బొగ్గు మంత్రిత్వ శాఖ
బొగ్గు మంత్రిత్వ శాఖలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వారోత్సవ వేడుకలు
- వివిధ కార్యక్రమాల నడుమ ఈ రోజు ఘనంగా ముగియనున్న వేడుక
Posted On:
11 MAR 2022 12:21PM by PIB Hyderabad
బొగ్గు మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వారోత్సవ వేడుకలు వివిధ రకాల కార్యక్రమాల నడుమ ఈరోజు ముగియనున్నాయి. ఈ వేడుకలలో భాగంగా డాక్టర్ వైభవ్ చతుర్వేది “నికర శూన్యత.. భవిష్యత్తు కింద భారతదేశ ఇంధన వ్యవస్థల భవిష్యత్తు” అనే అంశంపై ప్రసంగించనున్నారు. “బొగ్గు & వాతావరణ మార్పు – భారతీయ దృక్పథం” అనే అంశంపై మంత్రిత్వ శాఖ మరియు పీఎస్‌యుల ఉద్యోగుల కోసం డిక్లమేషన్ పోటీలు నిర్వహించనున్నారు. దేశ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వారోత్సవ వేడుక ముగింపు రోజునకు ఆయా కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ముగింపు రోజు స్వాగత కార్యక్రమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జైన్ ప్రసంగిస్తారు. వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు పంపిణీ చేస్తారు. 7 మార్చి 2022న న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బొగ్గు, గనులు మరియు రైల్వేల శాఖ మంత్రి శ్రీ రావుసాహెబ్ పాటిల్ దన్వే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వారం రోజుల వేడుకలను ప్రారంభించారు. కోల్ ఇండియా లిమిటెడ్, ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌ల లఘుచిత్ర ప్రదర్శన స్థిరమైన మైనింగ్, బొగ్గు మరియు అనుబంధ రంగాలపై నిపుణుల చర్చలు, రక్తదాన శిబిరాలు మొదలైనవి బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వారం రోజుల వేడుకలలో కొన్ని ముఖ్యాంశాలు.
****
(Release ID: 1805288)
Visitor Counter : 231