సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ పథకం కింద ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ (ఇంక్యుబేషన్, డిజైన్ మరియు ఐపీఆర్) & ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 2022 ని ప్రారంభించిన శ్రీ నారాయణ్ రాణే

Posted On: 10 MAR 2022 3:14PM by PIB Hyderabad

ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ పథకం కింద ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ (ఇంక్యుబేషన్, డిజైన్ మరియు ఐపీఆర్ ) & ఎంఎస్ఎంఈ ఐడియా హ్యాకథాన్ 2022 ని ఈ రోజు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి  శ్రీ నారాయణ్ రాణే ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన  శ్రీ నారాయణ్ రాణే ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో ఎంఎస్ఎంఈ ల పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు.నూతనంగా ప్రారంభించిన పథకాల సహకారంతో పారిశ్రామికవేత్తలు నూతన కార్యక్రమాలు చేపట్టవచ్చునని అన్నారు. 

 ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి శ్రీ శ్రీ భాను ప్రతాప్ వర్మ మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ రంగంలో సృజనాత్మకతను ప్రోత్సహించి, రంగంలో అభివృద్ధి సాధించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ కు రూపకల్పన చేశామని తెలిపారు. 

ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ ప్రారంభ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ కార్యదర్శి శ్రీ బి.బి.స్వైన్ ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. సృజనాత్మకత కార్యక్రమాలకు ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ వేదికగా ఉంటుందని అన్నారు. ఆలోచలను కార్యరూపంలోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ ద్వారా అందిస్తామని పేర్కొన్నారు. ఆలోచనలు వ్యాపార అంశాలుగా మారినప్పుడు సమాజానికి ప్రయోజనం కలుగుతుందని అన్నారు. 

మూడు ఉప భాగాలను ఆలోచనలను ఒక తాటిపైకి తెచ్చి సమగ్ర, సంపూర్ణ పథకాల రూపకల్పనకు ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ తోడ్పాటు అందిస్తుంది. ఆలోచనలు, రూపకల్పన, పథకాల అమలు, ప్రాజెక్తులకు పేటెంట్ హక్కులు (ఐపీఆర్ ) అంశాలపై ఏకగవాక్ష విధానంగా ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ అమలు జరుగుతుంది.   ఎంఎస్ఎంఈ అభివృద్ధికి దేశంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై  ఎంఎస్ఎంఈ లకు అవగాహన కల్పించి అభివృద్ధి సాధించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను    ఇన్నోవేటివ్ స్కీమ్ ద్వారా అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చి ఆర్థికంగా వెసలుబాటుగా వుండే వ్యాపారాలను ప్రారంభించేందుకు ఎంఎస్ఎంఈ ఇన్నోవేటివ్ స్కీమ్ సహకారం అందిస్తుంది. దీనివల్ల ఎంఎస్ఎంఈ రంగంతో పాటు సమాజానికి కూడా ప్రయోజనం కలుగుతుంది. పథకంలో అమలు కానున్న మూడు ఉప భాగాల వివరాలు :-

·        ఇంక్యుబేషన్:   సృజనాత్మకతను గుర్తించి  ప్రోత్సహించి వెలికి తీయడం   ప్రాథమిక లక్ష్యంగా ఈ పథకం అమలు జరుగుతుంది. ప్రాథమిక దశలో ఉన్న  ఎంఎస్ఎంఈ లను గుర్తించి వాటిని ప్రోత్సహించి  తాజా సాంకేతికతలను అమలు చేసేలా చూసేందుకు పథకం సహకారం అందిస్తుంది. దీనిలో భాగంగా  ఒక్క ఐడియా కి  15 లక్షల రూపాయల ఆర్థిక సహకారాన్ని,  ప్లాంట్ మరియు యంత్రాల కోసం   ఒక కోటి రూపాయలను అందించడం జరుగుతుంది. 

·        డిజైన్:   భారతీయ తయారీ రంగం మరియు డిజైన్ నైపుణ్యం/ డిజైన్ రంగాన్ని  ఒక ఉమ్మడి వేదిక పైకి తీసుకురావడం లక్ష్యంగా పథకం రెండవ ఉప పథకం అమలు జరుగుతుంది. నూతన ఉత్పత్తుల  అభివృద్ధి,  నిరంతర మెరుగుదల మరియు ఇప్పటికే ఉన్న/కొత్త ఉత్పత్తులకు  విలువ జోడింపు కోసం రియల్ టైమ్ డిజైన్ సమస్యలపై నిపుణుల సలహా మరియు తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందించడం లక్ష్యంగా ఇది అమలు జరుగుతుంది. దీనిలో డిజైన్ ప్రాజెక్ట్ కోసం 40 లక్షల రూపాయలు, మరియు  స్టూడెంట్ ప్రాజెక్ట్ కోసం 2.5 లక్షల రూపాయలను అందించడం జరుగుతుంది. 

· ఐపీఆర్  (మేధో సంపత్తి హక్కులు):  ఎంఎస్ఎంఈ లలో మేధో సంపత్తి హక్కుల (ఐపీఆర్ లు) అవగాహనను పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది.  దేశ ఆర్థిక వ్యవస్థలో సృజనాత్మక మేధో ప్రయత్నాన్ని ప్రోత్సహించడానికి, దేశంలో  మేధో సంపత్తి    సంస్కృతి ని మెరుగుపరచడం ఈ పథకం యొక్క లక్ష్యం . ఐపీ  ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారా ఎంఎస్ఎంఈ లు తమ ఉత్పత్తులను వాణిజ్య ఉత్పతులుగా మార్కెట్ లోకి ప్రవేశపెట్టడం, పేటెంట్ హక్కులను పొందేందుకు అవసరమైన సహాయ సహకారాలను పొందుతారు. విదేశీ పేటెంట్ కోసం అయిదు లక్షల రూపాయలు, స్వదేశీ పేటెంట్ కోసం లక్ష రూపాయలు,    జిఐ  నమోదు కోసం 2.00 లక్షలు, రూ. డిజైన్ రిజిస్ట్రేషన్ కోసం 15,000/-, రీయింబర్స్‌మెంట్ రూపంలో ట్రేడ్‌మార్క్ కోసం రూ.10,000/-.అందించడం జరుగుతుంది. 

మరిన్ని వివరాలను  -  www.innovative.msme.gov.in నుంచి పొందవచ్చు. 

 

***


(Release ID: 1804893) Visitor Counter : 244