ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
675 రోజుల కనిష్ట స్థాయికి (36,168) చేరిన దేశవ్యాప్త క్రియాశీల కొవిడ్ కేసులు
గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,503; ఇది 680 రోజుల కనిష్ట స్థాయి 180.19 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్-19 టీకా కార్యక్రమం ప్రస్తుత రికవరీ రేటు 98.72% వారపు పాజిటివిటీ రేటు 0.47%
Posted On:
14 MAR 2022 10:05AM by PIB Hyderabad
కొవిడ్‌పై భారతదేశ పోరాటం కీలక మలుపు తిరిగింది. గత 24 గంటల్లో కేవలం 2,503 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యయాయి. ఇది 680 రోజుల అత్యల్ప స్థాయి.
దేశవ్యాప్తంగా మిగిలిన 36,168 క్రియాశీల కేసులతో, యాక్టివ్ కేస్‌లోడ్ 675 రోజుల కనిష్టానికి పడిపోయింది. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 0.08%గా ఉన్నాయి.
భారతదేశ రికవరీ రేటు 98.72%కు పెరిగింది. గత 24 గంటల్లో 4,377 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,24,41,449 కి పెరిగింది.
దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూనే ఉన్నారు. గత 24 గంటల్లో మొత్తం 5,32,232 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 77.90 కోట్లకు పైగా ( 77,90,52,383 ) పరీక్షలు నిర్వహించారు.
వారపు, రోజువారీ పాజిటివ్ రేట్లలో గణనీయమైన తగ్గుదల నమోదువుతూనే ఉంది. వారపు పాజిటివిటీ రేటు 0.47 శాతానికి, రోజువారీ పాజిటివిటీ రేటు 0.47 శాతానికి తగ్గాయి.
టీకాల విషయానికి వస్తే... ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం, 180.19 కోట్ల ( 1,80,19,45,779 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,10,99,040 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.
మొత్తం టీకా డోసులు
|
ఆరోగ్య సిబ్బంది
|
మొదటి డోసు
|
1,04,02,647
|
రెండో డోసు
|
99,84,784
|
ముందు జాగ్రత్త డోసు
|
43,11,566
|
ఫ్రంట్‌లైన్ సిబ్బంది
|
మొదటి డోసు
|
1,84,11,505
|
రెండో డోసు
|
1,74,77,757
|
ముందు జాగ్రత్త డోసు
|
65,65,248
|
15-18 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
5,58,92,605
|
రెండో డోసు
|
3,38,83,880
|
18-44 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
55,33,47,902
|
రెండో డోసు
|
45,54,94,388
|
45-59 ఏళ్ల వారు
|
మొదటి డోసు
|
20,25,37,734
|
రెండో డోసు
|
18,28,01,487
|
60 ఏళ్లు పైబడినవారు
|
మొదటి డోసు
|
12,65,93,557
|
రెండో డోసు
|
11,38,50,979
|
ముందు జాగ్రత్త డోసు
|
1,03,89,740
|
ముందు జాగ్రత్త డోసులు
|
2,12,66,554
|
మొత్తం డోసులు
|
1,80,19,45,779
|
****
(Release ID: 1805686)
|