మంత్రిమండలి
ఇండియాలో సంప్రదాయ వైద్య అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్
Posted On:
09 MAR 2022 1:33PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ , ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (డబ్ల్యుహెచ్ ఒ జిసిటిఎం)ను గుజరాత్ లోని జామ్ నగర్ లో ఏ ర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.ఇందుకు సంబంధించి ఆతిథ్య దేశ ఒప్పందంపై ఇండియా, ప్రపంచ ఆరోగ్య సంస్థలు సంతకం చేయడం ద్వారా దీని ఏర్పాటుకు ఆమోదం తెలిపింది.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ కింద జామ్ నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ జిసిటిఎంను ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచంలో సంప్రదాయ వైద్యానికి సంబంధించి ఇది ఏకైక అంతర్జాతీయ ఔట్ పోస్ట్ సెంటర్.
ప్రయోజనాలు :
1.ఆయుష్ వ్యవస్థను అంతర్జాతీయంగా నిలదొక్కుకునేట్టు చేయడం
2.సంప్రదాయ వైద్యానికి సంబంధించి అంతర్జాతీయ ఆరోగ్య విషయాలలో నాయకత్వాన్ని అందించడం
3.నాణ్యత, భద్రత, సమర్ధత, అందుబాటు, సంప్రదాయ వైద్యాన్ని హేతుబద్ధంగా వినియోగించేందుకు వీలు కల్పించడం
4.విధులు, ప్రమాణాలు, మార్గదర్శకాలను సంబంధిత సాంకేతిక అంశాలలో అభివృద్ధి చేయడం, ఉపకరణాలు, మెథడాలజీ రూపకల్పన, డేటా అనలిటిక్స్, ప్రభావాన్ని అంచనా వేయడం. ఇప్పటికే ఉన్న టిఎం డేటా బ్యాంక్‌లు, వర్చువల్ లైబ్రరీలు . అకడమిక్ , రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ల సహకారాన్ని రూపొందించే ప్రపంచ ఆరోగ్య సంస్థ టిఎం ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ కు వీలు కల్పించడం.
5.నిర్దేశిత లక్ష్యాలకు సంబంధించిన అంశాలలో నిర్దిష్ట సామర్థ్యం పెంపుదల , శిక్షణ కార్యక్రమాలను అభివృద్ధి చేయడం , క్యాంపస్, రెసిడెన్షియల్ లేదా వెబ్ ఆధారిత , ప్రపంచ ఆరోగ్య సంస్థ విద్యా సంస్థలు, ఇతర వ్యూహాత్మక భాగస్వాములతో శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం .
ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రొస్ ఆధనామ్ ఘెబెరిఎసస్, ఇండియాలో ప్రపంచ ఆరోగ్య్ సంస్థవారి జిసిటిఎం ను ఏర్పాటుచేస్తున్నట్టు 2020 నవంబర్13న 5వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమక్షంలో ప్రకటించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చొరవను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ప్రపంచ ఆరోగ్య్ సంస్థ జిసిటిఎం గ్లోబల్ వెల్‌నెస్ సెంటర్‌గా ఎదగనుంది. ఇది తగిన సాక్ష్యాలతో కూడిన పరిశోధన, శిక్షణ , అవగాహనను సంప్రదాయ వైద్యం విషయంలో కల్పిస్తుంది.
ఈ కేంద్రం ఏర్పాటు, అమలు, పర్యవేక్షణ వంటి వాటిని సమన్వయం చేసేందుకు, సంయుక్త టాస్క్ ఫోర్స్ (జెటిఎఫ్)ను ఏర్పాటు చేయడం జరిగింది.జాయింట్ టాస్క్‌ఫోర్స్ లో ప్రభుత్వ ప్రతినిధులు, పర్మనెంట్ మిషన్ ఆఫ్ ఇండియా , జెనీవా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఉంటారు. దీని పరిధి కింద, గుజరాత్ లోని జామ్ నగర్ ఐటిఆర్ ఎ వద్ద తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
దీని పరిధి కింద, గుజరాత్ లోని జామ్ నగర్ ఐటిఆర్ ఎ వద్ద తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. గుర్తించిన సాంకేతిక కార్యకలాపాల అమలు, అలాగే పూర్తిస్థాయిలో డహెచ్ ఒ జిసిటిఎం ను పనిచేసేలా చేయడానికి ప్రణాళిక వంటివి ఇందులో ఉన్నాయి.
తాత్కాలిక కార్యాలయం, తగిన లక్ష్యాలు, ఆవిష్కరణలు,సంప్రదాయ వైద్యానికి సంబంధించి కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు, కోచర్నెతో ఒక పద్ధతి ప్రకరాం కొలాబరేషన్, డబ్ల్యు హెచ్ ఒ జిపిడబ్ల్యు 13 కింద సంప్రదాయ వైద్య వివరాలపై అంతర్జాతీయ సర్వేల, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, సంప్రదాయ వైద్యం, సామాజిక సాంస్కృతిక , జీవ వైవిధ్య వారసత్వం,సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి ముందుచూపు, బిజినెస్ కార్యకలాపాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన జిసిటిఎం ప్రధాన కార్యాలయ ఏర్పాటుకు పరిపాలనాపరమైన ప్రక్రియలకు సంబంధించిన ఫలితాల సాధనకు ఈ తాత్కాలిక కార్యాలయం దోహదపడుతుంది.
డబ్ల్యుహెచ్ ఒ జిసిటిఎం అంతర్జాతీయంగా అన్ని సంప్రదాయ ఔషధాల విషయంలో నాయకత్వం వహించడంతోపాటు, సంప్రదాయ వైద్య పరిశోధన ,పద్ధతులు, ప్రజారోగ్యం వంటి వాటికి రూపకల్పన చేయడంలో సభ్యదేశాలకు తగిన మద్దతు నిస్తుంది.
ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థతో పలు విషయాలలో కలిసి పనిచేస్తోంది. ఆయుర్వేద, యునాని విధానాల విషయంలో తగిన శిక్షణ, అమలు విషయంలో ప్రమాణాల రూపకల్పన, అంతర్జాతీయంగా వ్యాధుల వర్గీకరణ -11 చాప్టర్‌కు సంబంధించి రెండో మాడ్యూల్ ను ప్రవేశ పెట్టడం- యోగా యాప్ అభివృద్ధి, అంతర్జాతీయంగా మూలికా వైద్యానికి సంబంధించి ఫార్మకోపియా పనికి మద్దతు, ఇతర అధ్యయనాలు ఇందులో ఉన్నాయి.
ఆరోగ్య సంరక్షణ ను అందించడంలో సంప్రదాయ వైద్యం కీలకమైన స్తంభం వంటిది. సురక్షితమైన, క్రియాశీలైన సంప్రదాయ వైద్యం , ప్రజలందరికీ నాణ్యమైన అత్యావశ్యక ఆరోగ్య సంరక్షణ సేవలను , అందుబాటుధరలో మందులను అందించడంలో కీలకమైనది. ప్రపంచం 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్షాలను అందుకునే కీలకమైలు రాయిని అందుకోనున్నదశలో ఇది ఎంతో ముఖ్యమైనది. డబ్ల్యుహెచ్ ఒ-జిసిటిఎం ఆయా దేశాలలో సంప్రదాయ వైద్యాన్ని మరింత పటిష్టపరచడం, నియంత్రించడం, సమన్వయ పరచడం లో వివిధ సవాళ్లను గుర్తిస్తుంది. రానున్న డబ్ల్యు హెచ్ ఒ- జిసిటిఎం, వివిధ ఇతర చర్యలు , సంప్రదాయ వైద్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా మంచి స్థితిలో ఉంచేందుకు ఇండియా చేసే ప్రయత్నాలకు దోహదపడనుంది.
***
(Release ID: 1804764)
Visitor Counter : 313
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam