కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహిస్తున్నందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ, ఈఎస్ఐసీలను కేంద్ర కార్మిక మంత్రి భూపేంద్ర యాదవ్ అభినందించారు.


భారత ప్రభుత్వం కార్యాలయంలో సమానత్వం పనిని ఎంచుకోవడానికి మాత్రమే కాకుండా సరైన పనిని ఎంచుకునే స్వేచ్ఛకు, ఆరోగ్య భద్రతకు, సమాన స్వేచ్ఛకు కట్టుబడి ఉంది: యాదవ్

మహిళా సాధికారత డెస్క్‌ను ప్రారంభించడం ద్వారా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈఎస్ఐసీ ద్వారా మహిళల అన్ని క్లెయిమ్‌లను క్లియర్ చేయడం ద్వారా కార్మిక మంత్రిత్వ శాఖ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

Posted On: 09 MAR 2022 11:09AM by PIB Hyderabad

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్  వారానికి సంబంధించి, కార్మిక,  ఉపాధి  మంత్రిత్వ శాఖ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ , ఈఎస్ఐసీ  రెండు కీలక విభాగాలు డీజీఎంఎస్తో పాటు మహిళలకు సంబంధించిన అన్ని క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసే చర్యలతో సహా మహిళా-స్నేహపూర్వక కార్యక్రమాలను నిర్వహించాయి. మహిళలకు  వన్-స్టాప్ సర్వీస్ డెలివరీ కోసం "మహిళా సాధికారత డెస్క్‌లు" మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ, ఈఎస్ఐసీ & డీజీఎంఎస్ సంయుక్తంగా "మహిళా శ్రామికశక్తికి విలువ  సాధికారత" అనే అంశంపై నిన్న ఇక్కడ ఒక కార్యక్రమాన్ని నిర్వహించాయి. దీనికి కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి  భూపేంద్ర యాదవ్, కార్మిక & ఉపాధి శాఖ సహాయ మంత్రి  రామేశ్వర్ తేలీ హాజరయ్యారు. సునీల్ బర్తవాల్, సెక్రటరీ, కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ,  నీలం షామీ రావు, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్,  ఎంఎస్ భాటియా, డీజీ ఈఎస్ఐసీ  ఇతరులు కూడా పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా  భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు కీలకమైన కార్మిక మంత్రిత్వ శాఖలోని రెండు కీలక విభాగాలైన ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ, ఈఎస్ఐసీ చేపట్టిన విశిష్ట కార్యక్రమాలను ప్రశంసించారు. "ఈపీఎఫ్‌ఓ నమ్మకానికి ప్రతీక అయితే, సేవల ద్వారా ఈఎస్ఐసీ ఎన్నో సేవలను అందిస్తున్నందుకు అభినందనలు" అని ఆయన అన్నారు.  మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈఎస్ఐసీలోని అన్ని మహిళా క్లెయిమ్‌లను క్లియర్ చేయడాన్ని ఆయన ప్రశంసించారు. మహిళలకు పని ప్రదేశంలో సమానత్వాన్ని పెంపొందించడమే కాకుండా సరైన పనిని ఎంచుకునే స్వేచ్ఛను ఇస్తూ ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకునేలా సమాన స్వేచ్ఛకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. కార్మిక శాఖ కార్యదర్శి సునీల్ భర్త్వాల్ ప్రసంగిస్తూ, పని ప్రదేశాల్లో మహిళలు వారి జనాభా నిష్పత్తిలో భాగస్వామ్యమయ్యేలా చూడడమే ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

ఆజాదీ కా అమృత్ ఉత్సవ్‌లో భాగంగా, ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ 75 లక్షల ఈ–-నామినేషన్‌లను లక్ష్యంగా చేసుకుంది.  ముఖ్యంగా మహిళా దినోత్సవం కోసం, మహిళా ఉద్యోగుల ఈ–-నామినేషన్‌లను దాఖలు చేసేలా ప్రచారాన్ని నిర్వహించింది. సభ్యత్వాల సంఖ్యను 92 లక్షలకు చేరుకోవడం ద్వారా ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తన లక్ష్యాన్ని అధిగమించింది. వీరిలో 70 లక్షల మంది ఉద్యోగులు మహిళలను తమ నామినీలుగా ఎంచుకున్నారు, తద్వారా భార్యాభర్తలు, కుమార్తెలు, తల్లులకు అధికారం కల్పించారు. మహిళా సభ్యుల ఈ–-నామినేషన్‌లను పెంచడానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఫీల్డ్ ఆఫీస్‌ల ద్వారా ప్రత్యేక శిబిరాలను నిర్వహించింది. కంపెనీలతో, సంస్థలతో చర్చించడానికి ప్రత్యేకంగా వారం రోజుల డ్రైవ్ కూడా నిర్వహించింది.   10415 సంస్థలు తమ మహిళా వర్క్‌ఫోర్స్ కోసం 100శాతం ఈ–-నామినేషన్‌లను అందజేశాయి. దేశంలోని అగ్రశ్రేణి 100 సంస్థల నుండి మొత్తం 7 లక్షల ఈ–-నామినేషన్‌లను మహిళా సభ్యులు దాఖలు చేశారు.

 

చెన్నై జోన్ గరిష్ట సంఖ్యలో క్లెయిమ్‌లను స్వీకరించి  ప్రాసెస్ చేసింది.  ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ కోయంబత్తూర్ రీజనల్ ఆఫీసు గరిష్టంగా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసింది. అటువంటి 7 లక్షల ఈ–-నామినేషన్లలో, తెలంగాణ జోన్ వాటా 44శాతం ఉంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తెలంగాణ జోన్‌కు చెందిన నిజామాబాద్, కార్యాలయం దాఖలు చేసిన మొత్తం ఈ–నామినేషన్‌లలో 39శాతం బీడీ యూనిట్ల నుంచి ఉన్నాయి. ఈ కార్యాలయాలకు ప్రత్యేక గుర్తింపు అవార్డు లభించింది. ఇది 5 మార్చి 2022 నాటికి అన్ని మహిళల క్లెయిమ్‌ల ప్రాసెసింగ్‌ను లక్ష్యంగా చేసుకుంది. మార్చితో ముగిసిన ఈ కార్యక్రమం వారం రోజుల కార్యక్రమంలో మొత్తం రూ. 638 కోట్ల విలువైన 144069 మహిళల క్లెయిమ్‌లను పరిష్కరించింది. గత సంవత్సరంలో ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ తన ఢిల్లీ ఆఫీసులలో ఒకదానిలో తన మహిళా చందాదారుల  అన్ని క్లెయిమ్‌లను పరిష్కరించే పైలట్‌ కార్యక్రమాన్ని నిర్వహించింది. మహిళా దినోత్సవం 2022ని ప్రాధాన్య సేవల సాధికారత ప్రదర్శనగా ప్రతీకాత్మకంగా జరుపుకున్నారు.

నోయిడాలోని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ  చిన్న, మధ్య  పెద్ద సంస్థల  మూడు విభాగాలలో ఈ–-నామినేషన్లలో అగ్రగామిగా నిలిచింది. చిన్న వర్గం 100–-200 మధ్య స్థాపన చందాదారులు ఉంటారు. 201–-200 మధ్య సభ్యులు ఉండేవి మధ్యస్థ సంస్థలు. పెద్ద వాటిని 500 లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులుగా నిర్వచించారు. మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వీసెస్ ప్రైవేట్ ఆఫ్ ఢిల్లీ లిమిటెడ్, ఎం/ఎస్ యూఫ్లెక్స్ ప్రైవేట్  అనే రెండు సంస్థలు భారీగా ఈ–నామినేషన్లను అందజేశాయి. నోయిడా  దేశంలోని టాప్ 75 సంస్థలలో ఒకటిగా ఉంది, ఇది గరిష్ట సంఖ్యలో ఈ–-నామినేషన్‌లను దాఖలు చేసింది. మొత్తం 75 సంస్థల తరపున అవార్డులను అందుకుంది. ప్రత్యేక ప్రశంసలను పొందింది. ఈరోజు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థతో అన్ని మహిళా వాటాదారుల పరస్పర చర్యలను అందించడానికి మొదటి మహిళా సాధికారత డెస్క్‌గా చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీ  ముంబైలలో మంత్రి వర్చువల్ “మహిళా సాధికారత డెస్క్‌లను” ప్రారంభించారు. ఈఎస్ఐసీ నుండి 03 మంది మహిళా కరోనా వారియర్స్ అయిన డాక్టర్ జయ శివ కుమార్ భలే, ఆంధ్రప్రదేశ్ నుంచి  ఉమా గోపీనాథ్, మెడికల్ ఆఫీసర్ కేకే నాగర్, మీనాక్షిలకు కూడా మంత్రి గుర్తింపు అవార్డులను పంపిణీ చేశారు.   భారతదేశంలో మొదటిసారిగా గనుల్లో పనిచేసిన 04 మంది మహిళా గని కార్మికులను సత్కరించారు. వీరిలో అరుణ నారాయణ్ సంకటాల, బిపాషా బిస్వాస్, భూగర్భ గనుల నుండి యోగేశ్వరి రాణేతో పాటు సంధ్యా రసకట్ల ఉన్నారు.

 

***



(Release ID: 1804412) Visitor Counter : 137