హోం మంత్రిత్వ శాఖ

శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారకాన్ని దర్శించిన పద్మ అవార్డు గ్రహీతలు

Posted On: 22 MAR 2022 1:17PM by PIB Hyderabad
రాష్ట్రపతి భవన్ లో నిన్న జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో  రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్  2022 సంవత్సరానికి రెండు పద్మవిభూషణ్ఎనిమిది పద్మభూషణ్ మరియు 54 పద్మశ్రీ పురస్కారాలను  ప్రదానం చేశారు. మార్చి 28వ తేదీన మరి కొన్ని పురస్కారాలను ప్రదానం చేయడం జరుగుతుంది.  
నిన్న పురస్కారాలను స్వీకరించిన వారికి   ఈ రోజు శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మరో అరుదైన గౌరవాన్ని అందించింది. ఢిల్లీలో జాతీయ యుద్ధ వీరుల సంస్మరణ స్థలాన్ని సందర్శించేందుకు  వీరికి కేంద్ర ప్రభుత్వం  ఏర్పాట్లు చేసింది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో అసువులు బాసిన వారి స్మారకార్థం వారి పేర్లను లిఖించి యుద్ధ స్మారకాన్ని నెలకొల్పడం జరిగింది. జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించిన పద్మ పురస్కార గ్రహీతలు వీరుల త్యాగాలను విని చలించి పోయారు. జాతీయ యుద్ధ స్మారకాన్ని సందర్శించేందుకు  తమకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. దేశ రాజధాని లో ఏర్పాటు చేసిన యుద్ధ స్మారకాన్ని సందర్శించేందుకు పెద్దలు, పిల్లలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాన్ని వారు అభినందించారు. జాతీయ యుద్ధ స్మారకం మరింత ప్రచారం పొందాలని ఆకాంక్షించారు. యుద్ధ స్మారకాన్ని సందర్శించడం ద్వారా ప్రజల్లో దేశభక్తి పెరుగుతుందని,  అంకిత భావంతో విధులు నిర్వర్తించాలన్న పట్టుదల కలుగుతుందని, ధైర్య  సాహసాలు, త్యాగ స్ఫూర్తి అలవారుతాయని  పద్మ పురస్కార గ్రహీతలు పేర్కొన్నారు. 
యుద్ధ వీరుల స్మారక స్థూపాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ   2019 ఫిబ్రవరి 19న జాతికి అంకితం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి  వీర సైనికులు చేసిన త్యాగాలకు ప్రతి రూపంగా యుద్ధ వీరుల స్మారక స్థూపం ఏర్పాటయింది.  సైనికులు చేసిన త్యాగాలు కలకాలం గుర్తుంటాయని తెలియజేసే విధంగా దీనిలో జ్వాల నిరంతరం వెలుగుతూ ఉంటుంది. జాతీయ దినోత్సవాలతో సహా అన్ని నివాళి వేడుకలు ఢిల్లీలో జాతీయ యుద్ధ వీరుల సంస్మరణ స్థలంలో మాత్రమే జరుగుతున్నాయి. ప్రతి రోజు సాయంత్రం దీనిలో వారసుల ( నెక్స్ట్-ఆఫ్-కిన్ NoK) వేడుక జరుగుతుందిఈ సందర్భంగా సైనికుడు చేసిన అత్యున్నత త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ అతని వారసులు   స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచుతారు.  దేశ, విదేశాలకు చెందిన  ప్రముఖులు తమ ఢిల్లీ పర్యటనలో ఢిల్లీలో జాతీయ యుద్ధ వీరుల సంస్మరణ స్థలాన్ని సందర్శించి అమరవీరులకు  నివాళులు అర్పిస్తున్నారు. 
వివిధ రంగాలలో గుర్తింపు  పొందిన వారిని గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాలతో  వారిని నిన్న సత్కరించింది. అర్హులను గుర్తించి గౌరవించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఎంపిక ప్రక్రియను సమూలంగా ప్రక్షాళన చేసింది.  అంకిత భావంతో సమాజానికి నిస్వార్థ సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించడంపై దృష్టి సారించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం మరియు ఆన్‌లైన్ నామినేషన్‌ను ప్రవేశపెట్టి  ప్రక్రియను సులభతరం చేయడం జరిగింది. ప్రక్రియ ప్రజలకు అందుబాటులోకి రావడంతో 2022 పద్మ పురస్కారాల కోసం రికార్డు స్థాయిలో 4.80 లక్షల నామినేషన్లు వచ్చాయి. స్వీయ-నామినేషన్ఆన్‌లైన్ నామినేషన్,గుర్తింపుకు నోచుకోని వారిని  పెద్ద  సంఖ్యలో గుర్తించి  పారదర్శక ఎంపిక ప్రక్రియను అమలు చేయడంతో  పద్మ అవార్డులు "పీపుల్స్ పద్మ"గా మారాయి. 
  కేంద్ర హోం వ్యవహారాలు మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రదానోత్సవం తర్వాత పురస్కారాలను అందుకున్న వారిని అభినందించారు.  నిన్న న్యూఢిల్లీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు మరియు వారి కుటుంబాలతో ముచ్చటించి వారి  గౌరవార్థం  విందు ఏర్పాటు చేశారు. 


(Release ID: 1808178) Visitor Counter : 132