ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దిల్లీ లోని గోకులపురి లో అగ్నిప్రమాదం కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు

Posted On: 12 MAR 2022 6:14PM by PIB Hyderabad

దిల్లీ లోని గోకులపురి ప్రాంతం లో అగ్ని ప్రమాదం సంభవించినందువల్ల ప్రాణ నష్టం జరగడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘దిల్లీ లోని గోకులపురి లో అగ్నికాండ వల్ల జరిగిన ప్రమాదం హృద‌య‌విదారకం గా ఉంది. ఈ ప్రమాదం లో ఎవరైతే ప్రాణాల ను కోల్పోవలసివచ్చిందో, వారి దగ్గరి సంబంధికుల కు ఇదే నా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఆ ఈశ్వరుడు వారికి ఈ అపార దు:ఖాన్ని ఓర్చుకొనే శక్తి ని ప్రసాదించు గాక.’’ అని పేర్కొన్నారు.

****

DS/ST


(Release ID: 1805449)