంటువ్యాధి, గాలి ద్వారా వ్యాపించేవి.  కుటుంబాలు , కమ్యూనిటీలను తీవ్రంగా ప్రభావితం చేసేవే‘‘ అని అన్నారు. ‘‘మనం ముందుకు సాగు తున్నండున జన్ ఆందోళన్ ,జన్ భాగీదారి ద్వారా టిబికి వ్యతిరేకంగా మన సమన్వయ పోరాటంలో వివిధ వాటాదారులు ,  భాగస్వాములను నిమగ్నం చేద్దాం, కోవిడ్ 19 పై పోరాటంలో మనం ఎలా కలసి పని చేశామో అలా" అని ఆయన పేర్కొన్నారు.

 

"పిల్లలను దత్తత తీసుకోవడమే కాకుండా, స్థానిక సంస్థల సహాయంతో బ్లాక్ లు, జిల్లాలను దత్తత తీసుకోవడానికి మనం మరో అడుగు ముందుకు వేయవచ్చు" అని ఆయన సూచించారు. ‘‘దేశవ్యాప్తంగా రోగులను గుర్తించడం, చికిత్స ,మద్దతు ఇచ్చే వ్యవస్థను మనం అభివృద్ధి చేసాము. కొత్త అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు ,చికిత్సా విధానాలు వస్తున్నాయి, వీటిని క్షయవ్యాధికి వ్యతిరేకంగా మన పోరాటంలో ఉపయోగించవచ్చు‘‘  అని అన్నారు. సర్వీస్ డెలివరీ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్, ఇ-ఫార్మసీ, టెలిమెడిసిన్ వంటి డిజిటల్ సదుపాయాలను టిబి నిర్మూలనకు ఉపయోగించవచ్చు.

 

డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో ఆరోగ్య కార్యకర్తల కృషికి ధన్యవాదాలు తెలిపారు, కోవిడ్-19 నిర్వహణ విధానాలకు భారతదేశం ప్రశంసలు అందుకుందని అదేవిధంగా టిబి నిర్మూలన ప్రయత్నాలతో మనం మళ్ళీ ఒక ఉదాహరణను ఇవ్వగలమని ఆమె పేర్కొన్నారు

"కోవిడ్ మహమ్మారి నుండి మనం నేర్చుకున్నవి కూడా మనకు సహాయపడతాయి. జిల్లా స్థాయి, బ్లాక్ స్థాయి, పంచాయితీ లేదా కమ్యూనిటీ స్థాయిలో వివిధ పాలనా స్థాయిలలో ప్రయత్నాలు సమర్థవంతంగా పటిష్టమవుతాయి‘‘ అన్నారు.

 

భారతీయ డేటా ఆధారంగా "డేర్ టు ఎరాడ్ టిబి" కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు , డబ్ల్యుఎస్ జి టిబి నిఘా కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియంను ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రకటించారు. టి బి వ్యాప్తి   నిరోధానికి వ్యాధి జీవశాస్త్రం, ఔషధాల ఆవిష్కరణ, వ్యాక్సిన్ అభివృద్ధిలో సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చేసిన కృషిని కూడా ఆయన వివరించారు.

 

ప్రతి ఇంటికి చేరుకునేలా  రోగనిర్ధారణ సేవలను పెంచవచ్చని మహమ్మారి మనకు చూపించిందని డాక్టర్ వికె పాల్ పేర్కొన్నారు. ఇంకా, ఇంటి వద్ద ఆరోగ్య సంరక్షణ ,ఆరోగ్య సేవలను అందించేందుకు.రాష్ట్రాలలో యంత్రాంగాలు ఏర్పాటు అయ్యాయని చెప్పారు. ఈ అనుభవ పాఠాలను మన ఎండ్-టిబి ప్రోగ్రామ్ ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగించవచ్చనీ,అణగారిన వర్గాలు వ్యాధి అధిక భారాన్ని మోస్తున్నాయని, అందువల్ల నిశిత దృష్టి అవసరమని పేర్కొంటూ గిరిజన జనాభాను చేరుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు.

 

ఈ సందర్భంగా పలు నివేదికలు, కొత్త జోక్యాలను విడుదల చేశారు. ఇండియా టిబి రిపోర్ట్ 2022 , నేషనల్ టిబి ప్రాబల్య సర్వే రిపోర్ట్ దేశంలో టిబి స్థితిని చూపించాయి.

రిపోర్ట్ ఆన్ సి-టిబి (టిబి ఇన్‌ఫెక్షన్ నిర్ధారణ కోసం కొత్త చర్మ పరీక్ష), ఎక్స్‌ట్రా పల్మనరీ టిబి & పీడియాట్రిక్ టిబి (బుక్ & మొబైల్ అప్లికేషన్) నిర్వహణ కోసం స్టాండర్డ్ ట్రీట్‌మెంట్ వర్క్‌ఫ్లోస్ వంటి ఇతర రిలీజ్ లు విడుదల చేశారు. ఇన్ టి జి ఎస్ (ఇండియన్ టిబి జెనోమిక్ సర్వైలెన్స్ కన్సార్టియం) ను ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్- హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ల ద్వారా జన్ ఆందోళన్ ను ప్రేరేపించే 21 రోజుల ప్రచారం కూడా ప్రారంభమైంది. ఇది 2022 ఏప్రిల్ 14న ముగుస్తుంది.

 

ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డిజి , డాక్టర్

బల్ రామ్ భార్గవ , సెక్రటరీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాల జీ) డాక్ట ర్ రాజేష్ ఎస్ గోఖలే ,సెక్రటరీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ) డాక్టర్ సునీల్ కుమార్ , డిజిహెచ్ఎస్ , శ్రీ వికాస్ షీల్ , ఏఎస్ అండ్ ఎండీ (ఎన్ హెచ్ ఎం), ఇతర సీనియర్ అధికారులు, టీబీ నివారణకు కృషి చేస్తున్న ప్రముఖులు కూడా హాజరయ్యారు.



(Release ID: 1809408) Visitor Counter : 243