ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
2030 నాటికి ఎస్ డి జి నిర్ణయించిన ప్రసూతి మరణాల నిష్పత్తి లక్ష్య సాధన దిశలో భారతదేశం
70/ లక్షల సజీవ జననాల ప్రసూతి మరణాల నిష్పత్తి ( ఎమ్‌ఎమ్‌ఆర్ )గా ఉండాలని నిర్దేశించిన ఎస్ డి జి
భారతదేశంలో 10 పాయింట్లు తగ్గిన ప్రసూతి మరణాల నిష్పత్తి ( ఎమ్‌ఎమ్‌ఆర్ )
కేరళ, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో 15% కంటే ఎక్కువ తగ్గుదల నమోదు
5 నుండి 7కి పెరిగిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డిజి) లక్ష్యాన్ని సాధించిన రాష్ట్రాల సంఖ్య
Posted On:
14 MAR 2022 2:42PM by PIB Hyderabad
భారతదేశ ప్రసూతి మరణాల నిష్పత్తి ( ఎంఎంఆర్ ) 10 పాయింట్లు తగ్గిందని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. దేశంలో ఎమ్‌ఎమ్‌ఆర్ పై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. దేశంలో 2016-18లో 113 గా ఉన్న ఎమ్‌ఎమ్‌ఆర్ 2017-19లో 103కి (8.8% తగ్గుదల) తగ్గింది. దేశ ఎమ్‌ఎమ్‌ఆర్ ప్రగతిశీల తగ్గింపును నమోదు చేస్తోంది.
2014-2016లో 130 గా ఉన్న ఎమ్‌ఎమ్‌ఆర్ 2015-17లో 122, 2016-18లో 113, మరియు 2017-19లో 103కి చేరుకుంది.
ప్రతి ఏడాది ప్రసూతి మరణాల సంఖ్య తగ్గడంతో 2020 నాటికి 100/లక్ష సజీవ జననాల జాతీయ ఆరోగ్య విధానం (ఎన్ హెచ్ పి ) లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. 2030 నాటికి 70/ లక్షల సజీవ జననాల ఎస్‌డిజి లక్ష్యాన్ని సాధించే దిశలో అడుగులు వేస్తోంది.
సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDG) లక్ష్యాన్ని సాధించిన రాష్ట్రాల సంఖ్య 5 నుంచి 7కి పెరిగింది. కేరళ (30), మహారాష్ట్ర (38), తెలంగాణ (56), తమిళనాడు (58), ఆంధ్రప్రదేశ్ (58), జార్ఖండ్ (61), గుజరాత్ (70) సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించాయి. పైన పేర్కొన్న ఏడు రాష్ట్రాలతో సహా కర్ణాటక (83) మరియు హర్యానా (96) రాష్ట్రాలు న్ హెచ్ పి నిర్దేశించిన ఎమ్‌ఎమ్‌ఆర్ లక్ష్యాన్ని చేరుకున్నాయి. దీనితో ఎమ్‌ఎమ్‌ఆర్ తొమ్మిది రాష్ట్రాలు ఎమ్‌ఎమ్‌ఆర్ లక్ష్యాన్నిసాధించాయి.
ఐదు రాష్ట్రాలు, [ఉత్తరాఖండ్ (101), పశ్చిమ బెంగాల్ (109), పంజాబ్ (114), బీహార్ (130), ఒడిశా (136) మరియు రాజస్థాన్ (141)] లలో ఎమ్‌ఎమ్‌ఆర్ 100-150 మధ్య ఉంది. ఛత్తీస్‌గఢ్ ( 160), మధ్యప్రదేశ్ (163), ఉత్తరప్రదేశ్ (167) మరియు అస్సాం (205) లు 150 కంటే ఎక్కువ ఎమ్‌ఎమ్‌ఆర్ కలిగి ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ ( 30 పాయింట్ల గరిష్ట క్షీణత), రాజస్థాన్ (23 పాయింట్లు), బీహార్ (19 పాయింట్లు), పంజాబ్ (15 పాయింట్లు) మరియు ఒడిశా (14 పాయింట్లు) ప్రోత్సాహకరమైన గణాంకాలను నమోదు చేశాయి.
మూడు రాష్ట్రాలు (కేరళ, మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్) ఎమ్‌ఎమ్‌ఆర్ లో 15% కంటే ఎక్కువ తగ్గుదల కనిపించింది. జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, పంజాబ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 10-15% మధ్య తగ్గుదల నమోదయింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా మరియు కర్ణాటకలో 5-10% మధ్య ఎమ్‌ఎమ్‌ఆర్ నమోదయింది.
పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరాఖండ్ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి అందిన నివేదికలు ఎమ్‌ఎమ్‌ఆర్ పెరుగుదలను చూపించాయి, అందువల్ల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల లక్ష్యాన్ని సాధించేందుకు ఈ నాలుగు రాష్ట్రాలు ఎమ్‌ఎమ్‌ఆర్ క్షీణతను వేగవంతం చేయడానికి వారి వ్యూహాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది.
వివిధ పథకాల ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ కింద పెడుతున్న వ్యూహాత్మక పెట్టుబడులు నిలకడగా ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం జననీ శిశు సురక్షా కార్యక్రమం మరియు జననీ సురక్ష యోజన వంటి పథకాలు , ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ మరియు లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ఇనిషియేటివ్ (లక్యూష్య) వంటి పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. వీటి ద్వారా లబ్ధిదారులకు నాణ్యతతో కూడిన సంరక్షణ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. వీటితో పాటు కేంద్ర మహిళ శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి మాతృ వందన యోజన మరియు పోషణ్ అభియాన్ వంటి ముఖ్యమైన పథకాలను అమలు చేస్తున్నది. వీటి ద్వారా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు , ముఖ్యంగా గర్భిణీ మరియు బాలింతలు మరియు పిల్లలకు పోషకాహార పంపిణీ జరుగుతుంది.
మహిళలకు 'సురక్షిత్ మాతృత్వ ఆశ్వాసన్' ను సమర్ధమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. నివారించగల ప్రసూతి మరియు నవజాత మరణాలను పూర్తిగా తగ్గించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు జరుగుతున్నది. మాత శిశు ప్రసూతి మరణాలను నివారించేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించి దీనిని ఒకేసారి అమలు చేసేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2021లో మెటర్నల్ పెరినాటల్ చైల్డ్ డెత్ సర్వైలెన్స్ రెస్పాన్స్ సాఫ్ట్‌వేర్‌ను ప్రారంభించింది. దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వం( మంత్రసాని) మిడ్‌వైఫరీ ఇనిషియేటివ్ కింద “నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్‌వైఫరీ” సిబ్బందిని నియమించింది. ప్రసవాలు చేయడంలో అనుభవం అర్హత కలిగిన వారిని మంత్రసానులు గా నియమించడం వల్ల సిబ్బందిపై భారం తగ్గి మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.
ప్రసూతి మరణాల రేటు ( ఎమ్‌ఎమ్‌ఆర్ ) మెరుగుపరచడానికి అమలు జరుగుతున్న చర్యలు:-
* ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ 2016లో ప్రారంభమయింది. దీని ద్వారా ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీలు ఉచితంగా మరియు నాణ్యమైన ప్రసవ సంరక్షణను సహాయం పొందుతారు.
* ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన 2017 నుంచి అమలులో ఉంది. ఇది ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) పథకంగా ఇది అమలు జరుగుతున్నది . , దీని కింద గర్భిణీ స్త్రీల బ్యాంక్ ఖాతాలోకి నేరుగా మెరుగైన పోషకాహార అవసరాలను తీర్చడానికి మరియు వేతన నష్టాన్ని పాక్షికంగా భర్తీ చేయడానికి నగదు బదిలీ జరుగుతుంది.
*లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ ఇనిషియేటివ్ (లేకశ్య ) 2017లో ప్రారంభించబడింది, లేబర్ రూమ్ మరియు మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్‌లలో సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది.
* పిల్లలు, కౌమారదశలో ఉన్న బాలికలు, గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లుల పోషకాహార స్థితిని సమయానుకూలంగా మెరుగుపరచాలన్న లక్ష్యంతో భారత ప్రభుత్వం 2018 నుంచి పోషణ్ అభియాన్‌ను అమలు చేస్తోంది.
* రక్తహీనతకు తావు లేని దేశంగా భారతదేశాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో 2018లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీవితచక్ర విధానంలో పోషకాహార మరియు పోషకాహారేతర కారణాల వల్ల రక్తహీనత వ్యాప్తిని తగ్గించడానికి రక్తహీనత ముక్త్ భారత్ వ్యూహాన్ని ప్రారంభించింది. ఈ వ్యూహం 30 మిలియన్ల గర్భిణీ స్త్రీల తో సహా 450 మిలియన్ల లబ్ధిదారులకు ప్రయోజనం కలిగిస్తుందని అంచనా వేయబడింది.
* సురక్షిత్ మాత్రత్వ ఆశ్వాసన్ (సుమన్ ) 2019 నుంచి అమలులోకి వచ్చింది, ఎటువంటి ఖర్చు లేకుండా భరోసా, గౌరవప్రదమైన, గౌరవప్రదమైన మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించడం మరియు ప్రజారోగ్య కేంద్రాన్ని సందర్శించిన ప్రతి మహిళ మరియు నవజాత శిశువులకు సేవలను అందించడం, నివారించగల అన్ని మాతా మరియు నవజాత మరణాలను అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమం రూపొందింది.
* ప్రసవం కోసం గర్భిణీలు ఆసుపత్రిలో చేరడాన్ని ప్రోత్సహించేందుకు జననీ సురక్ష యోజన పథకం ప్రారంభమైంది. మాతా మరియు శిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో ఏప్రిల్ 2005లో ప్రారంభమైన ఈ పథకం కింద అవసరాల మేరకు షరతులతో కూడిన నగదు బదిలీ చేయడం జరుగుతుంది.
* ప్రజారోగ్య కేంద్రాలకు వస్తున్న గర్భిణీ స్త్రీలు మరియు అనారోగ్యంతో ఉన్న శిశువులకు ప్రయోజనం కలిగించాలన్న లక్ష్యంతో జననీ శిశు సురక్ష కార్యక్రమం అమలు జరుగుతోంది. వీరికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు ఆరోగ్య కేంద్రంలో మందులు, ఇతర తినుబండారాలు, ఆహారం అందించి మరియు రక్తస్రావం తగ్గించి ఉచిత ప్రసవానికి అర్హత కల్పించడం ద్వారా వారి ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పథకం అమలు జరుగుతున్నది.
* ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు శిక్షణ, ఔషధాల సరఫరా, పరికరాలు, ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ మొదలైన వాటి ద్వారా సమగ్ర అబార్షన్ కేర్ సేవలు బలోపేతం చేయబడతాయి.
* దేశవ్యాప్తంగా 25,000 పైగా 'డెలివరీ పాయింట్లు' (ప్రసూతి కేంద్రాలు) బలోపేతం చేయబడ్డాయి, మౌలిక సదుపాయాలు, పరికరాలు మరియు సమగ్ర RMNCAH+N సేవలను అందించడానికి శిక్షణ పొందిన సిబ్బందిని ఈ కేంద్రాల్లో నియమించడం జరిగింది.
* అవసరమైన సిబ్బంది నియామకం , బ్లడ్ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు , రెఫరల్ లింకేజీలు మొదలైన చర్యల ద్వారా మొదటి రెఫరల్ యూనిట్ల పనితీరు మెరుగుపరచడం జరిగింది.
* తల్లులు మరియు పిల్లలకు అందిస్తున్న వైద్య ఆరోగ్య నాణ్యతను మెరుగు పరచడానికి సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉండే ఆరోగ్య కేంద్రాల్లో మాతా మరియు శిశు ఆరోగ్యం విభాగాలను ఏర్పాటు చేయడం జరిగింది.
* సంక్లిష్టమైన ప్రసవాలను నిర్వహించడానికి దేశవ్యాప్తంగా తృతీయ సంరక్షణ కేంద్రాలలో ప్రసూతి ఐసీయూ /హెచ్ డియూ సౌకర్యాల కల్పన
* ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాల్లో నిపుణుల కొరత తీర్చేందుకు అనస్థీషియా , ప్రసూతి సంరక్షణలో ఎంబీబీస్ వైద్యులకు సి -సెక్షన్ (EmOC) నైపుణ్యాలను మెరుగు పరచడం ఇతర విభాగాల్లో నిపుణుల కొరతను అధిగమించడానికి మానవ వనరుల అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.
* ఆరోగ్య కేంద్రాలు, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మెటర్నల్ డెత్ సర్వైలెన్స్ రివ్యూ అమలు చేయబడుతుంది. సరైన స్థాయిలో సరైన చర్యలు తీసుకోవడం మరియు ప్రసూతి సంరక్షణ నాణ్యతను మెరుగు పరచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం అమలు జరుగుతోంది.
* పోషకాహారంతో సహా తల్లి మరియు శిశు సంరక్షణను అందించడానికి ప్రతి నెలా "మంత్లీ విలేజ్ హెల్త్, శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ డే" ను నిర్వహించడం జరుగుతోంది.
* ఎఎన్ సి, రెగ్యులర్ ఎఎన్ సి, సంస్థాగత ప్రసవాలు, పోషకాహారం మరియు గర్భధారణ సమయంలో సంరక్షణ మొదలైన అంశాల ముందస్తు నమోదు కోసం తరచు ఐఈసీ, బిసిసి కార్యకలాపాలు నిర్వహించబడతాయి.
* ఆహారం, విశ్రాంతి, ప్రమాద సంకేతాలు, ప్రయోజన పథకాలు మరియు సంస్థాగత ప్రసవాలపై అవగాహన కల్పించడం కోసం గర్భిణీ స్త్రీలకు ఎంసిపి కార్డ్ మరియు సురక్షిత మాతృత్వ బుక్‌లెట్ పంపిణీ చేయబడతాయి.
***
(Release ID: 1805898)
Visitor Counter : 1026