విద్యుత్తు మంత్రిత్వ శాఖ
ఆర్థిక సంవత్సరం 2021-22లో భారత ప్రభుత్వానికి రూ. 933.61 కోట్ల మధ్యంతర లాభాంశాన్ని చెల్లించిన ఎన్‌హెచ్‌పిసి
Posted On:
11 MAR 2022 10:40AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ప్రధాన జలవిద్యుత్ సంస్థ, భారత ప్రభుత్వ మినీ రత్న శ్రేణి -1 వ్యాపార సంస్థ అయిన ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్, ఆర్థిక సంవత్సరం 2021-22కు గాను మార్చి 4, 2022న భారత ప్రభుత్వానికి రూ. 933.61 కోట్లను మధ్యంతర లాభాంశంగా చెల్లించింది. ఎన్‌హెచ్‌పిసి సిఎండి, ఎకె సింగ్ ఈ లాభాంశ చెల్లింపుకు సంబంధించిన బ్యాంక్ పత్రాలను మార్చి 10, 2022న భారత ప్రభుత్వ విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్, డైరెక్టర్ (సాంకేతిక) శ్రీ వై.కె. చౌబే, డైరెక్టర్ (ఫైనాన్స్ శ్రీ ఆర్.పి.గోయల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ కె.కె. గోయల్, ఎన్‌హెచ్‌పిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ సంజయ్ కుమార్ మదన్ సమక్షంలో కేంద్ర విద్యుత్, నూతన& ఆవృత ఇంధన శాఖల మంత్రి శ్రీ ఆర్ కె సింగ్‌కు అంద చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021-22కు సంబంధించి ఎన్‌హెచ్‌పిసి ఇప్పటికే భారత ప్రభుత్వానికి ఆర్థిక సంవత్సరం 2020-21కి సంబంధించి అంతిమ లాభాంశంగా రూ. 249.44 కోట్లను చెల్లించింది. దీనితో, ఎన్‌హెచ్‌పిసి ఆర్థిక సంవత్సరంలో భారత ప్రభుత్వానికి చెల్లించిన మొత్తం లాభాంశం రూ. 1183.05 కోట్లు అయింది.
ఫిబ్రవరి 11, 2022న జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో మధ్యంతర లాభాంశాన్ని ఒక ఈక్విటీ షేరుకు అంటే 13.10% ముద్రిత ధర రూ. 1.31 చొప్పున ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2020-21లో మధ్యంతర లాభాంశంగా షేరు రూ. 1.25 చొప్పున మొత్తం రూ. 1255.63 కోట్ల భారీ మొత్తాన్ని కంపెనీ చెల్లించింది. ఇందుకు అదనంగా, అంతిమ లాభాంశంగా షేరుకు రూ.0.35 చొప్పున మొత్తం రూ. 351.58 కోట్ల భారీ మొత్తాన్ని చెల్లించింది. దీనితో, ఆర్థిక సంవత్సరం 2020-21కు గాను షేరు రూ.1.60 చొప్పున మొత్తం రూ. 1607.21 కోట్ల భారీ మొత్తాన్ని పూర్తి లాభాంశంగా చెల్లించింది.
పెట్టుబడులు & ప్రజా ఆస్తుల నిర్వహణ శాఖ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ & పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ - డిఐపిఎఎం) మే 27, 2016 న సిపిఎస్ఇల పెట్టుబడుల పునః వ్యవస్థీకరణకు సంబంధించి చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, ప్రతి సిపిఎస్‌యు ప్రజా ఆస్తుల నిర్వహణ (పిఎటి)లో 30% కనీస వార్షిక లాభాంశాన్ని లేదా నికర విలువలో 5% - ఇందులో ఏది ఎక్కువ అయితే అది చెల్లించవలసి ఉంటుంది. ఐబిఐడి మార్గదర్శకాలకు అనుగుణంగా, ఆర్థిక సంవత్సరం 2020-21కి గాను ఎన్‌హెచ్‌పిసి మొత్తం రూ. 1607.21 కోట్లను అంటే కంపెనీ నికర విలువలో 5.08% లాభాంశంగా చెల్లించింది.
ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల అంతానికి ఎన్‌హెచ్‌పిసి రూ. 2977.62 కోటల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో దాని లాభం రూ. 2829.16 కోట్లుగా ఉంది. ఆర్థిక సంవత్సరం 2020-21కి గాను కంపెనీ రూ. 3233.37 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
***
(Release ID: 1805287)
Visitor Counter : 242