వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ముడి జనుముకు 2022-23 సీజను కు గాను కనీస మద్దతు ధర కు ఆమోదం తెలిపినమంత్రివర్గం
Posted On:
22 MAR 2022 2:41PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ముడి జనుము కు 2022-23 సీజను కు గాను కనీస మద్దతు ధర (ఎమ్ఎస్ పి) కి ఆమోదాన్ని తెలిపింది. వ్యవసాయ వ్యయాలు మరియు ధరల సంఘం చేసిన సిఫారసుల ఆధారం గా ఈ ఆమోదాన్ని తెలపడమైంది.
ముడి జనుము (టిడిఎన్ 3 కి సమానమైన దాని నుంచి టిడి5 గ్రేడ్) యొక్క కనీస సమర్థన ధర ను ప్రతి ఒక్క క్వింటాలు కు 4750 రూపాయలు గా నిర్ధారించడం జరిగింది. ఇది ఉత్పాదన యొక్క ఆల్ ఇండియా వెయిటెడ్ ఏవరేజ్ కాస్ట్ పైన 60.53 శాతం లాభానికి పూచీ పడుతున్నది. 2022-23 సీజను కోసం ముడి జనుము కు ప్రకటించిన అటువంటి ఎమ్ఎస్ పి బడ్జెటు 2018-19 లో ప్రభుత్వం ద్వారా ప్రకటించిన ఆల్ ఇండియా వెయిటెడ్ ఏవరేజ్ కాస్ట్ కంటే తక్కువ లో తక్కువ 1.5 రెట్ల స్థాయి లో ఎమ్ఎస్ పి ని ఖరారు చేయాలి అనేటటువంటి సిద్ధాంతాని కి అనుగుణం గా ఉన్నది.
ఇది లాభం రూపం లో కనీసం 50 శాతాని కి బరోసా ను కల్పిస్తుంది. ఇది జనుము ను పండించే వారి కి మెరుగైన ప్రతిఫలాని కి పూచీ పడేటటువంటి చర్య మాత్రమే కాకుండా నాణ్యమైన జనప నార ను ప్రోత్సహించే దిశ లో మహత్త్వపూర్ణమైన, ప్రగతిశీలమైన నిర్ణయాల లోనూ ఒకటి గా ఉంది.
ధర పరం గా సమర్ధన కార్యకలాపాల ను చేపట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ గా పని చేయడాన్ని జూట్ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా (జెసిఐ) కొనసాగించనుంది. మరి ఈ తరహా కార్యకలాపాల నిర్వహణ లో ఏ వైనా నష్టాలు వచ్చాయి అంటే గనక కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి లో చెల్లించి భర్తీ చేస్తుంది.
***
(Release ID: 1808190)