భారత పోటీ ప్రోత్సాహక సంఘం
ప్రియోన్ బిజినెస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అమెజాన్ ఏషియా-పసిఫిక్ రీసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోద ముద్ర
Posted On:
10 MAR 2022 11:14AM by PIB Hyderabad
ప్రియోన్ బిజినెస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను అమెజాన్ ఏషియా-పసిఫిక్ రీసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం తెలిపింది.
ప్రియోన్ బిజినెస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ (లక్ష్యం)లో 76 శాతం ఈక్విటీ షేర్లను అమెజాన్ ఏషియా -పసిఫిక్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (కొనుగోలుదారు) స్వంతం చేసుకోవడమనే ప్రతిపాదనకు సంబంధించిన కలయిక ఇది.
కొనుగోలుదారు అమెజాన్.కామ్, ఐఎన్‌సి. (ఎసిఐ) పరోక్ష పూర్తి యాజమాన్యంలో ఉన్న అనుబంధ సంస్థ. అమెజాన్ గ్రూప్‌కు అంతిమ మాతృ సంస్థ ఎసిఐ. కొనుగోలుదారు భారతదేశంలో ఎటువంటి వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడు. అయితే, కొనుగోలుదారు అంతిమ మాతృ సంస్థ అయిన ఎసిఐకు భారత్‌లో నమోదు చేసుకున్న లేక భారత్‌లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొన్ని పరోక్ష సంస్థలు ఉన్నాయి.
లక్ష్యిత సంస్థ పూర్తిగా భారత యాజమాన్యం, నియంత్రణలో ఉన్న సంస్థ. హోబర్ మాలో ట్రస్ట్ (హోబర్ మాలో) నియంత్రణలో ఉన్న ఈ లక్ష్యిత సంస్థలో హోబర్ మాలోకు 76 శాతం వాటా మూలధనం ఉంది. కొనుగోలుదారు ఇప్పటికే లక్ష్యిత సంస్థలో ఇరవై మూడు శాతం వాటా మూలధనాన్ని కలిగి ఉండటమే కాక, అమెజాన్ యురేషియా హోల్డింగ్స్ ఎస్.ఎ.ఆర్.ఎల్ కూడా లక్ష్యిత సంస్థలో ఒక శాతం వాటా మూలధనాన్ని కలిగి ఉంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాల ఆన్‌లైన్ వ్యాపారాలను సమర్ధవంతంగా నిర్వహించడమే కాక, డిజిటల్ కేటలాగింగ్, ప్రకటనలు, శిక్షణ, సంప్రదింపులు, సలహాలు, విలువ జోడించిన సేవలు, డిజిటల్ చెల్లింపులను ఎంచుకోవడం, సాధికారం చేసే మొత్తం సమగ్ర సేవలు సహా వివిధ సేవలను లక్ష్యిత సంస్థ అందిస్తోంది.
లక్ష్యిత సంస్థకు తన పూర్తి యాజమాన్యంలోని క్లౌడ్ టెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (సిటి) ఉంది. సిటి సంస్థ భారతదేశంలో బి2సి రిటైల్ వ్యాపారంలో నిమగ్నమై, ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్ , ఆమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (అమెజాన్ మార్కెట్ ప్లేస్) నిర్వహించే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. అమెజాన్. ఇన్ ద్వారా వినియోగదారులకు ఉత్పత్తులను అమ్మే సేవలను అందిస్తోంది. దీనితోపాటుగా, సిటి ఆన్‌లైన్, ఆఫ్‌లైన మార్గాల ద్వారా ఉత్పత్తుల టోకు (బి2బి) వ్యాపారాన్ని నిర్వహించడంలో నిమగ్నమై ఉంది.
సిసిఐ వివరణాత్మక ఉత్తర్వులను జారీ కానున్నాయి.
***
(Release ID: 1804776)
Visitor Counter : 163