మంత్రిమండలి
azadi ka amrit mahotsav

మిగులు భూమిని నగదు గా మార్చడం అనే ప్రక్రియ ను చేపట్టడాని కి నేశనల్ ల్యాండ్ మానిటైజేశన్కార్పొరేశన్ ను ఒక స్పెశల్ పర్పస్ వెహికిల్ (ఎస్ పివి) రూపం లో ఏర్పాటు చేయడాని కిఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 09 MAR 2022 1:31PM by PIB Hyderabad

నేశనల్ లేండ్ మానిటైజేశన్ కార్పొరేశన్ (ఎన్ఎల్ఎమ్ సి) ని భారత ప్రభుత్వ పూర్తి యాజమాన్యం లోని కంపెనీ గా ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ఎన్ఎల్ఎమ్ సి కి 5,000 కోట్ల రూపాయల ప్రారంభిక అధీకృత వాటా మూలధనం తో పాటు 150 కోట్ల రూపాయలు చెల్లించిన వాటా మూలధనం ఉంటుంది. ఎన్ఎల్ఎమ్ సి అనేది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సిపిఎస్ఇ స్) కు చెందిన మరియు ఇతర ప్రభుత్వ ఎజెన్సీల కు చెందిన మిగులు భూమి, ఇంకా భవనాల రూపంలోని ఆస్తుల ను నగదు గా మార్చే ప్రక్రియ (నగదీకరణ) ను నిర్వహించనుంది. ఈ ప్రతిపాదన 2021-22 సంవత్సరాని కి గాను చేసినటువంటి బడ్జెటు ప్రకటన కు అనుగుణం గా ఉంది.

 

అంతగా ప్రాముఖ్యం లేనటువంటి ఆస్తుల నగదీకరణ ఫలితం గా ఉపయోగంలో లేని, లేదా పాక్షిక ఉపయోగంలో ఉన్న ఆస్తులను నగదీకరించడం ద్వారా ప్రభుత్వం గణనీయమైనటువంటి ఆదాయాన్ని చేజిక్కించుకొనేందుకు అవకాశం ఏర్పడుతుంది.

 

ప్రస్తుతం, అసలు ఉపయోగం లో లేనేలేనటువంటి లేదా పాక్షికం గా మాత్రమే ఉపయోగం లో ఉన్నటువంటి భూమి, భవనాలు కీలకేతర ఆస్తుల రూపం లో సిపిఎస్ఇ ల వద్ద చెప్పుకోదగిన పరిమాణం లో ఉన్నాయి. వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ ప్రక్రియ లో ఉన్న సిపిఎస్ఇ లు గాని, లేదా మూసివేత ముంగిట నిలచిన సిపిఎస్ఇ ల విషయం లో గాని ఈ మిగులు భూమి మరియు అప్రాధాన్య ఆస్తుల నగదీకరణ వాటి విలువ నిర్ధారణ లో కీలకం అవుతున్నాయి. ఎన్ఎల్ఎమ్ సి ఈ ఆస్తుల మానిటైజేశన్ కు తోడ్పడి, ఈ ప్రక్రియ కు సమర్ధన ను అందిస్తుంది. పాక్షిక ఉపయోగం లో జరుగుతూ ఉన్నటువంటి ఈ ఆస్తుల ను ఉత్పాదన ఆధారితం గా ఉపయోగం లోకి తీసుకు రావడం వల్ల ప్రైవేటు రంగం యొక్క పెట్టుబడి కి ప్రోత్సాహం లభించడానికి మార్గం సుగమం అవుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ కు దన్ను లభిస్తుంది. ఆర్థిక, సామాజిక, మౌలిక సదుపాయల కల్పన కు ద్రవ్య వనరులు అంది వస్తాయి.

 

ఎన్ఎల్ ఎమ్ సి, మూతపడ్డ సిపిఎస్ఇ మరియు ప్రభుత్వ యాజమాన్యాన్ని కలిగివున్న సిపిఎస్ఇ లు ఏవయితే వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ ప్రక్రియ లో భాగం అయ్యాయో, వాటి కి చెందిన మిగులు భూమి మరియు భవన రూప ఆస్తుల స్వామిత్వాన్ని దక్కించుకొంటుంది. వాటి ని నిర్వహిస్తుంది, వాటి నగదీకరణ బాధ్యతల ను నిర్వర్తిస్తుంది. దీనితో సిపిఎస్ఇ ల మూసివేత ప్రక్రియ వేగం పుంజుకొంటుంది, ప్రభుత్వ స్వామిత్వం లోని సిపిఎస్ఇ ల తాలూకు వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ ప్రక్రియ సైతం సరళతరం అయిపోతుంది. ఈ ఆస్తుల ను వాటి నిర్వహణ మరియు నగదీకరణ లలో దక్షత కలిగివుండేటటువంటి ఎన్ఎల్ఎమ్ సి కి బదలాయించడానికి వీలవుతుంది. ఎన్ఎల్ఎమ్ సి ఇతర ప్రభుత్వ కంపెనీల (సిపిఎస్ఇ లు సహా) కు సంప్రదింపు మరియు సమర్థన సేవల ను అందిస్తుంది; తద్ద్వారా అవి వాటి యొక్క అప్రాధాన్య ఆస్తుల ను సముచిత రీతి న గుర్తించి, వాటి నగదీకరణ కు నడుంకట్టి గరిష్ట విలువ ను రాబట్టుకోగలవన్న మాట. ఈ కేసుల లో సిపిఎస్ఇ లు- ఏవయితే వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ ప్రక్రియలో గాని లేదా వ్యూహాత్మక పెట్టుబడి ఉపసంహరణ సంబంధి జాబితా లో ఉన్నాయో- ఎన్ఎల్ఎమ్ సి మిగులు భూమి నగదీకరణ ను ఒక ఏజెన్సీ మాదిరి గా మెరుగైన విధివిధానాలను అనుసరిస్తూ, కార్యాన్ని ముగిస్తుంది. అంతేకాక ఎసెట్ మానిటైజేశన్ ప్రోగ్రాము ను అమలు పరచడం లో ప్రభుత్వాని కి ఎన్ఎల్ఎమ్ సి ఒక రిపాజిటరీ వలె వ్యవహరిస్తూ, సాంకేతికపరమైన సలహా ను అందించేందుకు కూడాను ఆస్కారం ఉంది.

 

సిపిఎస్ఇ మరియు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల కు బదులు గా పనిచేస్తూ ఎన్ఎల్ఎమ్ సి భూమి రూప ఆస్తుల నిర్వహణను, నగదీకరణ ను చేపడుతుంది. ఈ కార్యం కోసం అవసరమైన సాంకేతిక ప్రావీణ్యాన్ని ఎన్ఎల్ ఎమ్ సి కి సంతరించడం జరుగుతుంది. ఎన్ఎల్ఎమ్ సి కి చెందిన డైరెక్టర్ ల బోర్డు లో కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రముఖ నిపుణులు ఉంటారు. వారు కంపెనీ ని మెరుగైన పద్ధతి లో నడుపుతుంటారు. ఎన్ఎల్ఎమ్ సి కి చైర్ మన్ ను మరియు ప్రభుత్వేతర డైరెక్టర్ లను ప్రతిభ ఆధారిత ఎంపిక ప్రక్రియ మాధ్యమం ద్వారా నియమించడం జరుగుతుంది.

 

స్థిరాస్తి బజారు లో ఎసెట్ మానిటైజేశన్ కోసం విశేషమైన కార్యకుశలత్వం, ప్రావీణ్యం అవసరమవుతాయి. దీని పరిధి లోకి పరిశోధన, చట్ట సంబంధి పరిశీలన, మూల్య నిర్ధారణ, మాస్టర్ ప్లాన్ రూపకల్పన, పెట్టుబడి సంబంధి బ్యాంకింగ్, భూమి నిర్వహణ వంటివి వస్తాయి. ఈ నైపుణ్యాల ప్రాముఖ్యాన్ని గుర్తెరిగి ప్రైవేటు రంగం నుంచి, ఇంకా నేశనల్ ఇన్ వెస్ట్ మెంట్ ఎండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్), ఇన్ వెస్ట్ ఇండియా వంటి ప్రభుత్వ కంపెనీల నుంచి వృత్తి నిపుణుల ను నియమించుకోవాలని నిర్ణయించడమైంది. ఎన్ఎల్ఎమ్ సి లో పూర్తి కాలం పని చేసే సిబ్బంది కనీస స్థాయి లో ఉంటారు. వారిని మార్కెట్ నుంచి నేరు గా కాంట్రాక్ట్ ప్రాతిపదిక న ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ప్రైవేటు రంగాని కి చెందిన అనుభవజ్ఞులైన వృత్తి నిపుణుల ను భర్తీ చేసుకొని, వారికి తగిన వేతనాల ను ఇచ్చి దీర్ఘకాలం పాటు వారి సేవల ను వినియోగించుకొనేందుకు తగిన వెసులుబాటుల ను ఎన్ఎల్ఎమ్ సి బోర్డు కు ఇవ్వడం జరుగుతుంది.

 

ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని డిపార్ట్ మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ (డిపిఇ) సదరు కంపెనీ ని ఏర్పాటు చేసి, దీని కోసం పాలన పరమైన మంత్రిత్వ శాఖ గా వ్యవహరిస్తుంది.

 

***


(Release ID: 1804477) Visitor Counter : 219