హోం మంత్రిత్వ శాఖ

నేడు రాష్ట్రపతి భవన్‌లో 2022 సంవత్సరానికి సంబంధించిన పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేయనున్న భారత రాష్ట్రపతి

Posted On: 21 MAR 2022 11:10AM by PIB Hyderabad

సోమ‌వారం (ఈరోజు) రాష్ట్రపతి భవన్‌లో జరగనున్న సివిల్ ఇన్వెస్టిచర్ సెర్మనీ-Iలో.. 2022 సంవత్సరానికి సంబంధించిన రెండు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్, 54 పద్మశ్రీ అవార్డులను గాను  రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ప్రదానం చేయనున్నారు.
నేటి ఇన్వెస్టిచర్ వేడుకలో  అవార్డుల‌ను అందుకోనున్న ప్ర‌ముఖల వివ‌రాలు ఇలా ఉన్నాయి. పద్మ విభూష‌ణ్ః శ్రీ రాధే శ్యామ్, జనరల్ బిపిన్ రావత్ (మరణానంతరం). పద్మ భూష‌ణ్ః  శ్రీ గులాం నబీ ఆజాద్, శ్రీమతి  గుర్మీత్ బావా (మరణానంతరం), శ్రీ ఎన్ చంద్రశేఖరన్, శ్రీ దేవేంద్ర ఝఝరియా, శ్రీ రషీద్ ఖాన్, శ్రీ రాజీవ్ మెహ్రిషి, డాక్టర్ సైరస్ పూనావల్ల మరియు శ్రీ సచ్చిదానంద స్వామి.  సివిల్ ఇన్వెస్టిచర్ సెర్మనీ -II మార్చి 28న జరగ‌నుంది. పద్మవిభూషణ్, పద్మభూషణ్ మరియు పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ అవార్డుల‌ను కళలు, సామాజిక కార్య‌క్ర‌మాల‌, ప్రజా వ్యవహారాలు, సైన్స్ మరియు ఇంజినీరింగ్, వాణిజ్యం మరియు పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం మరియు విద్య, క్రీడలు, పౌర సేవలు మొదలైన వివిధ విభాగాలు/ కార్యకలాపాల రంగాలలో అందించబడతాయి.  'పద్మవిభూషణ్‌' అవార్డును అసాధారణమైన మరియు విశిష్టమైన సేవకు గుర్తింపుగా ప్రదానం చేయబడుతుంది; 'పద్మభూషణ్' ఉన్నత స్థాయి విశిష్ట సేవకు మరియు 'పద్మశ్రీ' ఏ రంగంలోనైనా విశిష్ట సేవలందించినందుకు గుర్తింపుగా అందిస్తారు. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఉత్సవ కార్యక్రమాలలో ఈ అవార్డులను భారత రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఈ సంవత్సరం రెండు ద్వయం కేసులతో సహా మొత్తం 128 పద్మ అవార్డులు ప్ర‌క‌టించ‌బ‌డ్డాయి.  (ద్వయం కేసులో, అవార్డు ఒకటిగా పరిగణించబడుతుంది). అవార్డులు ప్ర‌క‌ట‌న జాబితాలో నాలుగు పద్మ విభూషణ్, 17 పద్మ భూషణ్ మరియు 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ప్ర‌క‌టించిన అవార్డుల జాబితాలో  34 మంది మహిళలు,  విదేశీయులు ఎన్ఆర్ఐ పీఐఓ ఓసీఐ వర్గం నుండి 10 మంది వ్యక్తులు ఉన్నారు. 13 మరణానంతర అవార్డులు ప్ర‌క‌టించిన వారు కూడా ఉన్నారు.
                                                     

****



(Release ID: 1807549) Visitor Counter : 185