సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రారంభమై ఏడాది పూర్తైన సందర్భంగా ‘అమృత్ కల్ కా పెహ్లా సాల్’ పేరిట కార్యక్రమం నిర్వహించనున్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ


కార్యక్రమాలకు అధ్యక్షత వహించనున్న కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి

కార్యక్రమంలో మహిళా సాధికారతకు దర్పం పట్టే విధంగా మహిళలకు అంకితం చేసిన అమర్ చిత్ర కథ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

Posted On: 10 MAR 2022 3:22PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలకు ఏడాది పూర్తైన సందర్భంగా 2022 మార్చి 2న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘అమృత్ కల్ కా పెహ్లా సాల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేడుకలను 2021  మార్చి12న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్వాతంత్ర్యం సాధించిన తర్వాత దేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకుని, దేశ చరిత్ర సాంస్కృతిక విలువలకు  గుర్తు చేసే విధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ వేడుకలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న  స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించి, వారు చేసిన త్యాగాలు గుర్తు చేసే విధంగా ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు నిర్వహిస్తోంది. ఆత్మ నిర్భర్ భారత్ సాధన దిశగా దేశం వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలలో స్ఫూర్తి నింపి భారత్ 2.0 నిర్మాణంలో వారిని భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అమలు జరుగుతోంది. 

  ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు  ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా న్యూఢిల్లీ కన్నాట్ ప్లేస్ లో నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాలకు  కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి  శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, కేంద్ర విదేశీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి  శ్రీమతి  మీనాక్షి లేఖి హాజరవుతారు. అధికారంలో భాగస్వాములుగా ఉన్న మహిళలపై  (చట్ట సభలకు ఎన్నికైన మహిళలు) రూపొందించిన అమర్ చిత్ర కథ ప్రత్యేక సంచికను కార్యక్రమంలో ఆవిష్కరిస్తారు. ఆవిష్కరణ కార్యక్రమం తర్వాత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలపై మల్టీ-మీడియా ప్రదర్శన ఉంటుంది. అమరవీరులకు డిజిటల్ నివాళి- “డిజిటల్ జ్యోత్” వేడుకలలో భాగంగా  ప్రారంభించబడుతుంది.  సాయంత్రం సునీల్ గ్రోవర్, ధ్వని భానుషాలి, అర్మాన్ మాలిక్ మరియు ఆర్జే  మలిష్కా వంటి కళాకారులతో పాటు ప్రముఖ కవి మరియు ప్రదర్శకుడు కుమార్ విశ్వాస్ ప్రత్యక్ష ప్రదర్శనలు ఇవ్వనున్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను భౌతిక మరియు వర్చువల్ విధానాల్లో దేశం వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తున్నారు.  నిర్వహించిన ప్రదర్శనలు, కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అపూర్వమైన స్పందన లభించింది.ప్రజలు వీటిలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 75 వారాల పాటు వేడుకలు  నిర్వహించనున్నారు. 12 మార్చి 2021న ప్రారంభమైన ఈ వేడుకలు 15 ఆగస్టు 2023న ముగుస్తాయి. 

 

***



(Release ID: 1804879) Visitor Counter : 183