సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
బాలీవుడ్ నటుడు శ్రీ ఆర్.మాధవన్ తో కలసి దుబాయ్ లో మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ వీక్ ను ప్రారంభించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర
2022 మార్చి చివరినాటికి ఎవిజిసి
టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
భారతదేశంలో స్పోర్ట్స్ రేడియో స్టేషన్ ను ప్రారంభించేందుకు దుబాయ్ కు చెందిన ఛానల్ 2 గ్రూప్ ఆసక్తి
ఇండియా పెవిలియన్ వద్ద గ్లోబల్ గా లాంచ్ అయిన అర్ అర్ అర్ చిత్రం
Posted On:
18 MAR 2022 6:50PM by PIB Hyderabad
దుబాయ్ ఎక్స్ పో లోని.ఇండియా పెవిలియన్ లో మీడియా అండ్ ఎంటర్ టైన్ మెంట్ వీక్ ను సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర ఈ రోజు బాలీవుడ్ నటుడు శ్రీ ఆర్.మాధవన్ తో కలసి ప్రారంభించారు. దూరదర్శన్ డైరెక్టర్ జనరల్ శ్రీ మయాంక్ అగర్వాల్, ఐ అండ్ బి జాయింట్ సెక్రటరీ శ్రీ విక్రమ్ సహాయ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సిఇఒ శ్రీ రవిందర్ భాకర్, నేషనల్ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ లతో కూడిన మంత్రిత్వ శాఖ ప్రతినిధి వర్గానికి శ్రీ చంద్ర నాయకత్వం వహిస్తున్నారు.
శ్రీ అపూర్వ చంద్ర ఈ సందర్భంగా ఛానల్ 2 గ్రూప్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీ అజయ్ సేథితో సమావేశం అయ్యారు. ప్రత్యేకంగా క్రీడలకు ఉద్దేశించిన లైవ్ రేడియో ఛానెల్ ను భారత్ లి ప్రారంభించాలనే తమ కంపెనీ ఆలోచనను శ్రీ సేథి శ్రీ చంద్రకు తెలిపారు. " భారత్ లో ప్రస్తుతం రేడియోలో క్రికెట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారంలో నాణ్యత , విషయం సరిగా లేదని, సుమారు 11 సెకన్ల ఆలస్యం కూడా ఉందని శ్రీ సేథి అన్నారు. ఈ సంస్థ కపిల్ దేవ్ , సునీల్ గవాస్కర్ సహా పలువురు క్రికెటర్లతో సహకార భాగస్వామ్యం కలిగి ఉందని, మౌలిక స దుపాయాలు, మార్కెటింగ్ , కంటెంట్ ల లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని, భారత ప్రభుత్వం నుండి మద్దతు ను కోరుతున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం, కంపెనీ ప్రసార భారతితో 60:40 రెవిన్యూ షేరింగ్ మోడల్ లో ఉంది. కానీ కంటెంట్ ను తయారు చేయడం లేదు.
తమ కంపెనీ దుబాయ్ లో ఎఫ్ ఎమ్ ఛానల్స్, కెన్యాలో టీవీ ఛానెల్, కరేబియన్ , దక్షిణాఫ్రికాలో మీడియా సిటీ, క్రికెట్ జట్ల తో పాటు ఇతర కీలక కార్యకలాపాలను నిర్వహిస్తోందని కూడా శ్రీ సేథీ భారత ప్రతినిధి వర్గం నాయకుడు శ్రీ అపూర్వ చంద్ర కు తెలియజేశారు. ఈ సంస్థకు ఐసిసి గ్లోబల్ క్రికెట్ రేడియో హక్కులు ఉన్నాయి. ఈ వెంచర్ ను మరింత ముందుకు తీసుకెళ్లడానికి మంత్రిత్వ శాఖ నుండి అవసరమైన మద్దతు ను అందిస్తామని శ్రీ చంద్ర హామీ ఇచ్చారు.
యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (ఏవిజిసి) లో సహకారం, భారత్ తో కలసి కంటెంట్ తయారీ అంశాలపై ఇండియా పెవిలియన్ వద్ద నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం లో శ్రీ చంద్ర మాట్లాడుతూ, భారత దేశంలో ఎవిజిసి రంగంలో అవకాశాలను గురించి ప్రముఖంగా
ప్రస్తావించారు. "ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో భారతీయ మీడియా , వినోద పరిశ్రమ స్పష్టం గా కనబడతాయి ‘‘ అని అన్నారు. భారతీయ ఎం అండ్ ఇ పరిశ్రమ విలువ 28 బిలియన్ అమెరికన్ డాలర్లు కాగా, 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
పరిశ్రమలో అవసరమైన ప్రతిభ , సృజనాత్మక నైపుణ్యం భారతదేశం కలిగి ఉంది. ఈ రంగంలోని కంపెనీల మరింత సౌలభ్యం కోసం ఎవిజిసి విధానాన్ని రూపొందించే ఉద్దేశ్యంతో సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ మార్చి 2022 చివరి నాటికి ఎవిజిసి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుందని కార్యదర్శి శ్రీ చంద్ర తెలిపారు.
ఎవిజిసి రంగం పట్ల భారత ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ను శ్రీ ఆర్ మాధవన్ ప్రశంసించారు . భారతీయుల ప్రతిభ , దాని వృద్ధి సామర్థ్యం గురించి నొక్కి చెప్పారు.
శ్రీ రవిందర్ భాకర్ మాట్లాడుతూ, నైపుణ్యం టాలెంట్ పూల్ సృష్టించడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు, ఇది దీర్ఘకాలంలో భారతీయ ఎమ్ అండ్ ఇ పరిశ్రమకు ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు.
భారతదేశం, దుబాయ్ , తదితర దేశాలకు చెందిన పరిశ్రమ ప్రతినిధుల నుండి రౌండ్ టేబుల్ లో వెల్లడైన విస్తారమైన సమాచారం ఈవిజిసి రంగంలో అవుట్ సోర్సింగ్ కు భారతదేశం విస్తృత అవకాశాలను అందిస్తుందని అంగీకరించాయి, అదే సమయంలో భారతదేశం , మధ్య ప్రాచ్య దేశాల ప్రైవేట్ రంగాల మధ్య బలమైన సహకారాలను పెంపొందించడానికి రెండు దేశాల మధ్య లోతైన సహకారం అవసరాన్ని కూడా వ్యక్తం చేసింది.
రాబోయే పక్షం రోజుల్లో, ఐ అండ్ బి మంత్రిత్వ శాఖ పెవిలియన్ వద్ద వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పరస్పర ప్రయోజనకరమైన సహకారం కోసం మంత్రిత్వ శాఖ యుఎఇతో ఒక ఎమ్ఒయును కూడా ఖరారు చేస్తుంది.
ఈ చర్చ రాబోయే కొన్ని నెలల వరకు కొనసాగుతుంది. మరో 6-8 నెలల్లో ఎంఒయు పై సంతకం జరుగుతుందని భావిస్తున్నారు.
రాబోయే భారతీయ చిత్రం ఆర్.ఆర్.ఆర్. ను శ్రీ అపూర్వ చంద్ర, దర్శకుడు శ్రీ ఎస్.ఎస్. రాజమౌళి , హీరోలు శ్రీ రామ్ చరణ్ , శ్రీ ఎన్.టి. రామారావు జూనియర్ సమక్షంలో గ్లోబల్ గా ప్రారంభించారు. గ్లోబల్ మీడియా హౌస్ లు , భారత్ ,యుఎఇ నుండి వచ్చిన ప్రముఖ ప్రతినిధులు ఈ ఉత్సవానికి హాజరయ్యారు.
***
(Release ID: 1807265)
Visitor Counter : 167