ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్ఈఆర్ సిఆర్ఎమ్ఎస్ అమలు చేస్తున్న కార్యక్రమాలతో సరఫరా మెరుగుపడి స్వావలంబన, ఆర్ధిక సార్థికారత సాధిస్తున్న ప్రజలు

Posted On: 17 MAR 2022 12:03PM by PIB Hyderabad

 అరుణాచల్ ప్రదేశ్‌లోని లాంగ్డింగ్ జిల్లాలో కొన్సా అనే ఒక కుగ్రామం ఉంది.   మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఉన్న చివరి గ్రామాలలో  పొంగ్‌చౌ బ్లాక్ ఒకటి. పిఆర్ఏ  నివేదిక ప్రకారం గ్రామం చుట్టూ 120 గృహాలు ఉన్నాయి. జిల్లా కేంద్రం గ్రామానికి 68 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామంలో ఎనిమిది స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయి.  బానుజింగ్‌నుంగ్జామోహిమాన్జోసాచింగ్‌ఖోజోంగ్‌ఖామోఖా మరియు లామ్‌గోయ్ స్వయం సహాయక బృందాల అభివృద్ధి, అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఎన్ఈఆర్ సిఆర్ఎమ్ఎస్III  తిరప్ మరియు లాంగ్డింగ్ సహాయ సహకారాలు అందిస్తోంది. 

ఈ ప్రాంతంలో  ఎక్కువగా మిరప, గుమ్మడికాయ, అల్లం, మొక్కజొన్న, మినుము, గుమ్మడికాయ మొదలైన వ్యవసాయ ఉత్పత్తులతో పాటు  వెదురు రెమ్మలు, అరటి పువ్వులు,  తినదగిన అడవి ఆకులు మరియు పండ్లు వంటి ఉత్పత్తులు లభిస్తున్నాయి. అయితే, రవాణా సౌకర్యాలు లేకపోవడం, ప్రయాణానికి ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉండడం లాంటి కారణాల వల్ల    గ్రామ మహిళలు స్థానికంగా అందుబాటులో ఉన్న ఉత్పత్తులు మరియు సౌకర్యాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. 

సమస్యలు చర్చించి పరిష్కార మార్గాలను ఆలోచించే లక్ష్యంతో 2019 సెప్టెంబర్ 7న స్థానిక స్వయం సహాయక బృందాల సభ్యులు పోంగ్‌చౌ కుగ్రామంలో సమావేశం అయ్యారు. వారాంతపు మార్కెట్ నిర్వహించి స్థానిక ఉత్పత్తులకు ప్రచారం, మార్కెట్ కల్పించాలని నిర్ణయించారు. స్వచ్చంధ సేవా సంస్థ ఏఐడిఏ సహకారంతో కోన్సా, కొన్ను, పొంగ్‌చౌ మరియు బోనియా స్వయం సహాయక బృందాలకు చెందిన సభ్యులు శ్రీ వాంగ్సా ( చింగ్కే NaRM-G కొన్సా గ్రామ అధ్యక్షుడు,  పికప్ వాన్ సంరక్షకుడు) సమావేశానికి ఆహ్వానించి తమ సమస్యలు, ఇబ్బందులు వివరించారు. తగిన ధరకు నిర్ణీత రవాణా చార్జీలు చెల్లించి తమ ఉత్పత్తులను మార్కెట్ కు తరలించాలని వారు కోరారు. 

2019 అక్టోబర్ 5న గ్రామ ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రమైన  లాంగ్డింగ్ మొదటిసారి సందర్శించారు. అంతకు ముందు స్వచ్చంధ సేవా సంస్థ ఏఐడిఏ వీరికి తగిన శిక్షణ ఇచ్చింది. అయితే, ఉత్పత్తులను ఎక్కడ విక్రయించాలి, ఎలా విక్రయించాలి, ఎలా వేరుచేయాలి,ధర లాంటి అంశాలలో గ్రామ ప్రజలు గందరగోళానికి గురి కావలసి వచ్చింది.  ఉత్పత్తులను మొదటిసారి మార్కెట్ కు తీసుకు రావడంతో గ్రామ ప్రజలు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 

స్వచ్చంధ సేవా సంస్థ ఏఐడిఏ వీరికి అన్ని అంశాల్లో సమగ్ర శిక్షణ ఇచ్చి, మార్కెట్ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించింది. ధర, నాణ్యత తదితర అంశాలపై శిక్షణ పొందిన స్వయం సహాయక బృందాల సభ్యులు పరిస్థితులను అర్థం చేసుకొని తమ ఉత్పత్తులను విక్రయించడంలో విజయం సాధించారు. 

పరిశీలనలు

1.    స్వయం సహాయక బ్రదులా సభ్యుల  ఆత్మవిశ్వాసం పెరిగింది

2.    గ్రేడింగ్ మరియు ప్రామాణీకరణ జరిగింది 

3.    లెక్కలు వేయడం నేర్చుకున్నారు. 

4.    వినియోగదారులతో  ఎలా చర్చలు మాట్లాడే అంశంపై అవగాహన పెరిగింది.  

            5. స్థానికేతరులు వస్తువులను కొనుగోలు చేశారు. 

ఫలితాలు 
 

1.    కోన్సా ఎస్‌హెచ్‌జిల విజయాన్ని గుర్తించిన  పొంగ్‌చౌ, కొన్నూ మరియు బోనియా స్వయం సహాయక బృందాలు తమకు సహకారం అందించాలని స్వచ్చంధ సేవా సంస్థ ఏఐడిఏని కోరడం జరిగింది. దీనికి సంస్థ సానుకూలంగా స్పందించింది. 

2.     స్వయం సహాయక బృందాల   సభ్యులు మార్కెటింగ్‌లో ఆచరణాత్మక అనుభవాన్ని పొందారు.

3.    శీతల వాతావరణం కారణంగా ఉత్పత్తులు సేంద్రీయంగా మరియు విభిన్న రుచిని కలిగి ఉన్నాయి.   స్వయం సహాయక బృందాలు నుంచి ఉత్పత్తులను  కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు. 

4.    ఎస్‌హెచ్‌జిలకు విలువ జోడింపుపై మరింత సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.

5.    మార్కెట్ రోజుల్లో వచ్చే లాభాలను గుర్తించాలి. ,

6.    భవిష్యత్ ఆదాయాన్ని పెంచే కార్యకలాపాల కోసం మార్కెటింగ్ రోజుల తర్వాత వారి అనుభవాలు మరియు ఆలోచనలు చర్చించడానికి మరియు పంచుకోవడానికి సమావేశాలు నిర్వహించాలి .

 

***


(Release ID: 1807012) Visitor Counter : 198