గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

అమృత్ మహోత్సవ్ వారోత్సవం సమాప్తం

‘నవ్య భారతీయ మహిళ’ అన్న ఇతివృత్తంతో
ఉత్సవం ముగించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ..

గ్రామీణ మహిళల సాధికారత లక్ష్యంగా జాతీయ స్థాయి,
రాష్ట్రాల స్థాయిల్లో 18రకాల కార్యకలాపాల నిర్వహణ..


డి.డి.యు-జి.కె.వై. కింద మహిళా ప్రాధాన్యంతో
174కు పైగా ప్రత్యేక శిబిరాల నిర్వహణ..


మహిళా ప్రాధాన్య కోర్సుల్లో దేశవ్యాప్తంగా
పలు కొత్త బ్యాచీల ప్రారంభం.

ఉత్తమ పనితీరుపై క్లస్టర్ స్థాయి సమాఖ్యలకు
-ఆత్మనిర్భర సంఘటన్ పురస్కారం- ప్రదానం...
వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని
75మంది చొప్పున గ్రామీణ మహిళలకు
పి.ఎం.ఎ.వై. కింద ‘పక్కా నివాసాల’ మంజూరు...

పౌష్టికాహార లోపం, రక్తహీనత తదితర సమస్యలపై
అవగాహనకోసం 5,000మంది ట్రెయినీలతో
దేశవ్యాప్తంగా 100కు పైగా ర్యాలీల నిర్వహణ..

పి.ఎం.ఎ.వై. లబ్ధిదారులైన 750మంది
గ్రామీణ మహిళలకు
స్వచ్ఛభారత్ మిషన్ కింద
మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం

Posted On: 14 MAR 2022 10:55AM by PIB Hyderabad

   ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన విశేష వారోత్సవం 2022 మార్చి 7నుంచి 13వరకూ జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగిన వారంలోనే ఈ ఉత్సవాన్ని కూడా నిర్వహించారు. ‘నయే భారత్ కీ నారీ ( నవ్య భారతీయ మహిళ)’ అన్న ఇతివృత్తంతో ఈ విశేష వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  

   ఈ సందర్భంగా మహిళల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పలు రకాలైన కార్యక్రమాలను, కార్యకలాపాలను నిర్వహించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డి.డి.యు.-జి.కె.వై.), గ్రామీణ స్వయంఉపాధి శిక్షణాసంస్థ (ఆర్.సెటీ), దీన్ దయాళ్ అంత్యోదయ- జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం (డి.ఎ.వై.-ఎన్.ఆర్.ఎల్.ఎం.), ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పి.ఎం.ఎ.వై.-జి.), మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రూర్బన్ తదితర పథకాల కింద ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్వహించారు

अवसर की आज़ादी | మార్చి 7, 2022 (సోమవారం)

  ఈ కార్యక్రమం కింద, ‘మహిళా ప్రయోజనాల ప్రాధాన్యం’తో 174 శిబిరాలను దేశవ్యాప్తంగా నిర్వహించారు. డి.డి.యు.-జి.కె.వై. పథకం కింద 2022, మార్చి 7న ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ తరహా శిబిరాల ద్వారా దేశవ్యాప్తంగా 4,281మంది మహిళా అభ్యర్థులను విజయవంతంగా సమీకరించగలిగారు. అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్టు, స్వయం ఉపాధితో కూడిన టైలరింగ్, సింపుల్ టైలరింగ్ తదితర కోర్సుల్లో నమోదు చేయడానికి  పలువురు మహిళా అభ్యర్థుల సమీకరణ జరిగింది. ఈ పథకం కింద శిక్షణ పొందే మొత్తం అభ్యర్థుల్లో మూడింట ఒక వంతు మంది మహిళలే ఉండేలా చూస్తూ అభ్యర్థుల ఎంపిక జరగాలని డి.డి.యు.-జి.కె.వై. పథకం నిర్దేశిస్తోంది. ఈ పథకం కింద 15నుంచి 35ఏళ్ల వయస్సున్న గ్రామీణ పేద యువజనులను నమోదు చేయాలన్నది లక్ష్యం అయినప్పటికీ, మహిళలకు మాత్రం గరిష్ట వయోపరిమితిని 45 సంవత్సరాలుగా నిర్ణయించారు.

 

 

Macintosh HD:Users:simerbajwa:Desktop:FNfNxK8aIAEwpos.jpgMacintosh HD:Users:simerbajwa:Desktop:FNfNxK5aAAA_qCt.jpg

   మహిళా ప్రయోజనాలే లక్ష్యంగా కలిగిన కొత్త కోర్సులను గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు (ఆర్.సెటీలు) 2022, మార్చి 7వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభించాయి. అగరబత్తీల తయారీ, సాఫ్ట్ టాయ్ తయారీ-అమ్మకం, ఊరగాయలు, మసాలా పొడి తయారీ, బ్యూటీ పార్లర్ నిర్వహణ,-కాస్ట్యూమ్ జ్యువెలరీ ఉద్యమీ తదితర విభాగాల కోర్సుల్లో కొత్త బ్యాచులను ప్రారంభించారు. ఆర్.సెటీ పథకం కింద, మొత్తం 64 శిక్షణా కోర్సుల్లో పదింటిని ప్రత్యేకంగా మహిళా అభ్యర్థులకోసమే నిర్వహించారు. ఈ రోజు వరకూ, ఈ పథకం కింద 26.28 లక్షల మంది మహిళా అభ్యర్థులకు శిక్షణ అందించారు. వారిలో 18.7 లక్షలమంది మహిళలు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసి, తమ జీవితంలో స్థిరపడ్డారు.

 

Macintosh HD:Users:simerbajwa:Desktop:FNfeOhSagAAug_m.jpg

 

--నయే భారత్ కీ నారీ--జాతీయ పురస్కార ప్రదానోత్సవం | మార్చి 8, (మంగళవారం)

   ‘నయే భారత్ కీ నారీ ( నూతన భారతీయ మహిళ)’ అన్న స్ఫూర్తితో ఔత్సాహిక, క్రియాశీలకు మహిళలకు వందనాలు తెలుపుతూ, దీన్ దయాళ్ అంత్యోదయ-జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం (డి.ఎ.వై.-ఎన్.ఆర్.ఎల్.) కింద అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8వ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్.లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, సహాయమంత్రులు సాధ్వీ నిరంజన్ జ్యోతీ, ఫగ్గన్ సింగ్ కులస్తే, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

  ఈ సందర్భంగా, సంవత్సరానికి లక్ష రూపాయలకు పైగా ఆర్జించే గ్రామీణ స్వయం సహాయక గ్రూపుల (ఎస్.హెచ్.జి.) మహిళలు, లైంగిక సమన్యాయ కేంద్రాలను, డి.డి.యు.-జి.కె.వై. శిక్షణా సంస్థలను, నిర్వహించే మహిళా సభ్యులు తమ, తమ విజయగాథలను వివరించారు. ఉత్తమంగా పనితీరును ప్రదర్శించిన క్లస్టర్ స్థాయి సమాఖ్యలకు, సమర్థంగా పనిచేసే ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ కార్యక్రమంలో ఆత్మనిర్భర సంఘటన్ అవార్డులను అందించారు. డి.డి.యు.-జి.కె.వై. పథకం కింద గరిష్ట సంఖ్యలో మహిళా అభ్యర్థులకు శిక్షణ కల్పించి, వారు జీవనోపాధితో స్థిరపడేలా చేసిన వివిధ ఏజెన్సీల ప్రతినిధులను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలనుంచి ఎంపికైన అవార్డు విజేతలకు న్యూఢిల్లీ కార్యక్రమంలో పాల్గొనే అవకాశమిచ్చారు.

   ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, గ్రామీణ మహిళలలు ఔత్సాహిక, క్రియాశీలక స్ఫూర్తితో పనిచేస్తూ -నయే భారత్ కీ నారీ-గా అంటే నవ్యభారతీయ మహిళలుగా రూపాంతరం చెందుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ప్రతిబింబించిన సానుకూల దృక్పథం ఎంతో అభినందనీయమని, దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్ళాలన్న ప్రధానమంత్రి మోదీ కలలను నిజం చేసేందుకు భారీ స్థాయిలో కృషి చేస్తున్నది కూడా ఈ మహిళలేనని ఆయన అన్నారు. మహిళలు అభివృద్ధి పథంలోనే పురోగమిస్తున్నారన్న విశ్వాసం తనకున్నదని, త్వరలోనే వీరు సంవత్సరానికి కాకుండా, నెలకే లక్షరూపాయలకు పైగా ఆర్జించగలరని భావిస్తున్నానని గిరిరాజ్ సింగ్ అన్నారు.

 

 

Macintosh HD:Users:simerbajwa:Desktop:FNU4gfNaAAIim4S.jpg Macintosh HD:Users:simerbajwa:Desktop:FNUsZ-laMAM2u5A.jpg

 

Macintosh HD:Users:simerbajwa:Desktop:image002Q3JP.jpg Macintosh HD:Users:simerbajwa:Desktop:FNV_oCPVUAYNmX3.jpg

 

आगे बढ़ने की आज़ादी | మార్చి 9, 2022 (బుధవారం)

  గ్రామీణాభివృద్ధి పథకాల ద్వారా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో విజయాలు సాధించిన నవ భారత మహిళలను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మార్చి 9వ తేదీన సత్కరించింది. దీనదయాళ్ అంత్యోదయ- జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం (డి.ఎ.వై.-ఎన్.ఆర్.ఎల్.ఎం.), పి.ఎం.ఎ.వై.-జి, మహాత్మా గాంధీ జాతీయ. గ్రామీణ ఉపాధి హామీ పథకం, రూర్బన్ పథకాల ద్వారా వారు ఈ విజయాలను సొంతం చేసుకున్నారు. ఆగే బడ్నే కీ ఆజాదీ అనే ఇతివృత్తం కింద వారికి ఈ సత్కారం నిర్వహించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (పి.ఎం.ఎ.వై.-జి.) కింద 75మంది చొప్పున  గ్రామీణ మహిళా లబ్ధిదారులకు పక్కాఇళ్ళను వివిధ రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు మంజూరు చేశాయి. వారు ఆ ఇళ్లకు యజమానులుగా లేదా,. సహ యజమానులుగా గుర్తింపు పొందారు.

 

 

Macintosh HD:Users:simerbajwa:Desktop:FNbH_kxaAAACdfH.png Macintosh HD:Users:simerbajwa:Desktop:FNbIBk4UYAINrm2.png

कुपोषण से आज़ादी | మార్చి 10, 2022 (గురువారం)

    పౌష్టికాహార లోపం, రక్తహీనత, మహిళలల్లో శిశుజననాల రేటు తగ్గుదల తదితర అంశాలపై      గ్రామీణ ప్రాంత మహిళలకు అవగాహన, చైతన్యం కల్పించేందుకు దేశవ్యాప్తంగా వందకు పైగా ర్యాలీలు నిర్వహించారు. దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ  కౌశల్య యోజన (డి.డి.యు.-జి.కె.వై.) పథకాలకు, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలకు చెందిన 5,000మందికి పైగా ట్రెయినీలు ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. రాష్ట్రాల గ్రామీణ జీవవోపాధి పథకాలు, రీసెటీలు, పథకం అమలుచేసే సంస్థలు, వివిధ పథకాల లబ్ధిదారులు తదితర భాగస్వామ్య వర్గాల ప్రతినిధులు కూడా ఈ ర్యాలీల్లో పాల్గొన్నారు. గ్రామీణ మహిళల్లో పౌష్టికాహారానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని గురించి తెలియజెపుతూ వారు ఈ ర్యాలీల్లో పాలుపంచుకున్నారు. వివిధ గ్రామాలను కలుపుతూ సాగిన ఈ ర్యాలీల్లో సందేశాలు, సమాచారంతో కూడిన ప్లకార్డులు చేతబూని మహిళలంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు సైకిల్ ర్యాలీల్లో కూడా పాలుపంచుకున్నారు.

 

 

Macintosh HD:Users:simerbajwa:Desktop:FNoVfWXaQAEh190.jpg Macintosh HD:Users:simerbajwa:Desktop:FNf4f11aMAoOlzj.jpg

ఈ ర్యాలీలకు తోడుగా, మొక్కలు నాటడంపై క్షేత్రస్థాయి ప్రచార కార్యక్రమాలను, వ్యవసాయ, పౌష్టికాహార తోటల కార్యక్రమాలను కూడా నిర్వహించారు. దీనదయాళ్ అంత్యోదయ-జాతీయ గ్రామీణ జీవవోపాధి కార్యక్రమాల కింద జిల్లా/బ్లాకు/గ్రామ పంచాయతీ స్థాయిల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు జరిగాయి.

 

 

 

गर्व से जीने की आज़ादी | మార్చి 11, 2022 (శుక్రవారం)

  2022వ సంవత్సరం మార్చి 11వ తేదీన, దీనదయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం, కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  ‘జెండర్ సంవాద్’ తృతీయ కార్యక్రమాన్ని నిర్వహించారు. 34 రాష్ట్రాలకు చెందిన 3వేలమందికి పైగా రాష్ట్రాల పథకాల సిబ్బంది, స్వయం సహాయక బృందాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డి.డి.వై.-ఎన్.ఆర్.ఎల్.ఎం. పథకం లక్ష్యాలపై అవగాహన కల్పించే ధ్యేయంతో జాతీయ స్థాయిలో వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘మహిళల సమైక్య కృషి ద్వారా ఆహార, పౌష్టికాహార భద్రతకు ప్రోత్సాహం’ అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నాగేంద్ర నాథ్ సిన్హా మాట్లాడుతూ, వివిధ పథకాల సేవల నిర్వహణలో మహిళల పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు. “గ్రామీణ ప్రాంతాల్లోని 5.5కోట్ల కుటుంబాలకు కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తిపై అవగాహన కల్పించడంలో దేశవ్యాప్తంగా స్వయం సహాయక బృందాల (ఎస్.హెచ్.జి.) మహిళలు ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు,” అని ఆయన అన్నారు.

 

Macintosh HD:Users:simerbajwa:Desktop:FNk-TeCVIAQXQMy.jpg Macintosh HD:Users:simerbajwa:Desktop:FNk0yCSVUAYoOPC.jpg

  ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం కింద ప్రయోజనం పొందిన 75మంది చొప్పున మహిళా లబ్ధిదారుల చేత ప్రతి రాష్ట్రంలో,.కేంద్ర పాలిత ప్రాంతంలో గృహప్రవేశాలు నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జీవనోపాధి అవకాశాలు పొంది, తద్వారా విజయాలు సాధించిన 75మంది చొప్పున మహిళలకు సత్కార కార్యక్రమం కూడా ఈ సందర్భంగా జరిగింది.

 

सफाई से रहने की आज़ादी | మార్చి 12, 2022 (శనివారం)

   నవ్య భారత మహిళలకు పరిశుభ్రమైన పరిసరాలను కల్పించడమే లక్ష్యంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్విరామంగా పనిచేస్తూ వస్తోంది. 'सफाई से रहने की आज़ादी (పరిశుద్ధమైన పరిసరాల మధ్య జీవించే స్వేచ్ఛ)' పేరిట పారిశుద్ధ్యంకోసం అనేక ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. దీన దయాళ్ అంత్యోదయ- జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం కింద స్వయం సహాయక బృందాల మహిళలు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహిళా సభ్యులు ఈ కార్యక్రమాలను నిర్వహించారు.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు 750 మంది మహిళా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు.

 

Macintosh HD:Users:simerbajwa:Desktop:FNnk8TJaUAQ2z8s.jpg

 

सामाजिक बंधनो से आज़ादी | మార్చి 13, 2022 (ఆదివారం)

  సామాజిక సమ్మిళిత కార్యక్రమాలు, సమాజాభివృద్ధి, లైంగిక సంబంధ అంశాలపై పనిచేసే స్వయం సహాయక గ్రూపుల మహిళలు తమ అనుభవాలు పంచుకోవడానికి, వారిని తగిన రీతిని సత్కరించడానికి వీలుగా వివిధ రాష్ట్రాల స్థాయిలో వెబినార్ సదస్సులు, కార్యక్రమాలను నిర్వహించారు. దీనదయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం కింద ఈ కార్యక్రమాలు చేపట్టారు.  గ్రామీణ స్వయం సహాయక ఉపాధి శిక్షణా సంస్థలు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకాల కింద శిక్షణ పొందిన మహిళలు కోర్సు ముగించిన సందర్భంగా వారికి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.

 

 

Macintosh HD:Users:simerbajwa:Downloads:WhatsApp Image 2022-03-13 at 4.57.55 PM.jpeg Macintosh HD:Users:simerbajwa:Downloads:WhatsApp Image 2022-03-13 at 4.59.01 PM.jpeg

 

***



(Release ID: 1805874) Visitor Counter : 210