గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఐకానిక్ వీక్ వేడుకల సందర్భంగా డీడీయూ–జీకేవైఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మహిళా- ఉపాధి కోర్సుల కోసం 174 సమీకరణ శిబిరాలు నిర్వహించడం జరిగింది.
4281 మందికి పైగా మహిళా అభ్యర్థులను కోర్సుల్లో చేరేలా సమీకరించారు.
డీడీయూ–జీకేవైపథకం కింద శిక్షణ పొందుతున్న మొత్తం అభ్యర్థులలో మూడింట ఒక వంతు మంది మహిళలు ఉండాలి.
Posted On:
10 MAR 2022 11:40AM by PIB Hyderabad
2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామీణాభివృద్ధి శాఖ (డీఓఆర్డీ) ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వీక్‌లో భాగంగా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూజీకేవై) కింద 174 కంటే ఎక్కువ 'మహిళా ఉపాధి' సమీకరణ శిబిరాలు దేశవ్యాప్తంగా ఈ నెల ఏడున నిర్వహించడం జరిగింది. అవ్సర్ కి ఆజాదీ- అనే పేరుతో ఈవెంట్‌ను వివిధ రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్లు (ఎస్ఆర్ఎల్ఎంలు), స్టేట్ స్కిల్స్ మిషన్లు (ఎస్ఎస్ఎం) ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు (పీఐఏలు) ద్వారా విజయవంతంగా నిర్వహించాయి.
ఆంధ్రప్రదేశ్‌లో చైతన్య యాత్ర
అసిస్టెంట్ బ్యూటీ థెరపిస్ట్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ టైలరింగ్ శాంపిల్ టైలరింగ్ మొదలైన కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా నిర్వహించిన వివిధ క్యాంపుల ద్వారా 4281 మంది మహిళా అభ్యర్థులను విజయవంతంగా సమీకరించారు. సంభావ్య అభ్యర్థులకు పథకం దాని నిబంధనల గురించి వారికి తెలియజేశారు
జార్ఖండ్‌లో చైతన్య శిబిరాల నిర్వహణ
డీడీయూ–జీకేవై పథకం కింద శిక్షణ పొందుతున్న మొత్తం అభ్యర్థులలో మూడింట ఒక వంతు మంది మహిళలు ఉండాలి. అలాగే, ఈ పథకం 15-–35 ఏళ్లలోపు గ్రామీణ పేద యువతను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, మహిళా అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 45 సంవత్సరాలు.
అస్సాంలో సమీకరణ శిబిరం
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 25 సెప్టెంబర్ 2014న ప్రారంభమయింది. ఇది కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్డీ) నిధుల ద్వారా నడుస్తున్న ప్లేస్‌మెంట్-లింక్డ్ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పేద గ్రామీణ యువత ప్లేస్‌మెంట్ లింక్డ్ నైపుణ్యాలను పెంపొందించడానికి, ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలలో వాళ్లు ఉద్యోగాలు ఉపాధి పొందేలా చేస్తుంది. ప్రోగ్రామ్ కనీసం 70% శిక్షణ పొందిన అభ్యర్థులకు గ్యారెంటీ ప్లేస్‌మెంట్కు హామీ ఉంటుంది. డీడీయూ–జీకేవై కార్యక్రమం 27 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాలలో గ్రామీణ పేద యువత ఉపాధి కోసం ప్రాధాన్యతనిస్తూ అమలు చేయబడుతోంది. 871 కంటే ఎక్కువ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీలు (పీఐఏలు) 2381కుపైగా శిక్షణా కేంద్రాల ద్వారా గ్రామీణ పేద యువతకు 611 రకాల ఉద్యోగాలలో శిక్షణనిస్తున్నాయి.
***
(Release ID: 1805003)
Visitor Counter : 266