ప్రధాన మంత్రి కార్యాలయం

శహీద్ దివస్ సందర్భం లో కోల్ కాతా లో గల విక్టోరియా మోమోరియల్ హాలు లోబిప్లొబీ భారత్ గేలరీ ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


ఈ చిత్రశాల ను చూసి  స్వాతంత్య్ర పోరాటం లో విప్లకారుల తోడ్పాటు ను గురించి  తెలుసుకోవచ్చును

1947వ సంవత్సరం వరకు జరిగిన అన్ని ఘటనల తాలూకు సమగ్ర రూపంఈ గేలరీ లో  కళ్ల కు కనపడుతుంది

Posted On: 22 MAR 2022 11:45AM by PIB Hyderabad

శహీద్ దివస్ సందర్భం లో, కోల్ కాతా లోని విక్టోరియా మెమోరియల్ హాల్ లో గల బిప్లొబీ భారత్ గేలరీ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 23 వ తేదీ న సాయంత్రం 6 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. కార్యక్రమం కొనసాగే క్రమం లో అక్కడ హాజరైన జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.

స్వాతంత్య్ర పోరాటం లో క్రాంతికారుల తోడ్పాటు ను మరియు బ్రిటిషు వలస హయాము కు వ్యతిరేకం గా వారు జరిపిన సాయుధ ప్రతిఘటన ను ఈ చిత్రశాల లో గమనించవచ్చును. స్వాతంత్య్ర ఉద్యమాని కి సంబంధించిన ప్రధాన స్రవంతి కథనం లో ఈ పక్షాని కి ఇవ్వవలసిన అటువంటి స్థానాన్ని ఇవ్వడం జరుగలేదు. 1947వ సంవత్సరం లో పరాకాష్ఠ కు చేరుకొన్న అన్ని ఘటన ల సమగ్ర చిత్రణ ను ఆవిష్కరించడం తో పాటు విప్లవకారులు పోషించిన మహత్త్వపూర్ణమైన పాత్ర ను గురించి కూడా ప్రముఖం గా పేర్కొనాలి అనేదే ఈ కొత్త ప్రదర్శన శాల ను ఏర్పాటు చేయడం లోని ఉద్దేశం గా ఉంది.

బిప్లొబీ భారత్ గేలరీ లో విప్లవ ఉద్యమాని కి ప్రేరణ ను అందించినటువంటి రాజకీయ పరమైన మరియు బౌద్ధిక పృష్టభూమి ని ఆవిష్కరించడమైంది. చిత్రశాల లో విప్లవ ఉద్యమం యొక్క జన్మ, క్రాంతికారుల ద్వారా మహత్త్వపూర్ణ సంఘాల నిర్మాణం, ఉద్యమం యొక్క వ్యాప్తి, ఇండియన్ నేశనల్ ఆర్మీ యొక్క స్థాపన, నౌకాదళం తిరుగుబాటు యొక్క తోడ్పాటు తదితర అంశాల ను కళ్లకు కట్టినట్టు వివరించడం జరుగుతుంది.

 

 

***



(Release ID: 1808170) Visitor Counter : 166