సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

పీఎం- దక్ష్ యోజన కింద లబ్ధిదారులు

Posted On: 16 MAR 2022 2:08PM by PIB Hyderabad

 

సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ 2020-21 నుంచి  కార్పొరేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి- దక్షత ఔర్ కుశలత  సంపన్ హిత గ్రాహి  యోజన (పీఎం- దక్ష్)ని అమలు చేస్తోంది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన  లబ్ధిదారుల కోసం జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థికఅభివృద్ధి సంస్థ  (ఎన్ఎస్ఎఫ్ డిసి)ఇతర వెనుకబడిన తరగతులు/ఆర్థికంగా వెనుకబడిన తరగతులు/డీ నోటిఫైడ్ తెగల లబ్ధిదారుల కోసం జాతీయ వెనుకబడిన తరగతుల ఆర్థికఅభివృద్ధి సంస్థ (ఎన్ బి సి ఎఫ్ డి సి) మరియు సఫాయి కార్మికులు, వ్యర్థాలను ఏరుకుంటూ జీవిస్తున్న వారి కోసం   నేషనల్ సఫాయి కరంచరీస్ ఆర్థికఅభివృద్ధి సంస్థ (ఎన్ ఎస్ కె ఎఫ్ డి సి) ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. . 2021-22లో పిఎం- దక్ష్  పోర్టల్‌లో నమోదు చేసుకున్న వారి వివరాలు  క్రింది విధంగా ఉన్నాయి :

 

కార్పొరేషన్లు

లక్ష్య సమూహం

నమోదైన అభ్యర్థుల సంఖ్య

ఎన్ఎస్ఎఫ్ డిసి

ఎస్సీలు

28567

ఎన్ బి సి ఎఫ్ డి సి

ఓబిసి / ఈబిసి / డిఎన్ టి

32136

ఎన్ ఎస్ కె ఎఫ్ డి సి

వ్యర్థాలను సేకరించే వారితో సహా సఫాయి కరంచారులు

10893

 మొత్తం

 

71596

 

పీఎం- దక్ష్   యోజన కింద అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల వివరాలను గుర్తించిన వర్గాలకు తెలియజేసే విధంగా  ప్రింట్ మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు జారీ చేయబడుతున్నాయి.  ఇంటర్నెట్/స్మార్ట్ ఫోన్‌ సౌకర్యం లేని  ఆసక్తిగల అభ్యర్థులు సైబర్‌కేఫ్‌ని దర్శించి పీఎం- దక్ష్   పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు . అభ్యర్థులు  పీఎం- దక్ష్   పోర్టల్‌లో నమోదు చేసుకొనేందుకు  నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తున్న సంబంధిత శిక్షణ సంస్థలు సహకారం అందిస్తాయి. 

2021-22లో శిక్షణ పొందిన అభ్యర్థుల సంఖ్యశిక్షణ పూర్తయిన (అసెస్‌మెంట్ మరియు సర్టిఫికేషన్ తర్వాత)  తర్వాత వివిధ  కార్పొరేషన్‌లు వారికి అందించిన ఉపాధి వివరాలు   అనుబంధంలో ఇవ్వబడ్డాయి  .

 పీఎం- దక్ష్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తర్వాత లబ్ధిదారులు క్రింది సౌకర్యాలు పొందేందుకు అర్హత కలిగి ఉంటారు . 

            i.  అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందుతున్న బృందాలలో చేరుతారు. 

          ii.డీబీటీ  ద్వారా  హాజరు ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు స్టైపెండ్ అందించబడుతుంది.

         iii.  శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు  మూల్యాంకనం  తర్వాత  సంబంధిత శిక్షణ  కోర్సు  సర్టిఫికెట్లు అందించబడతాయి.

                  iv.  ధృవీకరణ తర్వాత అభ్యర్థులకు శిక్షణ సంస్థల ద్వారా ఉద్యోగం/స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తారు 

 

***



(Release ID: 1806637) Visitor Counter : 217