ఉక్కు మంత్రిత్వ శాఖ
రఫ్ డైమండ్ వేలంలో మెరిసిన ఎన్ఎండిసి
Posted On:
10 MAR 2022 12:02PM by PIB Hyderabad
ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు అయిన నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండిసి) మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా డైమండ్ గనులలో ఉత్పత్తి చేయబడిన రఫ్ వజ్రాల అమ్మకం కోసం ఈ-వేలం నిర్వహించింది. ఈ-వేలానికి సూరత్, ముంబై మరియు పన్నా వజ్రాల వ్యాపారుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. డిసెంబర్ 20 కి ముందు ఉత్పత్తి చేయబడిన సుమారు 8337 క్యారెట్ల రఫ్ డైమండ్‌లు వేలంలో అందించబడ్డాయి మరియు దాదాపు 100%నికి విజయవంతమైన బిడ్‌లు వచ్చాయి.
మజ్‌గవాన్‌లోని ఎన్ఎండిసీకి చెందిన డైమండ్ మైనింగ్ ప్రాజెక్ట్ - పన్నా దేశంలోనే మెకనైజ్డ్ డైమండ్ మైనింగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ భారీ మీడియా సెపరేషన్ యూనిట్, డైమండ్ సెపరేషన్ కోసం ఎక్స్-రే సార్టర్ మరియు టైలింగ్స్ కోసం అవసరమైన వ్యవస్థతో పాటు ప్రాసెసింగ్ ప్లాంట్ సౌకర్యాలను కలిగి ఉంది.
ఎన్ఎండిసీ సిఎండీ శ్రీ సుమిత్ దేబ్ మాట్లాడుతూ “ఎన్ఎండీసీ ఆరు దశాబ్దాలకు పైగా మైనింగ్ రంగంలో ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు అసమానమైన అనుభవంతో, కంపెనీ పర్యావరణ భద్రత మరియు దేశం కోసం మెరుగైన ఉత్పత్తి సామర్థ్యంతో గనుల చుట్టూ ఉన్న ప్రజల రక్షణను సమతుల్యం చేసే సంస్థగా మారింది. మేము ఇటీవల సూరత్‌లో నిర్వహించిన వజ్రాల వేలంలో అద్భుతమైన స్పందనను పొందాము, ఇక్కడ ఆఫర్ చేసిన పరిమాణంలో దాదాపు 100% వజ్రాల వ్యాపారుల నుండి బిడ్‌లను స్వీకరించింది. ఎన్ఎండీసీకి మధ్యప్రదేశ్‌లోని పన్నా వద్ద వజ్రాల గని కలిగి ఉంది. ఇది మన దేశానికి సంబంధించిన మొత్తం వజ్రాల వనరులో 90% వాటాను కలిగి ఉన్న భారతదేశంలోని ఏకైక రాష్ట్రం. సంవత్సరానికి 84,000 క్యారెట్ల ఉత్పత్తి సామర్థ్యంతో రాష్ట్రంలో ఎన్‌ఎండిసి ఉనికిని కలిగి ఉండటం దేశ వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ పట్ల దాని నిబద్ధతను తెలియజేస్తుంది" అని చెప్పారు.
****
(Release ID: 1804783)
Visitor Counter : 138