ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

180.80 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి గత 24 గంటల్లో 3 లక్షలకు పైగా టీకా డోసులు నిర్వహణ

ఇవాళ 30,799 కి తగ్గిన దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య; మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.07%

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,539

ప్రస్తుత రికవరీ రేటు 98.73%

వారపు పాజిటివిటీ రేటు 0.42%

Posted On: 17 MAR 2022 9:46AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 180.80 కోట్ల ( 1,80,80,24,147 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,12,61,666 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. గత 24 గంటల్లో, 3 లక్షలకు పైగా ( 3,00,405 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,02,876

రెండో డోసు

99,88,133

ముందు జాగ్రత్త డోసు

43,40,771

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,11,930

రెండో డోసు

1,74,84,152

ముందు జాగ్రత్త డోసు

66,23,571

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,00,405

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,61,03,820

రెండో డోసు

3,50,69,122

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,36,41,508

రెండో డోసు

45,81,76,335

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,25,84,287

రెండో డోసు

18,34,33,562

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,66,25,180

రెండో డోసు

11,42,49,464

ముందు జాగ్రత్త డోసు

1,05,89,031

ముందు జాగ్రత్త డోసులు

2,15,53,373

మొత్తం డోసులు

1,80,80,24,147

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇవాళ 30,799 కి కేసులు తగ్గాయి. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.07 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.73% కు చేరింది. గత 24 గంటల్లో 4,491 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,54,546 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,539 కొత్త కేసులు నమోదయ్యయాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 7,17,330 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 78.12 కోట్లకు పైగా ( 78,12,24,304 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు, రోజువారీ పాజిటివ్‌ రేట్లలో తగ్గుదల కొనసాగుతోంది. వారపు పాజిటివిటీ రేటు 0.42 శాతానికి, రోజువారీ పాజిటివిటీ రేటు 0.35 శాతానికి తగ్గాయి.

 

****



(Release ID: 1806869) Visitor Counter : 189